నీ సంతోషమే నాకు చాలు.. అదే వేవేలు!


Sun,March 10, 2019 01:21 AM

love
అసలు తప్పంతా నాది. నా ప్రేమను ఆ అమ్మాయితో చెప్పి ఉంటే.. ఔననో, కాదనో చెప్పేది. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నది. నా విషయం చెప్పి తనను బాధపెట్టలేను. అందుకని నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు తన సంతోషమే నాకు ముఖ్యం. అదే నాకు చాలు. నా ప్రేమ కథను సినిమా కథగా రాసుకున్నాను.

ఇలా కవితలు రాస్తూ ఫ్రెండ్స్‌కి వినిపించాను. వాళ్లందరూ బాగుందని మెచ్చుకున్నారు. నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం నా ఫ్రెండ్స్‌తో ఎవరికీ చెప్పలేదు. వాళ్లలో ఒకడు వచ్చి నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు.


ప్రేమ పుట్టినప్పుడు బాగుంటుంది. అదో మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. విడిపోయేటప్పుడే అది చాలా కఠినంగా అనిపిస్తుంది. పుట్టినప్పుడు మధురంగా.. పోయేటప్పుడు కఠినంగా అనిపించడం ప్రేమ సహజ లక్షణం. ప్రేమలో పడటం మనిషి నైజం. ఇది నా ప్రేమ కథ. నా ప్రేమకు.. కవిత్వానికి సంబంధం ఉంది.

ఏదో తెలియని ఉల్లాసం. తనని చూసిన తొలిసారి నా మనసులో కలిగింది. మామూలుగా కథలు రాసుకునే నాకు తనను చూడగానే కవిత్వం తన్నుకొచ్చింది.
చూసిందే తొలిసారి.. నా మనసంతా చేజారి
నీవైపే వస్తుంది.. నా మనసు నీదంటూ
ఈ కవితను ట్యూన్ కట్టి పాటగా రాసుకున్నాను. ప్రేమను ఈ పాట రూపంలో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ చెప్పలేకపోయాను. దూరం నుంచి తనని చూస్తూ సంతోషించేవాడిని. ఏదో వంకతో తన ఊరికి వెళ్తూ దూరం నుంచి తనని చూస్తూ ఆనందపడేవాడిని. నా ప్రేమాయణాన్ని ఎన్నో కవితల రూపంలో రాసుకున్నాను.

నీకు నేను నాకు నువ్వు ఇద్దరం
ఒక్కటైతే నువ్వు నేను ఇద్దరం
మన జోడి నం.1 అవుతుందన్న ఆశతో
నువ్వు ఔనన్నా కాదన్నా నా
మనసంతా నువ్వుఅని
నీ స్నేహం ఉంటే చాలని
ఇలా కవితలు రాస్తూ ఫ్రెండ్స్‌కి వినిపించాను. వాళ్లందరూ బాగుందని మెచ్చుకున్నారు. నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం నా ఫ్రెండ్స్‌తో ఎవరికీ చెప్పలేదు. వాళ్లలో ఒకడు వచ్చి నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు.
అబ్బే అలాంటిదేమి లేదు. ఎందుకలా అడిగాడు? అని నేను ప్రశ్నించాను. కామెడీ కథలు రాసుకునే నీ బ్రెయిన్‌కి ఇంత మంచి ప్రేమ కవిత తట్టిందంటే ఆశ్చర్యమే. ఫర్వాలేదు. కానీ ఆ అమ్మాయికి మాత్రం చెప్పు అని చెప్పి వెళ్లిపోయాడు.
అతను చెప్పింది నిజమే. నేను నా ప్రేమను నా ఫ్రెండ్స్‌కి చెప్పలేకపోతున్నాను. మరి ఆ అమ్మాయికి ఎలా చెప్పను? ఈసారి చెబుతా అని బయలుదేరాను. అంతలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ రెండు నెలలు తననే ఊహించుకుంటూ ఓ ప్రేమకథ రాసుకున్నాను. రేపు తనను కలుస్తున్నాననే ఉల్లాసం, రాత్రి మొత్తం తన ఆలోచనలే. నిద్రపట్టడం లేదు. ఎప్పుడు తెల్లారుతుందా అనే తొందరపాటు. చాలా ఆలస్యంగా తెల్లారింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా తనకోసం పరిగెత్తాను. కానీ దురదృష్టం ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లయిపోయింది. చాలా బాధపడ్డాను. ఆ బాధను తట్టుకోలేకపోయాను.

అసలు తప్పంతా నాది. నా ప్రేమను ఆ అమ్మాయితో చెప్పి ఉంటే.. ఔననో, కాదనో చెప్పేది. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నది. నా విషయం చెప్పి తనను బాధపెట్టలేను. అందుకని నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు తన సంతోషమే నాకు ముఖ్యం. అదే నాకు చాలు. నా ప్రేమకథను సినిమా కథగా రాసుకున్నాను. మొదట ఫెయిల్ అయిన నా కథలో మరో అమ్మాయి చేరినట్లయితే ఆ అమ్మాయితో నా ప్రేమ విషయాన్ని ఏ విధంగా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఒక సినిమాగా తీసి తెరపైన రచయితగా నా పేరును చూసుకోవాలని నా కోరిక. అదే ఆ అమ్మాయితో నా జ్ఞాపకం అనుకుంటాను.

చిత్రంగా మొదలైన నా ప్రేమకథ
వియ్యాల వారి కయ్యాలుగా విడిపోయింది.
ఒక్క అబద్దం కూడా చెప్పని
లక్ష్మీపుత్రుడు నా మనసు
నీకు తెలుసన్నావు నీకు నేను నాకు నువ్వు
ఇద్దరం ఒక్కటైతే నువ్వునేను
ఎప్పటికైనా మన జోడి నం.1 అవుతుందన్న
ఆశతో నువ్వు ఔనన్నా కాదన్నా నా
మనసంతా నువ్వుఅని
నీ స్నేహం ఉంటే చాలని
వచ్చే హోలీ పండుగ రోజున
శ్రీరామ్ భక్తడైన అరకులోన ఆంజనేయ స్వామి మందిరంలో మనం కలుసుకోవాలని ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను.

-నీ
పంచ్‌రామ్

1503
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles