ఐస్‌క్రీమ్.. చెప్పేను అసలు ముచ్చట!


Sun,March 17, 2019 02:07 AM

Ice-cream
ఎండాకాలంలో చల్లదనాన్నిచ్చేవి ఐస్‌క్రీములు.. పండ్ల రుచుల్లో సైతం ఇవి ఇప్పుడు మనల్ని పలుకరిస్తున్నాయి.. ఆ హిమక్రీములను ఆస్వాదించాలంటే మనసుండాలంటారు.. కానీ జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కో ఐస్‌క్రీమ్ టేస్ట్‌ని ఇష్టపడేవాళ్లకి.. ఒక్కో మనస్తత్వం ఉంటుందట.. అది మీకు తెలుసా?చల్లగా గొంతులోకి దిగే.. ఆ ఐస్‌క్రీమ్‌ని చప్పరిస్తూ.. మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోండి మరి..
Ice-cream1
ఐస్‌క్రీమ్ అంటే.. పాలు, మీగడ, చక్కెర, చల్లదనం ఇవే ప్రధానంగా ఉండేవి. కానీ, అన్ని పండ్ల రుచులు ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లోనూ వచ్చి చేరాయి. అంతేకాదు.. బిర్యానీ, చాట్ ఇలా అన్నీ ఫ్లేవర్లూ ఐస్‌క్రీమ్‌ని ఆక్రమించేశాయి. తియ్యతియ్యని ఐస్‌క్రీమ్ కూడా ఘాటుగా మారిపోయింది. ఒక్కసారయినా ఐస్‌క్రీమ్ రుచి చూడకపోతే జన్మనే వృథా అనేస్తున్నారు జనం. ఇందులోనూ మాకు నచ్చదనే వ్యక్తులు లేకపోలేదు. కానీ వాళ్లు ఒక్కసారి తీరొక్క ఐస్‌క్రీమ్‌ని టేస్ట్ చేయాల్సిందేనంటున్నారు. ఏడుపుతో ఉండేవారికి ఈ చల్లదనం చాలా సాంత్వన ఇస్తుందట.
Ice-cream2

బ్లాక్ అండ్ వైట్..

వెనీలా ఐస్‌క్రీమ్.. పాల నురుగలా తెల్లగా ఊరిస్తుంటుంది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఇష్టంగా చప్పరిచ్చేస్తుంటారు. ఈ ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడేవాళ్లు చాలా సున్నిత మనస్కులట. కాకపోతే క్లాసిక్ అందాన్ని ఆస్వాదించలేని మనుషులు. ఎవరిలోనైనా మంచి కనిపిస్తే మెచ్చుకోలు స్వభావం వీరిలో ఎక్కువ ఉంటుంది. ఎలాంటి తొందర లేని, శాంత స్వభావులు వెనీలాని ఇష్టపడేవాళ్లు. ప్రతీరోజు ప్రశాంతంగా, సంతోషంగా ముగియాలని కోరుకుంటారు. ఇక చాక్‌లెట్ అంటే ఇష్టముండనిది ఎవరికి చెప్పండి. అమ్మాయిలయితే చాక్లెట్ అంటే ప్రాణమే ఇస్తారు. అందులోనూ ఆ ఫ్లేవర్‌లో ఐస్‌క్రీమ్‌ని ఎవరు కాదనగలరు? మరి ఈ ఇష్టమైన చాక్లెట్ తినేవాళ్లు.. స్వీయ ప్రేమికులై ఉంటారు. అంటే.. వారంటే వారికి అంతులేని అభిమానం ఉంటుందన్నమాట. ఆనందం వీరి సొంతం. చాలా విషయాలపైన బలమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేస్తుంటారు. విభిన్న అంశాలను పరిశోధించడంలో నిమగ్నమై ఉంటారు. ప్రపంచంలోని నలుమూలల ఉన్న స్నేహితుల దగ్గర నుంచి కిచెన్ వస్తువులను సేకరిస్తారు.
Ice-cream3

కాఫీ విత్ చిప్స్..

కాఫీ ఐస్‌క్రీమ్ అంటే ఇష్టమా? అయితే.. మీరు నలుగురిలో కలువడానికి చాలా సంకోచిస్తుంటారు. కాఫీ షాపుల్లో ఒంటరిగా కూర్చొని ఈ ఐస్‌క్రీమ్‌ని ఆస్వాదిస్తుంటారు. రాత్రుళ్లు మాత్రం లాంగ్ వాక్‌లు చేసి.. స్నేహితులను కలిసి పిచ్చాపాటి మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. మింట్ చాక్లెట్ చిప్స్‌తో ఐస్‌క్రీమ్ లాగిస్తున్నారా? అయితే మీరు కూల్ పర్సన్‌లాగా వ్యవహరిస్తారు. స్కూల్ లెవల్‌లో ఉన్నప్పుడు చాలా పాపులర్ పర్సన్ కాకపోయినా.. మీ చుట్టూ అందరూ చేరడానికి ఇష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లు. పరుగెత్తడం, ఫుట్‌బాల్ ఆటలంటే ప్రాణమిస్తారు. మీ చుట్టూ ఉండేవాళ్లు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారితో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.
Ice-cream4

కుకీలతో కిక్..

కుకీలు చాలా రకాలు. కానీ ఐస్‌క్రీమ్‌ల్లో కూడా కుకీస్‌తో చాలా రకాలుంటాయి. అందులో డఫ్ ఒకటయితే.. క్రీమ్ ఐస్‌క్రీమ్ మరొకటి. ఈ రెండింటినీ ఇష్టపడేవాళ్లవి భిన్న మనస్తత్వాలు. డఫ్ ఐస్‌క్రీమ్‌ని ఇష్టంగా తినేవాళ్లు.. చాలా క్రియేటివ్‌గా ఉంటారు. డెకరేషన్ ప్రాజెక్ట్‌లు చేయడంలో సిద్ధహస్తులు. తక్కువ బడ్జెట్‌లో పార్టీలు చేయాలనుకుంటుంటారు. ముదురు రంగుల మీద పెద్ద పెద్ద ప్యాటర్న్‌లు వచ్చే బట్టలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడేవాళ్లు.. ఎక్కువగా చిల్ అయ్యే టైప్. కుక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది. క్రీమీ ఐస్‌క్రీమ్ తినేవాళ్లలో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకునే టైప్ కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకోవాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ట్రెండ్స్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్స్‌ని సృష్టించడంలో వీళ్లదే ప్రథమ స్థానం అనుకోవచ్చు. ఇతరులు ఏమనుకున్నా వాళ్లకు నచ్చినదే చేసుకొని పోతారు.
Ice-cream4

సూపర్ కూల్..

పింక్.. పీచ్ కాంబినేషన్‌లో.. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే ఐస్‌క్రీమ్ స్ట్రాబెర్రీ. దీన్ని ఇష్టపడేవాళ్లలోనూ ఎనర్జీ ఎక్కువ. పైగా స్నేహితులంటే ప్రాణం ఇస్తారు. అందుకే వాళ్లు కూడా ఒక్కరోజు మిమ్మల్ని మిస్ అయినా తట్టుకోలేరు. పని చేయడమంటే కూడా ఈ ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడేవాళ్లకి చాలా ఇంట్రెస్ట్. అది కూడా పొద్దున్నే. జంతువులంటే మక్కువ ఎక్కువ. కారామిల్ ఐస్‌క్రీమ్‌ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా; అయితే వెంటనే చేయండి. చాలా తియ్యగా ఉంటుంది. దీన్ని ఇష్టపడేవాళ్లు.. యోగా, మెడిటేషన్‌ని కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. చాలెంజింగ్‌గా తీసుకొని పనిచేస్తుంటారు. వార్డ్‌రోబ్‌ని ఎప్పుడూ నీట్‌గా సర్దుకుంటారు. అలాగే అందులో ఎక్కువగా నల్లని దుస్తులను దాస్తుంటారు. పిల్లులంటే ప్రాణంగా చూసుకుంటారు. కాకపోతే మీరు కాస్త బిడియస్తులుగా ఉంటారు. అంతేకాదు.. ఇతరుల పట్ల చాలా కేరింగ్ ఉంటారు.

పిస్తా రాక్..

చాక్లెట్‌లో రాకీ రోడ్ ఐస్‌క్రీమ్ టేస్ట్ చేశారా? అయితే మీరు అడ్వెంచర్ పర్సన్. దేశాన్ని బైక్‌లపై చుట్టేయాలని కలలు కంటారు కదా! రోడ్డులాగే మీ జీవితంలోనూ ఎత్తు, పల్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఏ విషయన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటారు. రాత్రుళ్లు క్యాంప్‌ఫైర్ వేసుకొని, టెంట్‌ల కింద పడుకొని ఆ చుక్కలను చూస్తూ నిద్రించడం సరదాగా ఉంటుంది వీళ్లకు. పిస్తా లవర్స్.. ఇది మీ గురించే! మీరు చాలా రిజర్వ్‌డ్ పర్సన్. మీ లోకమే మీది. అందులోకి కొత్తగా ఎవరినైనా తీసుకోవాలంటే కాస్త ఆలోచిస్తారు. మీరొక యూనిక్ పర్సనాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ఎప్పుడూ విదేశీయానం చేయాలని కోరుకుంటుంటారు. మీకు ఇతరులను ఆకర్షించే శక్తి కూడా ఉంటుందండోయ్. కాబట్టి వీరితో ఇతరులు తస్మాత్ జాగ్రత్త!
Ice-cream5

చల్లచల్ల చల్లగా..

మంచుల్లా చల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌నే సోర్బెట్ అంటారు. దీన్ని ఇష్టపడేవాళ్ల కోసమే ఈ మాటలు.. వీరికి వీరి మాట తప్ప.. ఇతరుల మాట పట్టదు. ఇతరులు వీరిపై ఏదైనా జోక్ వేస్తే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ కోపాన్ని వీరు తగ్గించుకోవాలి. ఇళ్లన్నా.. మొక్కలన్నా ఇష్టం వీరికి చాలాచాలా ఇష్టం. గార్డెనింగ్ చేస్తూ సమయాన్ని అలా గడిపేస్తుంటారు. ఎన్నో పండ్ల ఐస్‌క్రీమ్‌లున్నాయి. కానీ అందులో బనానా చాలా స్పెషల్ అంటారు మనస్తతత్వ శాస్త్రవేత్తలు. వీళ్లు చాలా బ్రిలియంట్. పైగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఖాళీగా అస్సలు కూర్చోరు. జీవితంలో వీరు ఎప్పుడూ పరుగు పెడుతుంటారు. వీరంటే ఇతరులకు చాలా ప్రేమ ఉంటుంది. చాలా మందికి వీరు ఆదర్శంగా ఉంటారు.

- సౌమ్య పలుస

1155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles