ర్యాపర్.. రణ్‌వీర్!


Sun,March 10, 2019 01:08 AM

Ranveer-Singh
అల్లాఉద్దీన్ ఖిల్జీగా పద్మావత్ సినిమాలో తనలోని నటనా చాతుర్యాన్ని చూపించి, తాజాగా గల్లీబాయ్‌తో మరోసారి హిట్ కొట్టాడు రణ్‌వీర్ సింగ్. సినిమాల్లో, టీవీల్లో మనకు కనిపించే రణ్‌వీర్ సింగ్‌లో చాలామందికి తెలియని విషయాలున్నాయి. ఆ విశేషాలతో ఈ వారం మరోకోణం..

రణ్‌వీర్‌సింగ్ అసలు పేరేంటో తెలుసా? రణ్‌వీర్ సింగ్ భవాని. తన ఇంటిపేరైన భవాని అనే పేరును తన పేరుతో కలిపి పెట్టుకోవడానికి రణ్‌వీర్ ఇష్టపడడు. ఇతర నమ్మకాల వల్ల కాదు గానీ.. ఇంటిపేరు పెట్టుకుంటే తన పేరు చాలా పొడుగ్గా ఉంటుందని ఇంటిపేరు తీసేశాడు. రణ్‌వీర్‌కి అమ్మంటే చాలా ఇష్టం. నేను అమ్మకొంగు చాటు కొడుకును అని గర్వంగా చెప్పుకుంటాడు. చిన్నప్పటి నుంచి రణ్‌వీర్ హైపర్ ఆక్టీవ్. ఏ విషయంలో అయినా చాలా తొందరగా రియాక్ట్ అవుతాడు. బుద్ధిగా, నిశ్శబ్ధంగా అస్సలు కూర్చోలేడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ పక్కవారిని ఆటపట్టిస్తూ ఉంటాడు. రణ్‌వీర్‌కి నిద్రంటే చాలా ఇష్టం. రోజంతా పడుకోమన్నా ఏమాత్రం ఆలోచించకుండా నిద్రపోతాడు. క్లాస్‌రూంలో ఒకవైపు టీచర్ పాఠం చెప్తుంటే షారుక్ ఖాన్ దిల్‌సే సినిమాలోని చయ్య చయ్య.. చయ్యా చయ్యా అనే పాట వింటూ టీచర్ కంట్టో పడ్డాడు. టీచర్‌కి కోపం వచ్చి రణ్‌వీర్‌ని క్లాసులోంచి ఒకరోజు సస్పెండ్ చేసింది. పదహారేండ్ల వరకు రణ్‌వీర్ బొద్దుగా ఉండేవాడు. ఆ తర్వాతే కొవ్వు కరిగించి, కండలు పెంచాడు. అర్జున్ కపూర్, రణ్‌బీర్ ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్. వీరిద్దరూ ఒకచోట కలిస్తే మూడోవ్యక్తిని ఓ రేంజ్‌లో ఆట పట్టిస్తారు.
Ranveer-Singh1
రణ్‌వీర్‌కి జంక్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. నూడుల్స్, స్కెజ్వాన్, చైనా వంటకాలు ఇష్టంగా తింటాడు. రణ్‌వీర్ నెయ్యితో రుచికరమైన శాఖాహార వంటలు చేస్తాడు. రణ్‌వీర్ మైనస్ పాయింట్ ఏంటో మీకు తెలుసా? చాక్లెట్లు, స్వీట్లు అంటే రణ్‌వీర్‌కి చాలా ఇష్టం. లంచ్, డిన్నర్ తర్వాత కచ్చితంగా స్వీట్ తింటాడు. సినిమాల్లోకి రాకముందు రణ్‌వీర్ సింగ్ ఓ ప్రైవేట్ అడ్వైర్టెజింగ్ ఏజెన్సీకి కాపీ రైటర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మోడలింగ్‌లో ప్రవేశిద్దామనుకున్నాడు. కానీ అదెందుకో తనకు సూట్ కాదనుకొని రూటు మార్చి ఓ అండ్ ఎం కంపెనీలో కాపీ రైటర్‌గా చేరాడు. నటుడి కంటే ముందు రణ్‌వీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. రణ్‌వీర్‌కి పెద్దగా ఆర్థిక లావాదేవీల గురించి తెలియదు. అందుకే వ్యాపార వేత్త అయిన రణ్‌వీర్ తండ్రే ఆ విషయాలన్నీ చూసుకుంటాడు. బ్యాండ్ బాజా బారాత్ సినిమా కోసం ఆదిత్య చోప్రా రణ్‌వీర్‌ని పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు రణ్‌వీర్ కారిడార్‌లోకి వెళ్లి భోరున ఏడ్చేశాడు. ఎందుకేడ్చావని అడిగితే ఇప్పటికీ తెలియదనే సమాధానం చెప్తాడు. ఒక సినిమా అవకాశం వచ్చిందంటే.. దాని తర్వాత వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటారు. కానీ రణ్‌వీర్ మాత్రం మూడు భారీ బడ్జెట్ సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నాడు.
Ranveer-Singh2
మీకో విషయం తెలుసా? రణ్‌వీర్‌కి ర్యాప్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. కాస్త ఖాళీ సమయం చిక్కితే చాలు.. తనే సొంతంగా ర్యాప్‌సాంగ్‌లు పాడుతూ ఫోన్‌లో రికార్డు చేస్తుంటాడు. చాలా పబ్లిక్ ఈవెంట్స్‌లో ర్యాప్ పాడాడు. కండోమ్ యాడ్‌లో నటించిన ఏకైక బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. ఆ తర్వాత ఆ యాడ్ రద్దు చేశారు. కాలేజీ రోజుల్లో హేమామాలిని కూతురు అహనా డియోల్‌తో రణ్‌వీర్ ప్రేమాయణం నడిపాడు. రణ్‌వీర్ ఏం చేసినా ముగ్గురి సలహాలు తప్పకుండా తీసుకుంటాడు. అందులో ఒకరు తండ్రి, తొలి ప్రొడ్యూసర్ ఆదిత్యా చోప్రా, తొలి దర్శకుడు మనీష్ శర్మ. ఇండియానా యూనివర్సిటీలో రణ్‌వీర్ క్రియేటీవ్ రైటింగ్ శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్నాడు. థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాడు. రామ్‌లీలాలో రణ్‌వీర్ నటన చూసి అమితాబ్ మెచ్చుకున్నాడు. అంతేకాదు.. స్వయంగా ఆయన దస్తూరితో లెటర్ రాసి రణ్‌వీర్‌కి పంపాడు.

Ranveer-Singh3

రణ్‌వీర్ ఎప్పుడూ చెప్పే మాట

నాకు 35 ఏండ్లు వచ్చేసరికి నేను సూపర్ సక్సెస్‌లో ఉండాలి. గోవాకు దగ్గరలో ఓ వింటేజ్ ఇల్లు కొనాలి. నా గ్యారేజ్‌లో కొన్ని వింటేజ్ కార్లు పార్క్ చేసి ఉండాలి. లాన్‌లో నా పిల్లలు ఆడుకుంటూ ఉండాలి. 35 కల్లా నన్ను నేను విశ్రాంతి మోడ్‌లో చూసుకోవాలి. లేదంటే.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ 35 నిండేసరికి నా రాజ్యానికి నేనే రాజై కొనసాగాలి
- రణ్‌వీర్ సింగ్

- ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

1263
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles