90ఎం.ఎల్.. చాలా తక్కువ!


Sun,March 17, 2019 02:14 AM

90ML
నేను పోర్న్ స్టార్‌ని కాదు..
90ఎం.ఎల్. ట్రైలర్‌తో వచ్చిన ట్రోల్స్‌తో..
ఓవియా ఇలా స్పందించాల్సి వచ్చింది..
బోల్డ్ కంటెంట్‌తో తమిళంలో వచ్చిన ఈ సినిమా..
తెలుగులోనూ విడుదల కానున్నది..
తమిళనాట ఈ సినిమాపై వివాదాలు..
చర్చలు నడుస్తున్నాయి.. బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా పేరుతో ఆర్మీ కూడా ఉందండోయ్..
ఈ బిగ్ సెలెబ్రిటీ గురించి మరిన్ని సంగతులు..

2017లో తమిళ్ బిగ్‌బాస్‌తో ఓవియా మరింత పాపులర్ అయింది. గాయత్రి రఘురామ్, నమిత ఆమెను ఎంతగా బాధపెట్టినా పాజిటివ్‌గా స్పందించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

చెన్నై శరవణ స్టోర్స్‌కి మునుపు తమన్నా, హన్సికా మోత్వానీ అంబాసిడర్‌లుగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఆ ప్లేస్‌ని ఈ అమ్మడు కొట్టేసి అంబాసిడర్‌గా కొనసాగుతున్నది.

- ఓవియా అసలు పేరు హెలెన్ నెల్సన్.

- ఈమె కేరళలలోని త్రిషూర్‌లో ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

- తండ్రి చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకడం అలవాటు చేశాడంటున్నది. పదవతరగతి నుంచే పాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది.

- మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. మలయాళం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.

- బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక.. మళ్లీ బిగ్‌బాస్‌కి వెళ్లేందుకు ఇష్టం లేదని ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

- బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక.. శింబు, ఓవియో పెండ్లి చేసుకున్నట్లు వార్తలు, ఫొటోలు వచ్చాయి. అయితే (ఇదు నమ్ము ఆలూ) సినిమాలో నయన్, శింబు ఫొటోని మార్ఫింగ్ చేసి ఎవరో వైరల్ చేశారు.

- 2010లోనే కలవని అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. దీంతో ఆ తర్వాత సంవత్సరానికి 12 సినిమాలకు సంతకాలు కూడా చేసింది. షూటింగ్‌లు కూడా పూర్తయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలే విడుదలకు నోచుకున్నాయి.

90ఎమ్.ఎల్. సినిమా ద్వారా సింగర్ అవతారం కూడా ఎత్తింది ఓవియా. అందులో మారనా మట్టా అనే పాట పాడింది.

2017 సంవత్సరం బిగ్‌బాస్ విన్నర్ ఆరవ్‌ని ప్రేమించింది. అతడి ప్రేమ కోసం తహతహలాడింది. అతడు ప్రేమించకపోయేసరికి బిగ్‌బాస్ హౌస్‌లోని స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

తెలుగులో 2018లో తరుణ్ నటించిన ఇది నా లవ్‌స్టోరీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో మరో డైరెక్ట్ తెలుగు సినిమా చాన్స్ రాలేదు. కానీ తమిళ డబ్బింగ్ కాంచన 3ద్వారా మాత్రం మళ్లీ తెలుగులో కనిపించనున్నదీ అమ్మడు.

90ఎం.ఎల్ సినిమా తమిళంలో ఉదయం 5గంటల ఆటలకే విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యాజమాన్యం ప్రకటించింది. అదే కనుక జరిగితే.. మహిళా ఓరియెంటెడ్ సినిమా ఆ సమయానికి విడుదల కావడం మొదటిసారి అవుతుంది.

- సౌమ్య పలుస

1481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles