బ్రోచే వారెందరో!


Sun,June 30, 2019 12:05 AM

అందమైన చీర కట్టి.. ఒంటి నిండా నగలు వేసినా.. ఏదో వెలితి.. ప్యాంట్.. షర్ట్.. బూట్లు వేసి.. మ్యాచింగ్ కోటు ధరించినా.. ఏదో మిస్సయిన ఫీలింగ్.. ఆ గ్యాప్‌ని భర్తీ చేయడానికే వచ్చేసింది బ్రోచ్.. ధగధగ మెరిసిపోతూ.. చీరకి.. కోటుకి మరింత అందాన్ని తెచ్చిపెడుతుందిది. ఫ్యాషన్ ప్రపంచంలో రకరకాల బ్రోచెస్ ఉన్నాయి.. ఈ మధ్య కాలంలో వీటికి మరింత పెరిగింది.. కానీ ఇవి శతాబ్దం కాలానికి ముందే ఉన్నాయని తెలుసా?అసలు బ్రోచెస్ ఎన్ని రకాలుంటాయో ఎప్పుడైనా గమనించారా?

-సౌమ్య పలుస

పాత నీరు పోతుంటే కొత్త నీరు రావడం మామూలే. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే దాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. అలా ఎక్కువగా ఈ పదాన్ని ఫ్యాషన్ ప్రపంచంలో వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడో కనుమరుగైపోయిన ఫ్యాషన్ కూడా ఇప్పుడు మరిన్ని సొబగులద్దుకొని వచ్చేస్తుంది. ఫ్యాషన్ ప్రేమికుల్ని కట్టి పడేస్తుంది. అలాంటిదే బ్రోచ్. రాజుల కాలంలో ప్రధాన జువెలరీలో దీన్ని కూడా భాగం చేశారు.

చరిత్రలో..


బ్రోచెస్ అనేవి క్లాసిక్ యాక్ససెరీస్ కింద తీసుకునేవారు ఒకప్పుడు. దశాబ్దాల కాలంగా వాటి ఉపయోగం అలాగే నడుస్తున్నది. బట్టలను ఒక చోట నిలిపేలా.. అందంగా కనిపించేలా వీటిని ఉపయోగించేవారు. మొదట వీటిని బ్రోంజ్, ఆ తర్వాత మెటల్‌తో తయారు చేయడం మొదలుపెట్టారు. 3వ శతాబ్దంలో వీటిని డెకరేషన్లలో ఉపయోగించేవాళ్లు. 18వ శతాబ్దంలో వీటిని జడల మీదకి కూడా ఎక్కించేశారు. క్వీన్ ఎలిజబెత్ కాలానికి వచ్చేసరికి డ్రెస్‌ల మీద అందంగా మెరువడం మొదలైంది.

ఎలా ధరించాలి?

బ్రోచ్‌ని ఎలా ధరించాలన్నది ఇప్పటికీ చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. కేవలం బట్టల మీద మాత్రమే అలంకరణగా వాడుతారని అనుకుంటారు. కానీ దీన్ని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మామూలు అకేషన్లలో యాంటిక్ బ్రోచ్‌లను జుట్టు మీద అలంకరించుకోవచ్చు. పిన్‌తో ఉండే వాటిని కొప్పులో దూర్చేయొచ్చు. చేపముల్లు జడ వేసినప్పుడు కూడా పిన్ బ్రోచ్‌లను జుట్టుపై అలంకరించవచ్చు. పెండెంట్ బ్రోచ్‌లను చెయిన్‌కి కూడా వేలాడదీసేయొచ్చు. తలకి స్కార్ఫ్ కట్టినప్పుడు అది ఊడిపోకుండా గట్టిగా పిన్ పెట్టే బదులు దాని స్థలంలో ఈ బ్రోచ్‌ని పెడితే మరింత అందంగా కనిపిస్తారు. చీరలకి, జాకెట్స్ మీదకి పెట్టడం వల్ల క్లాస్ టచ్ వచ్చేస్తుంది. కావాలనుకుంటే బ్యాగ్, క్యాప్‌ల మీద కూడా వీటిని మీకు నచ్చినట్లుగా పెట్టేసుకోవచ్చు. జీన్స్‌లు ధరించినప్పుడు వాటి పాకెట్‌ల మీద కూడా ఇవి బాగుంటాయి.

ఎప్పుడెప్పుడు ఎలా..

చీరలను ఒక ఫంక్షన్‌కి కడితే మరొక ఫంక్షన్‌కి అదే కట్టాలంటే బాగనిపించదు. అలాంటిది ఒకటే బ్రోచ్‌ని ఎన్నిసార్లని పెట్టేస్తారు. కాబట్టి అకేషన్‌కి తగ్గట్టుగా ఈ బ్రోచ్‌లని మారుస్తుంటే మీ అందం కూడా రెట్టింపు అవుతుందంటున్నారు ఫ్యాషనిస్టులు. ఫ్యామిలీ ఫంక్షన్లు జరిగినఫ్పుడు ఫ్లోరల్ డిజైన్స్‌ని వాడొచ్చు. ఎందుకంటే కాస్త సంప్రదాయంగా రెడీ అవుతారు కాబట్టి.. ఇవి బాగా సూటవుతాయి. ఆఫీసులకు వెళ్లేటప్పుడు మరీ పెద్దవి కాకుండా ఉండే బ్రోచెస్‌ని వాడాలి. ముత్యాలతో తయారుచేసిన బ్రోచెస్ కూడా వాడొచ్చు. బిజినెస్ చేసే వాళ్లయితే క్రిస్టల్ బ్రోచ్‌లను ఎంచుకోవాలి. వీటివల్ల రాయల్ లుక్ వస్తుంది. నైట్ పార్టీలకు కాస్త మెరిసిపోయేవయితే బాగుంటాయి. డేట్‌కి వెళ్లాలనుకున్నప్పుడు డిజైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. హార్ట్ షేప్‌లో ఉండే బ్రోచ్, బొకేలా ఉన్న బ్రోచెస్ బాగుంటాయి. రోజువారీగా పెట్టుకోవాలనుకుంటే ఎనామిల్‌లో సింపుల్‌గా ఉండే బ్రోచెస్‌ని ఎంచుకోవచ్చు.

బ్రోచెస్ రకాలు

బార్ బ్రోచ్

ఇవి మన పిన్నీసులకు అటాచ్ చేసినట్టే ఉంటాయి. పొడవుగా, ఒక చివర షార్ప్‌గా ఉంటాయి. అన్ని రకాల షేప్స్, సైజులతో ఈ బ్రొచెస్ మెరిసిపోతుంటాయి. పైగా వీటిని డ్రెస్‌లకి అటాచ్ చేయడం చాలా సులువు. ఈ బ్రొచ్ పెట్టిన తర్వాత ఊడిపోతుందనే బాధ కూడా ఉంటుంది. ఇందులో వైట్‌గోల్డ్, గోల్డ్ కలర్‌లు మరింత అందంగా ఉంటాయి. ఎలాంటి అవుట్‌ఫిట్స్ మీదకైనా ఇవి సూటవుతాయి.
bar-brooch

పెండెంట్ బ్రోచ్

మన జువెలరీలో చైన్లకు వచ్చే లాకెట్లలాగే ఈ బ్రోచ్ ఉంటుంది. కావాలనుకుంటే జువెలరీలోని లాకెట్లను కూడా అందమైన బ్రోచ్‌లుగా మార్చేసుకోవచ్చు. సన్నని పిన్‌లాంటి దానికి ఈ పెండెంట్‌ని వేలాడదీసి డ్రెస్‌ల మీద అందంగా అలంకరించవచ్చు. కొన్నిసార్లు రివర్స్ మోడల్ కూడా ఈ పెండెంట్ బ్రోచ్‌ల్లో అద్భుతంగా ఉంటాయి. వెస్ట్రన్ స్టయిల్ డ్రెస్సింగ్‌ల మీదకి ఈ బ్రోచెస్ బాగుంటాయి.
Pendant-Brooch

ప్రోటేట్ బ్రోచ్

18వ శతాబ్దంలో ఇలాంటి బ్రోచెస్ చాలా ఫేమస్. మహారాణులు.. వారి కుటుంబసభ్యుల పెయింటింగ్స్‌తో, వారి ఫొటోలతో ఈ బ్రోచెస్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునేవాళ్లు. మధ్యలో వారి బొమ్మ ఉండి ఎక్కువ ముత్యాలతో ఈ బ్రోచెస్‌ని తయారుచేసేవారు. మొదట్లో వీటిని చాలా పెద్దవిగా తయారు చేసినా, 1910 కాలంలో వీటిని సైజు తగ్గించి తయారు చేయడం మొదలుపెట్టారు. తర్వాత వీటి వాడకం తగ్గినా.. ఈ మధ్యకాలంలో మళ్లీ ఇలాంటి వాటి మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
Portrait-Brooch

ఫోలైట్ బ్రోచ్

ట్రెడీషనల్‌గా ఉండాలనుకునే వాళ్లు ఈ బ్రోచ్‌స్‌ని ధరించడానికి ఇష్టపడుతారు. పువ్వులు, ఆకుల డిజైన్లతో వచ్చే వీటిని ప్రేమ, స్నేహానికి గుర్తుగా ధరించేవారట. 19వ శతాబ్దంలో ఈ రకమైన బ్రోచెస్ చాలా ఫేమస్. వీటిని ఎక్కువగా రత్నాలు, వజ్రాలతో తయారుచేసేవాళ్లు. ఇవి రాను రాను ఆరిఫిషియల్‌వి కూడా వస్తున్నాయి కాబట్టి వాటిని రంగు రాళ్లతో కూడా తయారుచేస్తున్నారు. 20వ శతాబ్దంలో వీటికి ఆదరణ ఎక్కువుందనే చెప్పొచ్చు.
Foliate-Brooch

ఎనామిల్ బ్రోచ్

గ్లాస్ పౌడర్, మెటల్‌ల మిశ్రమంతో ఈ ఎనామిల్ తయారవుతుంది. పెద్ద పెద్ద జెమ్‌స్టోన్‌లాంటివి వాడకుండా.. వాటి స్థానంలో ఈ ఎనామిల్‌ని నింపేస్తే ఆ మెరుపు వచ్చేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఈ ఎనామిల్ పుట్టిందని ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీస్‌లాంటి ప్రాంతాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉందని తేలింది. ఈ మధ్యకాలంలో వీటికి ఆదరణ ఉంది.
Enamel-Brooch

ఎక్కువ ధరకి..

ఒక నాన్న.. తన కూతురికి కోసం 8 డాలర్లు పెట్టి ఒక బ్రోచ్ కొన్నాడు. ఆ కూతురు దాన్ని కొన్ని రోజులు వాడింది. ఆ తర్వాత అది ఎక్కడ పెట్టిందో మరచిపోయింది. ఏదో సందర్భంలో ఆ బ్రోచ్ తన కంటపడింది. అప్పటికీ దాని వన్నె తగ్గలేదు. ఎందుకో అనుమానం వచ్చి నిపుణులకు చూపిస్తే దాంట్లో 0.50 క్యారెట్ల రూబీ, 1.50 క్యారెట్స్ బర్మీస్ రూబీ, 0.60 క్యారెట్స్ గని-కట్ డైమండ్స్ ఉన్నాయి. పాత యూరోపియన్‌లో ఆ బ్రోచ తయారు చేసినట్టు అమెరికాలోని రత్నశాస్త్ర ఇనిస్టిట్యూట్ గుర్తించింది. అలా దాన్ని ఆక్షన్‌కి పెడితే ఏకంగా 26, 250 డాలర్లకు ఆ బ్రోచ్ అమ్ముడుపోయిందట.
costly

421
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles