పూజ చేశాకే షూటింగ్‌కి


Sat,June 29, 2019 11:50 PM

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల ముద్ర వేయించుకుంది.. ఆ సినిమాతో మరో కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమైంది.. తన క్యూట్ క్యూట్ నటనతో ఆకట్టుకున్న ఆ నటి.. శృతీ శర్మ. లక్నోకి చెందిన ఈ అమ్మడు.. హిందీ సీరియల్స్‌తో తెరంగేట్రం చేసినా.. తెలుగులో పెద్ద స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. ఈ సినిమా ద్వారా అమ్మడికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం.. ముందుగా ఆమె గురించి కొన్ని సంగతులు.. శృతి స్టార్ ప్లస్‌లో వచ్చిన ఇండియాస్ నెక్ట్స్ సూపర్ స్టార్ షోలో స్పెషల్ మెన్షన్ అవార్డిగా గెలుపొందింది.

Shruthisharma

-ఈ అమ్మడు తన జీవితానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో పంచుకుంటుంది. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.

-కలర్స్‌లో గట్‌బంధన్ అనే సీరియల్‌లో ఐపీఎస్ ఆఫీసర్‌గా తెరంగేట్రం చేసింది.

-ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ అమ్మడు లక్నోలో స్కూలింగ్ కంప్లీట్ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

-వెబ్‌సిరీస్, షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ శృతీ శర్మ కనిపించింది. సినిమాల్లో కంటే వాటి ద్వారా మంచి పేరు వచ్చిందంటున్నదీ అమ్మడు.

-ఉదయం యోగా, ఆ తర్వాత కాసేపు డ్యాన్స్ చేస్తుంది. ఉదయం పూజ చేసుకొని ఆ తర్వాత షూటింగ్‌కి బయలుదేరుతుంది.

-బుక్స్ చదువడమంటే చాలా ఇష్టం. అందులోనూ శివాని రాసిన మాయపురి అనే నవల చాలాసార్లు చదివింది. అది చదివిన ప్రతీసారి కంట తడిపెట్టుకుంటుందట ఈ అమ్మడు.

-షాహిద్ కపూర్, దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టం. పిజ్జా, బిర్యానీలు ఇష్టంగా తింటుంది.

-భరతనాట్యం నేర్చుకుంది. క్రియేటివ్ రైటింగ్‌లో డిప్లొమా కూడా పూర్తి చేసింది శృతి.

-సూపర్‌స్టార్ షోలో శృతి చేసిన చార్లిచాప్లిన్ ప్లే అందరినీ చప్పట్లు కొట్టేలా చేసింది. పోలీస్ కాప్ క్యారెక్టర్ కూడా మంచి పేరు తెచ్చింది.

-తండ్రి సుశీల్ శర్మ, తల్లి మృణాల్ శర్మ, అన్న శగున్ శర్మ. తండ్రికి తను నటనలో రాణించాలని అనుకున్నాడు.

-ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లాంటి బ్రాండ్‌ల్లో మోడల్‌గా పని చేసింది.

-నటన మీద మక్కువతో అనుపమ్ ఖేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్‌మేకింగ్‌లో నటనలో డిప్లొమా పూర్తి చేసింది శృతి.

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles