నెట్టిల్లు


Sun,July 7, 2019 12:54 AM

అందరిదీ ఒకే డ్రీమ్ సినిమా! కథ ఉంటుంది. నమ్మకం ఉంటుంది కానీ అవకాశాలు రావు, అర్థిక సమస్యలు ఉంటాయి. అయినా ధైర్యం చేసి సినిమా తీస్తారు. ఆ సినిమా కోసం చేసే ప్రయత్నాలనే సినిమాగా మలిచి సూపర్ అనిపించుకున్నారు ఈ వారం కొందరు దర్శకులు. ఇలా డ్రీమ్, అచీవ్ అన్న మాటను నిజం చేయడానికా అన్నట్టుగా ఈ సినిమాల ద్వారా ప్రతిభను కనబరిచారు.నా కథ

దర్శకత్వం: ఎన్‌ఎన్ రజినీ
నటీనటులు : నవకాంత్, జాస్మిన్

లఘు చిత్రంలో హీరో అనాథ. కాలేజీలో ఫ్రెండ్స్‌తోనే రోజులు గడుపుతాడు. అతని లక్ష్యం సినిమా. ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. క్లాస్‌కు హాజరైనా, ఫ్రెండ్స్‌తో ఉన్నా అతని మెదడులో మాత్రం దర్శకత్వం గురించే ఆలోచనలు తిరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్‌కు తన గురించి చెప్పినా వారు అర్థం చేసుకోరు అని అనుకుంటాడు. పైగా చేతగాని వాడిలా చూస్తారేమో అని ఫీలవుతాడు. సుదీర్ఘంగా ఆలోచించి, నిత్యం మేధోసంఘర్షణకు గురవుతాడు. ఇవి అన్నీ హీరోను ఓ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్తాయి. చివరికి వీటి నుంచి దూరం అవడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. అనాథగా పుట్టిన అబ్బాయి తన కలలను సాకారం చేసుకొనే ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులను ప్రొజెక్ట్ చేశారు. మధ్యలో ప్రేమకథ, కబుర్లు ఆకట్టుకుంటాయి. మేకింగ్, కాస్టింగ్ లఘుచిత్రానికి మెరుగులు అద్దాయి. ఒక లక్ష్యం కోసం ప్రయత్నాలు చేస్తూ విఫలం అయ్యే వారిని సమాజంలో చేతకాని వాడు అనుకుంటున్నారు అని దర్శకుల అభిప్రాయం. లీడ్ క్యారెక్టర్ ముగింపు అలా కాకుండా ఇంకా స్ఫూర్తివంతంగా ముగించి ఉంటే బాగుండేది.

Total views 25,543+ (జూన్ 29 నాటికి)
Published on June 25, 2019రాధా క్రిష్ణ పరిణయం

దర్శకత్వం: నవీన్ శ్రీకాంత్
నటీనటులు : రామ్ కిషోర్, సాయి ప్రవళ్లిక

రాధ, కృష్ణ ఇద్దరు ప్రేమించుకుంటారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కృష్ట దాన్ని దాటవేస్తాడు. ఓ రోజు రాధ వచ్చి ఇంట్లో వాళ్లతో మాట్లాడు, కనీసం మా అన్నయ్యతో అయినా మాట్లాడు అని అంటుంది. దానికి కృష్ణ ససేమెరా అంటాడు. కృష్ణ ఉడ్యోగి. మంచి జీతం. అయినా తన ప్రేమ గురించి రాధ వాళ్ల కుటుంబీకులతో మాట్లాడాలనుకోడు. అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏ అబ్బాయికి ఉన్నా పెళ్లికి ఒప్పుకుంటారు కానీ అవ్వన్నీ వదిలేసి తన వ్యక్తిత్వం చూసి, ప్రేమ చూసి వారు ఒప్పుకోవాలని అనుకుంటాడు కృష్ణ. సీన్ కట్ చేస్తే ఓ రోజు రాధ కృష్ణను కలిసి మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్తుంది. దీనికి కృష్ణ ఏమీ ఆశ్చర్యపోడు కానీ సంతోషిస్తాడు. అయితే పెళ్లికి రాధ వాళ్ల అన్నయ్య ఎలా ఒప్పుకున్నాడు? కృష్ణ ఏం చేశాడు? ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అనే సంగతులు ైక్లెమాక్స్‌లో రివీల్ చేశాడు దర్శకుడు. అదేంటో యూట్యూబ్‌లో చూడండి. మేకింగ్, డైలాగ్స్ బాగున్నాయి.

Total views 10,341+ (జూన్ 29 నాటికి)
Published on June 22, 2019ఫోర్

దర్శకత్వం: రాకేశ్
నటీనటులు : రాకేశ్, నేహసింగ్

ఒక డ్రమెటికల్ షార్ట్ ఫిలిమ్ ఫోర్. ఎందుకో ఏమో వర్ష అనే అమ్మాయికి అబ్బాయిలు అంటే నచ్చదు. నచ్చకపోతే నచ్చనట్టు ఉండాలి కానీ ఈ లఘు చిత్రంలో మర్డర్ చేస్తుంటుంది. ఇలా ఆమె సీరియల్ కిల్లర్‌గా మారుతుంది. అయితే అబ్బాయిలను ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకొని ఇంటికి పిలుస్తుంటుంది. ఇలా ఇంటికి వచ్చిన వాళ్లను ఎవరికీ తెలియకుండా చంపేస్తుంది. ఈ లఘుచిత్రంలో మూడో మర్డర్‌ను చూపించారు. రుద్ర అనే అబ్బాయిని ఇంటికి పిలిచి కత్తితో పొడిచి చంపేస్తుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొంత సంభాషణ ఉంటుంది. అది ఊహించని రుద్ర భయపడిపోతాడు. కానీ తర్వాత వర్ష అంతా అబద్ధం అని చెపుతుంది. దానికి కొనసాగింపుగా రుద్ర కూడా ప్రాంక్ చేస్తాడు. చివరికి ఆమె చేతిలో మర్డర్ అవుతాడు. తర్వాత నాలుగో మర్డర్‌కు కూడా వర్ష అచ్చం ఇదే పథకాన్ని కొనసాగిస్తుంటుంది. ఎలాంటి పరిచయం లేకుండా ఒక అబ్బాయి, మరో అమ్మాయి దగ్గరకు ఏమీ తెలుసుకోకుండా ఎలా వస్తాడు అనేది వర్ష అభిప్రాయం. దీన్నే దర్శకులు చిత్రీకరించారు. మేకింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, నటీనటుల తీరు బాగున్నాయి. కొంత ల్యాగ్ కూడా అయినట్టు ఉంది. చూడొచ్చు.

Total views 12,934+ (జూన్ 29 నాటికి)
Published on June 28, 2019సినిమా వాడు

దర్శకత్వం: దేవ పొన్నకంటి

ఎలా అయినా సినిమా తీయాలని స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని తిరుగుతాడు దేవ. ఇంతకు ముందే రెండు షార్ట్‌ఫిలిమ్‌లు తీసినా వాటికి పెద్దగా స్పందన రాకపోవడంతో ఎవరూ సాయం చేయడానికి ముందుకురారు. ఇప్పుడు మరో కొత్త కథతో, నమ్మకంతో ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తాడు. కానీ కథలో మార్పులు చేయాలని ప్రొడ్యూసర్ చెప్తాడు. దీనికి దేవ అంగీకరించడు. తర్వాత వేరే ప్రోడ్యూసర్ నుంచి అవకాశం రావడంతో లఘు చిత్రం తీసి ప్రశంసలు అందుకుంటాడు. విషయం తెలుసుకున్న పాత ప్రొడ్యూసర్ ఏ కథ ఉన్నా తను ప్రొడ్యూస్ చేస్తా అంటాడు. అప్పుడే దేవలోని డైరెక్టర్ బయటకు వస్తాడు. తను అవకాశం చూస్తున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అవకాశం ఇస్తా అంటావా అనే తరహాలో డైలాగ్‌లు పేల్చి వెళ్తాడు. ఒక రైటర్ రాసిన స్క్రిప్ట్‌లో ఇతరులు వేలు పెడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం ఈ లఘుచిత్రంలో కనిపిస్తుంది. చూడొచ్చు.

Total views 1,515+ (జూన్ 29 నాటికి)
Published on June 24, 2019

- వినోద్ మామిడాల, సెల్: 7660066469

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles