రాశి ఫలాలు


Sun,July 7, 2019 12:22 AM

7-7-2019 నుంచి 13-7-2019 వరకు

మేషం

ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌లు, పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. నిత్యవ్యాపారం అనుకూలంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కలిసివస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రధాన గ్రహాలు కుజుడు, గురు, శని ప్రతికూలంగా ఉన్నారు. దీని వల్ల భూములు కొనడం, అమ్మడంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడతాయి. పెద్దల సలహాలు, సూచనలు తప్పక పాటించాలి.

వృషభం

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచిపేరు వల్ల చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. భార్యాపిల్లలతో, ఆత్మీయులతో సంతృప్తికరంగా గడుపుతారు. వాహనాల వల్ల లాభం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోని వారికి, వాహనాల క్రయవిక్రయ రంగాల్లో ఉన్నవారు లాభాలు గడిస్తారు. కొత్త వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. సినిమా, వైద్య, ఉపాధ్యాయ రంగాలలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు.

మిథునం

రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాలలో లాభాలుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు లాభిస్తాయి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. భార్యా పిల్లలతో ప్రతి విషయాన్ని చర్చించడం వల్ల కొన్ని నష్టాలను అధిగమిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు.

కర్కాటకం

తలపెట్టిన అన్ని పనులూ వేగవంతంగా పూర్తవుతాయి. మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్యాలు చేస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. పనివారితో ఉన్న ఇబ్బందులు దూరమవుతాయి. తీర్థయాత్రలు, నదీ స్నానాలను ఆచరిస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. విందులకు, వినోదాలకు ప్రాధాన్యం ఇస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు హాయిగా గడుపుతారు. అనవసర ప్రయాణాలు చేస్తారు.

సింహం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో పనులు ఆచరిస్తారు. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో సమన్వయం వల్ల పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారు తాత్కాలిక ఉద్యోగం పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వాహనాల వల్ల అనవసర ఖర్చులుంటాయి.

కన్య

రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారు ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మాత్రం ఆటంకాలుంటాయి. అన్నదమ్ములు, బంధువులతో సమన్వయంతో ముందుకెళతారు. వాహనాల వల్ల పనులు అనుకూలిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారం లాభిస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో మంచి సంబంధ, బాంధవ్యాలను ఏర్పరచుకుంటారు. పెద్దల సూచనలు పాటించకపోతే సమస్యలు రెట్టింపవుతాయి.

తుల

నిత్య వ్యాపారం లాభిస్తుంది. పెట్టుబడుల వల్ల రాబడి పెరుగుతుంది. నిత్యావసర, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తులలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. కొత్త పనులు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యం నయమవుతుంది.

వృశ్చికం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. ప్రతి విషయాన్ని భార్య, పిల్లలతో చర్చించడం వల్ల కొన్ని నష్టాలు అధిగమిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. నిత్య వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. అనాలోచిత పనుల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి అనవసర ఖర్చులుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. పనివారితో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల వల్ల పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

ధనుస్సు

రోజువారీ వ్యాపారం కొంతవరకు లాభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. ఉద్యోగులు తోటివారితో కలహాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంలో ఉన్న వారు కార్యకర్తలతో, పైవారితో మనస్పర్థలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. నలుగురిలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కింది స్థాయి వారితో మనస్పర్థలు ఏర్పడతాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటించకపోతే కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మకరం

ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో తోటి వారితో సమన్వయం కుదురుతుంది. అనుకూల ప్రాంతాలకు బదిలీలు, పదోన్నతులు ఉంటాయి. రాజకీయంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి.

కుంభం

స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్నవారు లాభాలను గడిస్తారు. వాహనాల వల్ల కలిసొస్తుంది. తీర్థయాత్రలు, పుణ్యనదీస్నానాలు ఆచరిస్తారు. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆరోగ్యం నయమవుతుంది. పనివారితో ఇబ్బందులు దూరమవుతాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్థలు గోచరిస్తునాయి.

మీనం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యంతో చాలా పనులు నెరవేరుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి సహాయపడే పనులపై శ్రద్ధ చూపుతారు. ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. వస్త్ర, వస్తువులు, నగలను కొంటారు. సంగీత, సాహిత్య, పత్రికా రంగాలలో ఉన్నవారు మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. నిత్యవ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు ఉంటాయి. పెద్దల సూచనలు పాటించక పోవడంతో కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

1143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles