ఔరా.. సముద్ర వింతలు!


Sun,May 12, 2019 12:45 AM

ఈ ప్రపంచం ఎన్నో చిత్ర విచిత్రాలకు నెలవు. ఇవి మనుషులు సృష్టించిన అద్భుతాలు కావు. ప్రకృతి ప్రసాదించిన వరాలు. సహజసిద్ధంగా ప్రకృతి ఒడిలో ఒదిగిన సింగిడి వర్ణాలు. పరిశోధకులకు సైతం అంతుచిక్కనివి ఎన్నో. మచ్చుకు కొన్ని ఇస్తున్నాం. చూసేవారికి కనువిందు చేస్తూ.. అద్భుత అనుభూతిని పంచుతున్న ఆ సముద్రపు వింతలను మీరూ చూసేయండి.

మృతసముద్రం కనువిందు..


చైనాలోని బీజింగ్‌లో మృత సముద్రంగా పిలిచే యెన్‌చెంగ్ సాల్ట్ సరస్సు గులాబీ రంగులోకి మారింది. సముద్రానికి ఓ వైపు పూర్తిగా పింక్ కలర్‌లోకి మారి సందర్శకులని ఆకట్టుకుంటున్నది. సముద్రంలో ఉండే డ్యునలీల్లా సెలీనా శైవలాల కారణంగా ఈ జలాలు గులాబీ రంగులోకి మారినట్లు పరిశోధకులు చెబుతున్నారు. వంతెనకు ఓ వైపు ఆకుపచ్చ రంగు, మరోవైపు గులాబీ రంగుతో కనువిందు చేస్తున్నది.
Mrutha-samudram

నీరు కలువని సముద్రాలు..


గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం కలుస్తాయి. ఈ రెండు మహా సంద్రాలు ఇక్కడ కలవనైతే కలుస్తాయి కానీ నీరు మాత్రం కలువదు. రెండు సముద్రాల నీళ్ల రంగు వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నీళ్లు ఎలా ఉన్నా.. వేరే నీటితో ఇట్టే కలిసిపోతాయి. కానీ ఈ రెండు మహాసముద్రాల నీళ్లు ఒకదానితో మరొకటి కలువకపోవడం ఒక మిస్టరీ. ఒక నీరు హిమానీనదం నుంచి వచ్చింది. దీని నీరు లేత నీలం రంగులో కనిపిస్తుంది. నదుల నుంచి వచ్చిన నీటి రంగు ముదురు నీలంగా ఉంటుంది. ఈ రెండు మహాసముద్రాలు కలిసేచోట ఒక నురగ అడ్డుగోడగా ఏర్పడుతుంది. అక్కడ రెండింటి విభజన రేఖను స్పష్టంగా గుర్తించవచ్చు. చాలామంది పరిశోధకులు ఈ ప్రాంతంలో రీసెర్చ్ చేశారు. కానీ ఎవరూ దీనికి సరైన సమాధానం కనిపెట్టలేకపోయారు.

పొన్నాని బీచ్‌లో వింత..


కేరళ వరదలు ఆ రాష్ర్టానికి విషాదం మిగిల్చినా.. ఓ అద్భుతాన్ని సృష్టించాయి. జల ప్రళయం నుంచి తేరుకుంటున్న ప్రజలకు ఈ వింత కనువిందు చేసింది. మళప్పురం ప్రాంతంలోని పొన్నాని బీచ్ కూడా వరద ప్రభావానికి గురైంది. భారీ ఎత్తున కొట్టుకువచ్చిన ఇసుక పొన్నాని తీరంలో మేటలు వేసింది. అది ఎలా ఉందంటే.. సముద్రాన్ని చీల్చినట్లుగా. అర కిలోమీటర్ వరకూ ఓ రహదారే ఏర్పడింది. ఈ ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రాలు కూడా కలుస్తాయి. ఈ రెండు సముద్రాల్లోని జలాలు కూడా భారీ ఎత్తున ఇసుక, మట్టిని తీసుకువచ్చాయని, అవే మేటలుగా ఏర్పడ్డాయని పరిశోధకులు చెబుతున్నారు.

గులాబీ రంగులో హిల్లియర్ లేక్..


పశ్చిమ ఆస్ట్రేలియాలోని మిడిల్ ద్వీపంలో గులాబీ రంగులో ఉండే హిల్లియర్ సరస్సు ఉంది. దీని చుట్టూ యూకలిప్టస్, పేపర్ బ్యాక్ చెట్లు ఉంటాయి. ఇవి దక్షిణ సముద్రం నుంచి ఈ సరస్సును విడదీసినట్లుగా ఉంటాయి. ఈ హిల్లియర్ లేక్.. మెరిసే గులాబీ రంగులో ఉండటం వల్ల అనేకమంది శాస్త్రవేత్తలు, పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఈ సరస్సు జలాలకు గులాబీ రంగు ఎలా వచ్చిందన్న అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. డున లైలా సలీనా అనే సూక్ష్మక్రిముల వల్ల ఈ రంగు వచ్చిందని కొందరు అంటుంటే.. హాలో ఫిలిక్ క్రిములు ఉప్పు కయ్యలపై పేరుకొని ఉండటం వచ్చిందని మరికొందరు అంటున్నారు. కానీ ఏదీ శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఈ సరస్సులో ఉప్పు శాతం అధికంగా ఉన్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సరస్సును ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా గుర్తించి, ఉప్పు ఉత్పత్తిని రద్దు చేసింది.

1057
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles