దేశమును ప్రేమించుమన్నా..!


Sun,March 10, 2019 01:18 AM

Nation
దేశభక్తి కమర్షియల్ ఎలిమెంట్ కాదు. కలెక్షన్లు తీసుకొచ్చే కథ అంతకన్నా కాదు. ఇలాంటి సినిమాలకు లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. అయినా చిత్రబృందం ధైర్యంగా ఒక ఉద్వేగాన్ని, ఒక సందేశాన్ని ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. దేశభక్తి, యుద్ధం, సైన్యం, టెర్రరిజం కథాంశం ఏదైనా తెరమీదికి తేవాలంటే చాలా కష్టమే. ఇలా కొన్ని సినిమాలు మొత్తం ఆర్మీ నేపథ్యంతో పాటు మరి కొన్ని ప్రేమానుబంధాలు జోడించి తీసిన తెలుగు సినిమాలున్నాయి.

ghazi

ఘాజీ

2017 ఫిబ్రవరిలో విడుదలైంది. సినిమా విషయానికొస్తే 1971లో ఇండియా, పాకిస్థాన్‌కు జరిగిన వాస్తవ యుద్ధ కథనం. ఇండియన్ సబ్‌మెరైన్ ఎస్21కు, పాకిస్థాన్ జలంతర్గామి ఘాజీకి మధ్య జరిగే వాటర్ వార్ ఈ కథ. బంగ్లాదేశ్‌లో పోరాడుతున్న తమ సైనికులకు సాయం చేయడానికి పాకిస్థాన్ ఆర్మీ కరాచీలోని నేవల్‌బేస్ నుంచి ఘాజీ సబ్‌మెరైన్‌ను పంపుతుంది. ఈ సబ్‌మెరైన్ భారతీయ జలాల ద్వారా వెళ్లి బంగ్లాదేశ్ చేరుకోవాలి. సరిహద్ధు జల భాగంలో కాపలా ఉన్న విక్రాంత్‌ను కూల్చాలని పాకిస్థాన్ ప్లాన్ వేస్తుంది. దీన్నంతటినీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ఇండియా ఎస్ 21ను ఘాజీ మీదకు పంపుతుంది.
రచన-దర్శకత్వం : సంకల్ప్
నటీనటులు : రానా, కేకే మీనన్

cheliya

చెలియా

2017 ఏప్రిల్‌లో విడుదలైన తమిళ్ మూవీ. తెలుగులోనూ విడుదలైంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ పైలెట్‌గా హీరో విధులు నిర్వహిస్తాడు. 1999 కార్గిల్ యుద్ధానికి పాకిస్థాన్ సరిహద్దులు దాటి గగన తలంలోకి వెళ్తాడు హీరో. కానీ జెట్‌ను పాకిస్థాన్ కూల్చేస్తుంది. పారచ్యూట్ సాయంతో ఎగ్జిట్ అయిన హీరో పాక్ భూభాగంలో పడి, సైన్యంలో బంధీగా ఉంటాడు. ఈ సందర్భంలో అతని ప్రేమను గుర్తు చేసుకుంటాడు. అంతకుముందే ఆర్మీలో వైద్యురాలిగా ఉన్న హీరోయిన్‌తో ప్రేమ కథ ఉంటుంది. ఒకవైపు ప్రేమ, మరో వైపు జెట్ పైలెట్‌గా అతని బాధ్యత ఆద్యాంతం ఉద్వేగంగా సాగుతుంది ఈ సినిమా. చెలియా చిత్ర దర్శకునికి కార్గిల్ యుద్ధం గురించి, యుద్ధ ఖైదీల గురించి సలహాలు ఇచ్చింది కూడా మన అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమానే.
దర్శకత్వం : మణిరత్నం
నటీనటులు : కార్తీ, అదితిరావు హైదరి

kanche

కంచె

2015లో విడుదలైంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది. యుద్ధ సమయంలో ఘటనల ఆధారంగా తీసిన పరిశోధనాత్మక చిత్రం. మరో వైపు హీరో అగ్రకుల అమ్మాయిని ప్రేమిస్తాడు. నిమ్నకులస్థుడైన హీరోను తప్పించడానికి అమ్మాయి కుటుంబం వివిధ పథకాలు వేస్తుంది. కానీ అందరినీ ఎదరించి, కులం కట్టుబాట్లను ఛేదించి ఒక్కటవుతారు. ఇలా ఓ యుద్ధకథ, మరో వైపు సైనికుని ప్రేమ కథ విడివిడిగా సాగుతాయి.
కథ-దర్శకత్వం : క్రిష్
నటీనటులు : వరుణ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్

mehbooba

మెహబూబా

2018 మే లో విడుదలైంది. సినిమాలో హీరోకు దేశభక్తి ఎక్కువ. సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచీ అనుకుంటాడు. దీంతో పాటు ఏవో జ్ఞాపకాలు హీరోని వెంటాడుతాయి. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్‌కు వచ్చిన పాకిస్థానీ అమ్మాయితో ప్రేమ లో పడతాడు. కొన్ని ట్విస్టుల తర్వాత హీరో తన ప్రేమ కోసం పాకిస్థాన్‌కు వెళ్తాడు. అక్కడ దుండగుల చేతిలో దాడిని ఎదుర్కొంటాడు. అక్కడ తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడో తెలియజేస్తుంది కథ..
కథ-దర్శకత్వం : పూరీ జగన్నాథ్
నటీనలు : ఆకాశ్ పూరీ, నేహా శెట్టి

thupaki

తుపాకీ

2012లో తెలుగులో విడుదలైన తమిళ్ సినిమా . ఉగ్రవాదుల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. హీరో ఆర్మీ కమాండర్. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పథకాన్ని ముందే పసి గట్టి వాళ్లందరినీ చంపేయాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే రంగంలోకి దిగుతాడు. మిలటరీ స్నేహితులను రంగంలోకి దింపి విషయం వివరిస్తాడు. అందరూ ఒక్కటై శత్రు శిబిరాలను పసిగడతారు. దీంతో పాటు ఉగ్రవాదుల పథకాన్ని కొల్లగొట్టి వేర్వేరు చోట్ల వేర్వేరు ఉగ్రవాదులను ఏక కాలంలో కాల్చేసి విజయం సాధిస్తారు.
కథ-దరకత్వం : ఏఆర్ మురుగదాస్
నటీనటులు : విజయ్, కాజల్ అగర్వాల్

- వినోద్ మామిడాల

1239
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles