వాస్తు


Sun,July 7, 2019 12:32 AM

house

పెరిగిన ఈశాన్యం వైపు కాంపౌండు కడితే ఆ గోడ ఆగ్నేయం చూస్తుందంటున్నారు. ఎలా కట్టాలి?

- మల్యాల రత్నాదేవి, జడ్చర్ల
గోడలకు చూపు అనేది లేదు, నడక ఉంటుంది. అది ఎటుగా వెలితే అదే దాని నడక. చూపు ద్వారానికి, కిటికీలకు ఉంటుంది. పెరిగిన ఈశాన్యానికి గోడను వెనక్కు ముందుకు జరిపి కడితే ఆ తూర్పు ప్రహరీ అనేక ముఖాలతో వక్రంగా నడుస్తుంది. పెరిగిన స్థలాన్ని పెరిగినట్టే కట్టి ఆ గోడకు వచ్చే గేటును మెట్నకు పెట్టాలి. అంటే ఆ గేటు తూర్పును చూసే విధంగా నిర్మించాలి. పెరిగిన విధంగా ఆ గోడ పారుతో పెడితే ఆ గేటు నడక దానిచూపు ఆగ్నేయం అవుతుంది. కాబట్టి దానిని సక్రమంగా దిశకు బిగించాలి. గోడ ప్రయాణాన్ని అవసరం అయినప్పుడే ఏదో ఒకచోట అది ఆగ్నేయం కావచ్చు, వాయవ్యం కావచ్చు. అవసరాన్ని బట్టి మెట్నకు త్రెంపి తిరిగి స్థలాన్ని బట్టి తూర్పు ఉత్తరాలు గోడ నడిపించాలి అంతే.

సెక్యూరిటీ కోసం ఇంటి గోడలు కాంక్రీటుతో కట్టుకోవచ్చా?

- కల్వకుర్తి రమేష్, బోయిన్‌పల్లి
గృహం నిర్మించడం అంటే ఒక మాతృమూర్తిని సృష్టిం చడం. ఎందుకు ఇక్కడ పురుషుణ్ణి తయారు చేయడం అనలేదు అంటే స్త్రీత్వం ఒక్కటే సృష్టికి మూలబీజం. అంతేకాదు గృహిణి కలిగి ఉండేదే గృహం. మానవుని చర్మం ఒక రేకులాగ ఉంటే ఏ గాయం కాదు. అనుకొని నేచర్ చర్మం తొడుగును ఏర్పరచలేదు. ఒక తాటి పత్రిలా మనిషి ఒల్లు ఉండే బాగుంటదా. ఇంటి గోడలు ఒంటికి చర్మం లాంటిది. అవి నిరంతరం వడపోత చేయాలి. గృహం సజీవమైందిగా శ్వాసలు తీస్తూ ఉంటుంది. దానిని కాంక్రీటుతో నిర్మిస్తే సమాధి అవుతుంది. లేదా ఒక జైలు గది అవుతుంది. కానీ ఇల్లు కాదు, తల్లి ఒడి కాదు. ప్రకృతిని స్పర్శించని ఆకర్షించని, ప్రకృతితో ఐక్యం కాని ఇల్లు ఒక లాకర్ బాక్స్‌గా మలుచుకుంటానంటే ఎలా? మట్టిగోడలు, ఇటుక గోడలు, ప్రాణాత్మకంగా నిలిచి సకల సృష్టితో మమేకమై పూర్ణత్వాన్ని కలిగి ఉంటాయి. ఎంత అందమైన ఖరీదైన బంగారు శిల్పమైనా ఆ స్త్రీ బొమ్మ సాధారణ ఇల్లాలు కాలేదు కదా.

స్థలం మొత్తం కింద సెల్లార్ చేసి పైన ఇల్లు కట్టొచ్చా?

- చొక్కా రమణ, రామ్‌నగర్
ఇంటికి సెల్లార్ రావాలి, కావాలి అంటే ఇంటి స్థలానికి దక్షిణం రోడ్డు ఉంటే మంచిది. అప్పుడు కింద స్థలం మొత్తం సెల్లారు తవ్వుకొని పైన రోడ్డు లెవెల్‌లో ఇల్లు కట్టుకోవచ్చు. పడమరలో రోడ్డున్నా ఇలాగే చెయ్యొచ్చు. రోడ్డు తూర్పున లేదా ఉత్తరంలో ఉన్నప్పుడు సెల్లార్ తవ్వకుండా భూమి లెవెల్‌కు వదిలి ఫస్ట్‌ఫ్లోర్‌లో ఇల్లు కడితే చాలా బాగుంటుంది. సెల్లార్ ఎక్కడ తవ్వినా మొత్తం స్థలం తవ్వితే ఎక్కువ వినియోగంలోకి వస్తుంది. అప్పుడు ఇంటి మీద కట్టుకుంటే దోషం కాదు కానీ కింద సెల్లారుకు వెలుతురు వచ్చేలా ప్లాన్ చేయాలి. చీకటితో ఉండే సెల్లార్లు అనేక ఇబ్బందులను కలిగిస్తాయి. పైన ఇంటి కింద సెల్లార్ ప్లాన్ చేసి కట్టినట్లయితే ఆ పైన ఇంటిచుట్టూ ప్రదక్షిణం వచ్చేలా దానికి బాల్కనీ వేసుకోవాలి. ఆ బాల్కనీ తూర్పు ఉత్తరాలు ఎక్కువ వచ్చేలా ప్లాను చేసుకోవాలి. ఇంటికి గాలి వెలుతురులే ఆయువు.

నైరుతిలో పార్కింగ్ రూము పెట్టి ఇల్లు కట్టుకోవచ్చా?

- కొడిమాల శ్రీకాంత్, కల్వకుర్తి
ఇంటి మొత్తానికి నైరుతి చాలా ప్రాధాన్యం కలది. దానిని యజమాని వాడాలా.. యజమాని వాహనాలు వాడాలా అనేది సరిగ్గా నిర్ధారించుకోవాలి. కొన్ని స్థలాలు ఇంట్లో యజమానురాలు, ఎక్కువగా వాడుతుంది. పిల్లలు కొన్ని దిశలు వాడుతుంటారు. ఆగ్నేయం దిశలో ఆడపిల్ల రోజులో పది పదిహేను గంటలు ఉంటుంది. పిల్లలు ఇంటి ఈశాన్యంలో ఎక్కువ గడుపుతారు. యజమాని నైరుతి గది హాలును అధికంగా వాడాలి. హాలు వ్యవహార దక్షతను పెంచుతుంది. అలా నైరుతి గది కారు పార్కింగ్ కోసం కేటాయిస్తే... ఇంట్లో ప్రధాన పడక గది ఆ దిశలో లేకుండా పోతుంది. అది ఎంతో పెద్దలోపం అవుతుంది. నడుముకు దోషాలు ఏర్పడతాయి. మీరు ఇప్పటికే నైరుతిని పార్కింగ్‌కు వాడుతూ ఉంటే వెంటనే దానిని తీసి ప్రధాన బెడ్‌రూమ్‌గా మార్చుకోండి. కారు పార్కింగ్ కోసం ఇంటి బయట ఆగ్నేయం లేదా వాయవ్యం వాడుకోండి.

డూప్లెక్స్ ఇంటికి కింద పైన తూర్పు, ఉత్తరం ద్వారాలు రావాలా? కేవలం కింద ఉంటే చాలా?

- కెవిఎన్.రాధ, భువనగిరి
రెండు ఇండ్లు ఒక దానిపైన ఒకటి కట్టినప్పుడు ప్రతి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలతో ఏర్పడుతుంది. అలాగే ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకునే ఖాళీ ప్రదేశంతో వస్తుంది. ఇల్లు అనేది నిద్రపోవడానికే అయితే రైలు బోగి బెర్తు చాలు. గృహం అనేది స్వర్గధామం కావాలి. అందుకు తప్పక అన్ని అంతస్థులల్లో తూర్పు, ఉత్తరం ద్వారాలు ఉండాల్సిందే. డూప్లెక్స్ ఇంట్లో ముఖ్యంగా పైన ఇల్లే అత్యంత ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ప్రముఖులు (విఐపీలు) చాలా విషయాలు పైనే చర్చిస్తూ గడుపుతుంటారు. కాబట్టి కింద ఉత్తర ద్వారం ఉండి పైన లేకుంటే ఫరవాలేదు అనుకోవద్దు. వీలున్నంత వరకు ప్రతి ఫ్లోర్‌ని పూర్ణంగా నిర్మించాలి.
SUDHHALA
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles