తమ్ముళ్లొస్తున్నారు!


Sun,June 9, 2019 02:08 AM

ఏ రంగంలోనైనా.. వారసులు తల్లిదండ్రుల రంగాల్ని ఎంచుకోవడం మామూలే! ప్రత్యేకంగా సినిమా రంగంలో. హీరో.. హీరోయిన్ల కొడుకులు.. కూతుర్లు వారసులుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్లు.. ఆ తర్వాత తమ్ముళ్లు రావడం మొదలైంది.. ఈ సంవత్సరం ప్రత్యేకంగా.. ఈ తమ్ముళ్లు తెరంగేట్రం చేస్తున్నారు.. మరి వారి గురించే ఈ ఫస్ట్ ఇన్నర్.

- సౌమ్య పలుస


Vijay-Devarakonda

ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు.. ఇతర వుడ్‌లల్లోనూ సూపర్ హీరో. ఈ హీరో తమ్ముడే ఆనంద్ దేవరకొండ. చికాగోలో ఎంబీఏ పూర్తి చేసి, ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత రౌడీస్ బ్రాండ్ వచ్చాక ఆ బిజినెస్ బాధ్యతలతో పాటు, ఆ బ్రాండ్‌కి అన్నతో పాటు మోడలింగ్ కూడా చేశాడు. దీంతో ఈ కుర్రాడు కొందరు నిర్మాతల, దర్శకుల కళ్లలో పడ్డాడు. త్వరలోనే దొరసాని అనే సినిమాతో తెలుగు తెరపై ఈ కుర్రాడు మెరియనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది.
vaishnav-tej

వైష్ణవ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ఇతను స్వయానా సాయిధరమ్ తేజ్‌కి తమ్ముడు. మీకు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుందా? అందులో ఒక పిల్లాడు అచేతనంగా కుర్చీకి పరిమితమైపోయి ఉంటాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. ఈ వైష్ణవ్ తేజే! ఇతడు హీరోగా సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. చిరంజీవి ఆ సినిమాకి క్లాప్ కొట్టి మేనల్లుడిని ఆశీర్వదించాడు కూడా. రస్టిక్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం చివరకల్లా సినిమా థియేటర్‌లలో వైష్ణవ్ అందరినీ పలకరించేందుకు సిద్ధమైపోతున్నాడన్నమాట.
rakul

అమన్ ప్రీత్ సింగ్

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్. ఇతనికి రాక్ అండ్ రోల్ అనే లఘుచిత్రంలో నటించిన అనుభవం ఉంది. సెడిషన్ అనే హిందీ, ఇంగ్లిష్ ద్విభాషా చిత్రాన్ని అంగీకరించాడు. దీంట్లో సీఐఏగా కనిపించనున్నాడట. ఇప్పుడు తెలుగు సినిమాకు కూడా అక్క దగ్గరుండి క్లాప్ కొట్టి తమ్ముడికి ఆహ్వానం పలికింది. దాసరి లారెన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనున్నదట.
srimukhi

సుశ్రుత్

శ్రీముఖికి యాంకర్‌గా మంచి పేరుంది. సినిమాలకంటే ఎక్కువ టీవీపైన దృష్టి పెట్టిన ఈ అమ్మడు.. తన తమ్ముడు సుశ్రుత్‌ని వెండి తెరకు పరిచయం చేయాలనుకుంటున్నదని సమాచారం. అక్క వల్లే సినిమా మీద ప్యాషన్ ఏర్పడిందంటున్నాడీ కుర్రాడు. సినిమా కథల డిస్కస్ నడుస్తున్నదట. అన్నీ ఓకే అయితే ఈ సంవత్సరమే సినిమా సెట్ మీదికి వెళ్లనుంది.
bellam

బెల్లంకొండ గణేష్

బెల్లంకొండ సురేష్ బ్యాక్ బోన్‌గా ఉండి.. అతడి పెద్ద కొడుకు అయిన శ్రీనివాస్‌ని పెట్టి ఇప్పటికే నాలుగైదు సినిమాలు తీశాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ హీరో తన ఫైట్లతో, డ్యాన్సులతో ఇండస్ట్రీని ఇరగదీస్తున్నాడు. ఇతడి బాటలోనే బెల్లంకొండ గణేష్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. శ్రీనివాస్ కొన్ని సినిమాలకు గణేష్ ప్రొడ్యూసింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ఫణి అనే దర్శకుడికి ఇతడిలో మంచి నటుడు కనిపించాడట. వెంటనే స్టోరీని రెడీ చేసి గణేష్‌కి వినిపించడం, అది ఓకే కావడం జరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందని సమాచారం.

630
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles