తొలి అమెరికా మహిళా రాయబారిగా సౌదీ యువరాణి రీమా బింట్ బందారు


Sun,March 10, 2019 01:02 AM

Reema-bint-Bandar
సౌదీ అరేబియా రాజు తొలిసారిగా ఒక మహిళా ప్రతినిధిని అమెరికా రాయబారిగా నియమించారు. ఆమె యువరాణి రీమా బింట్ బందార్. జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత రెండుదేశాలమధ్య ఉన్న సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం కొంత మైత్రీబంధం పెంచుతుందని ఆశిస్తున్నారు. దీంతో సౌదీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా రాయబారిగా యువరాణి రీమా నిలిచారు. సౌదీ రాజ్యంలో మహిళా సాధికారతపై అగ్రశ్రేణి న్యాయవాదిగా కొనసాగుతున్న రీమా బింట్ ప్రస్థానం.

యువరాణి అంతకుముందు సౌదీ రాజ్యంలోని జనరల్ ఎమిరెట్స్ అథారిటీలో పనిచేసారు. క్రీడల్లో మహిళ ల భాగస్వామ్యం పెంచేందుకు కృషిచేసారు. సౌదీ రాజ్యంలో మహిళా సాధికారతపై అగ్రశ్రేణి న్యాయవాదిగా కొనసాగారు. మహిళా కార్యకర్తలను జైలుపాలుచేయడంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీస్ అదుపులో ఉండగానే వారిని లైంగికంగా వేధించడం, హింసించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సంబంధాలు కొనసాగాలనీ: అమెరికా రాయబారిగా ఇప్పటివరకూ రాకుమారుడు ఖలీద్ బిన్ సల్మాన్ కొనసాగాడు. సౌదీ ప్రభుత్వ విమర్శకుడు, పాత్రికేయుడు ఖషోగ్గి గత అక్టోబర్(2018)లో టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయంలో హత్యకు గురయ్యాడు. సల్మానే ఈ హత్య చేయించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సౌదీపై అమెరికా ఆగ్రహంతో ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలూ కొంత దెబ్బతిన్నాయి. దీంతో రాయబారి మార్పు తప్పనిసరి అయ్యింది. రీమా నియామకంతో అమెరికాతో తన సంబంధాలు పునరుద్ధరించుకున్నట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.

తండ్రి వారసత్వమే: రీమా తండ్రి బందార్ బిన్ సుల్తాన్ 1983 నుంచి 2005 వరకు అమెరికాలో సౌదీ రాయబారిగా ఉన్నారు. బందార్ కెరీర్ పరంగా మంచి పేరు ను గడించారు. సౌదీ జాతీయ భద్రతా సమాఖ్య అధికారి సౌదీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత 1983 నుంచి సౌదీ రాజ్యానికి అమెరికాలో దౌత్యవేత్తగా 2005 వరకు పనిచేశారు. 2015లో ఆయన పదవీ విరమణ చేశారు. 2005లో సౌదీ అరేబియాకు తిరిగి వచ్చేశాక మంచి పారిశ్రామికవేత్తగా కూడా రీమా బందార్ గుర్తింపు పొందారు. ఆమెకు ఈ నియామకం వారసత్వ పరంగా సౌదీ అరేబియా స్థాపకులు అబ్దుల్ అజీజ్ మనవడే రీమా తండ్రి బందార్.

అమెరికా కొత్తేమీ కాదు: సౌదీలోని రియాద్‌లో 1975లో జన్మించిన యువరాణి రీమా అమెరికా రాజకీయాలు, సమాజంపై మంచి అవగాహన కలిగి ఉంది. ఆమె తండ్రి అమెరికాలో రాయబారిగా ఉన్న సమయంలో అక్కడే విద్యను అభ్యసించారు రీమా. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో మ్యూజియం స్టడీస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత రియాద్ తిరిగి వచ్చారు. తన తల్లి తరపు నుండి ప్రిన్స్ ఫైజల్ బిన్ తుర్కి బిన్ నాజిర్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2012లో ఆమె భర్త నుండి విడాకులు తీసుకున్నారు.

అనుభవమే అవకాశమిచ్చింది: సౌదీ గతంలో రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ దగ్గర సలహాదారుగా కూడా రీమా పనిచేశారు. మొహ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో మహిళల అభ్యున్నతికి ఆమె రీమా బందార్ కృషి చేశారు. ఉద్యోగావకాశాల్లో సౌదీ మహిళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గతేడాది వాషింగ్టన్‌లో మాట్లాడుతూ చెప్పారు. ఇంగ్లీషు, అరబిక్ భాషలు అనర్గళంగా మాట్లాడగల రీమా త్వరలోనే దౌత్యాధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సవాళ్లను ఎదుర్కొవాలి: ఒక మహిళ ఉన్నత స్థానాన్ని అధిష్టించడం ఇది సౌదీ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. తను కొత్తగా చేపట్టనున్న బాధ్యతలపై మాట్లాడిన రీమా సామాజికంగా చాలా సవాళ్లను తాను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.
Reema-bint-Bandar1

గిన్నీస్‌లో స్థానం

అమెరికానుండి తిరిగి వచ్చిన తర్వాత రీమా రియాద్‌లో మహిళా సాధికారత కోసం కృషి చేశారు. అలాగే వ్యాపారవేత్తగా మహిళల కోసం జిమ్, స్పాను నిర్వహించారు. ఆ తర్వాత లక్జరీ రిటైల్ కార్పోరేషన్‌ను నిర్వహించారు. మహిళల ఆరోగ్య అవగాహన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కొంతకాలం క్రితం ఆమె ప్రపంచంలోనే అతిపెద్దదైన మానవ అవగాహన రిబ్బన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.ఇక ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన మధ్యతూర్పు ఆసియాలోని బలమైన తొలి 200 మహిళల్లో రీమా బందారుకు కూడా చోటు దక్కింది.

- మధుకర్ వైద్యుల,
సెల్: 91827 77409

1255
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles