జీవితం.. అంకితం..


Sun,June 30, 2019 03:53 AM

జాతి, మతం, లింగంతో సంబంధం లేకుండా, జీవనశైలిలో లేదా ఆర్థిక స్థితిగతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా రోగులందరికీ సమానమైన వైద్య సేవలు అందిస్తామనీ, రక్షణ కల్పిస్తామని వైద్యులు మనస్సాక్షిగా ప్రమాణం చేసుకుంటారు. ఆ ప్రతిజ్ఞను చాలా మంది పాటిస్తూ ఉంటారు. అట్లాంటి డాక్టర్లే వీళ్లు. జూలై1న వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ స్ఫూర్తిదాయక కథనం..

బిక్షగాళ్లకోసం ప్రత్యేకంగా..

పుణెకు చెందిన డాక్టర్ సోనావానేది గొప్ప మానవతా దృక్పథం. డాక్టర్ చదివిన ఆయన వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. కానీ 2015 స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఆయా ఆస్పత్రిలో ఉద్యోగానికి రాజీనామా చేసి తన పూర్తి జీవితాన్ని ప్రజలకు అంకితం చేశాడు. మొదట ఆయన బిక్షగాళ్లను రక్షించడానికి, వారికి వైద్యం అందించడానికి సిద్ధం అయ్యాడు. వారి నుంచి ఎమోషనల్ స్పందన రావడంతో బిక్షగాళ్లకే కాకుండా పేద ప్రజలందరికీ వైద్య సేవలు ఉచితంగా అందించడం ప్రారంభించాడు. వాళ్లకు వైద్యం చేయడమే కాదు వారి జీవితాల్లో మార్పులు తేవడానికి ఈయన కృషి చేస్తున్నాడు.
Sonawane

80 ఏండ్ల వయసులో కూడా..

డెహ్రాడూన్‌కు చెందిన యోగి ఐరోన్‌కు ఎనభై ఏండ్లు. సుధీర్ఘ అనుభవం ఉన్న ప్లాస్టిక్ సర్జన్. హిమాలయాల ప్రాంతంలో అడవి జంతువుల దాడిలో గాయపడ్డ వారికి, అగ్నిప్రమాదాల బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 500 సర్జరీలు తనే సొంతంగా చేశారు. ఆయనతో పాటు కొడుకు కూడా డాక్టర్ కావడంతో వీరికి మంచి పేరు ఉంది. రిమోట్ ఏరియాలో పేదల కోసం ప్రత్యేకంగా వీరు సేవలు అందిస్తారు. ఏటా రెండుసార్లు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తారు. 15 మందితో అమెరికా వైద్యులతో ఈ క్యాంపు నిర్వహిస్తారు. ఆ వైద్యులు ప్రతి క్యాంపులో సుమారు 10 సర్జరీలు అయినా చేస్తారు.
Sonawane2

ఓ ఆశావర్కర్ చొరవ

మహారాష్ట్రలోని ఆరాగ్ గ్రామంలో ఆశా వర్కర్‌గా పని చేస్తున్న ఉమాపాటి మాతా శిశు సంరక్షణకు, మరణాల రేట్లను తగ్గించడానికి ఆమె కృషి చేస్తున్నది. ఆమె కృషికి ప్రభుత్వాస్పత్రిలో ప్రసూతులను పెరిగాయి. విధి నిర్వహణలో ఆమె పెట్టే ఖర్చు, ఆమె నెల వేతనానికి సగం. రికార్డులు రాయడానికి స్టేషనరీ, గ్రామాల్లో పర్యటించడానికి ఖర్చులు అవ్వన్నీ భరిస్తున్నది. దాదాపు అందరి ఆశా వర్కర్ల పరిస్థితి ఇంతే అని చెపుతున్నది. ఆమె విధులు నిర్వహిస్తున్న గ్రామంలో సుమారు 15,600 జనాభా ఉంది. ఈ గ్రామ పరిధిలో 15 మంది, అరాగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో 41 మంది ఆశాలు పని చేస్తున్నారు. అయితే తన విధుల్లో భాగంగా 15 నుంచి 20 ఇండ్లను సందర్శించాల్సి వచ్చేది. గర్భిణులకు, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా హెల్త్ సెంటర్ నుంచి వెళ్లి నయం చేస్తుంది. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన పై దృష్టి సారించింది. దీనివల్ల మరణాల రేట్లు తగ్గినట్టు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ గుర్తించింది. 2005-06లో ప్రభుత్వాస్ప్రతిలో ప్రసూతు లు 64.6శాతం ఉంటే నేడు అది 90.3శాతానికి పెరిగింది.

యూకేని వదిలేసి..

కేరళకు చెందిన డాక్టర్ మనోజ్ కుమార్ మానసిక వైద్యుడు. యూకేలో సైకియాట్రిక్‌గా ప్ట్రాక్టిస్ చేశాడు. దాదాపు 15 యేండ్లు విదేశాల్లో వైద్యసేవలు అందించాడు. కానీ ఎప్పటికైనా స్వదేశంలో వైద్య సేవలు అందించాలని ఆయన కోరిక. అందుకే కేరళకు తిరిగి వచ్చాడు. కేరళలోని పలు ప్రాంతాల్లోని సామాజిక సమస్యలను దృష్టి పెట్టుకొని ఆయన పనులు నిర్వహిస్తాడు. ఇందుకోసం 2008లో ఖాజీగోడ్‌లోని మెంటల్ హెల్త్ యాక్షన్ ట్రస్ట్ ను స్థాపించాడు. దీని ద్వారా రూరల్ ప్రాంతాల్లోని ప్రజలకు మానసిక వైద్య సేవలు అందించడం, వారిలో అవగాహన కల్పించడం చేస్తుంటాడు. ఎన్నో గ్రామాల్లో ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ డాక్టర్ మనోజ్ ఒక్క రూపాయీ తీసుకోడు.

గిరిజనుల కోసం

తమిళనాడుకు చెందిన రేగి, లలిత ఇద్దరూ వైద్యులు. గాంధీగ్రామ్‌లోని ఓ దవాఖానలో పనిచేశారు. అక్కడికి చాలా దూరం నుంచి ఆదివాసీలు వచ్చేవారు. కొండ పై ప్రాంతాల్లో ఉండే వారు దవాఖానకు వెళ్లాలంటే 50 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉండె. వీరందరికీ వైద్యం అందేలా అడవి మధ్యలో గుడిసె ఏర్పాటు చేసి ట్రైబల్ హెల్త్ ఇన్షియేటివ్ పేరు పెట్టారు. 25 ఏండ్ల క్రితం ప్రారంభమైన గుడిసె వైద్యం ఇప్పుడు ఏటా లక్షమందికి ఆసరా అవుతున్నది. ప్రసవాలు, చిన్నచిన్న ఆపరేషన్లు చేస్తూ దంపతులు గిరిజనులకు సేవ చేస్తున్నారు. దాతల సాయంతో వీరు తక్కువ ఖర్చుకే వైద్యం చేస్తారు. డబ్బు చెల్లించలేనివారికి ఉచిత వైద్యం అందిస్తున్నారు. రూ.100కే వృద్ధులకు ఏడాదిపాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Sonawane1

792
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles