రెండు దేశాల ప్రజలకోసం ఓ లైబ్రరీ..


Sun,July 7, 2019 01:00 AM

Library
ఓయ్ సినిమా చూసే ఉంటారు కదా! అందులో హిరో, హీరోయిన్‌లు ఒకే సమయంలో రెండు వేరు వేరు రాష్ర్టాల మధ్య ఉండి ఆశ్చర్యపరుస్తారు. గీత దాటితే వేరే రాష్ట్రం అని సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు ఆశ్చర్యపరుస్తారు. ఇలానే రెండు దేశాల మధ్య ఉంటే ఎలా ఉంటుంది? అయితే, అమెరికా-కెనడా వెళ్లాల్సిందే.

సాధారణంగా దేశ సరిహద్దుల మధ్య జనసంచారం ఉండదు. సెక్యూరిటీ బందోబస్తూ, సైన్యం తనిఖీలు ఉంటాయి. లేదా కొండలు, నదులు, సముద్రాలు లాంటివి సరిహద్దులుగా ఉంటాయి. అమెరికా, కెనడా దేశాల మధ్య సరిహద్దు రేఖ విచిత్రంగా ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య బార్డర్ ఒక లైబ్రరీలో ఉంటుంది. అంటే ఆ ఒక్క లైబ్రరీ రెండు దేశాల్లో ఉంటుందన్న మాట. రెండు దేశాల సరిహద్దు గ్రామం అయిన డెర్బీ లైన్‌లో ఈ లైబ్రరీ భవనం ఉంది. ఈ భవనం అమెరికాలో కొంచెం, కెనడాలో కొంచెం నిర్మితయై ఉంటుంది. రెండు దేశాల వారికి ఈ లైబ్రరీలోకి వెళ్లడానికి అనుమతి అవసరం లేదు. కానీ మిగతా వాటికి తప్పనిసరి అవసరం..

బార్డర్ లేకుండా..

డెర్బీ లైన్ అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో ఓ భాగం. అలాగే ఇది కెనడాలోని క్యూబెక్ ప్రాంతంలో స్టేండ్స్టెడ్ అనే ఊర్లోకీ కొంత విస్తరించి ఉంది. దీంతో ఈ ఊరు రెండు దేశాలను కలిపే ఒకే ఊరుగా కొనసాగుతున్నది. ధనవంతుడైన ఓ అమెరికన్ వ్యాపారి కెనడియన్ భార్య మార్తా హాస్కెల్ 1901లో దీన్ని నిర్మించింది. కెనెడియన్లు, అమెరికన్లు సమానంగా ఉపయోగించుకోవడానికి వీలుండే విధంగా ఈ ఆలోచన చేసింది. నాలుగేండ్లలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇంకా కొనసాగుతున్నది. ఈ లైబ్రరీ ప్రవేశ ద్వారా అమెరికా వైపు ఉంటుంది. పై అంతస్థులో ఒపేరా హౌస్‌లో కుర్చీలు అన్నీ కెనెడా భూభాగంలో ఉంటాయి. ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషలకు సంబంధించిన 20వేల పుస్తకాలు ఉంటాయి. దాదాపు రెండు వందల ఏండ్లు ఎలాంటి సరిహద్దు గీత లేకుండా లైబ్రరీ కొనసాగింది.

సాంస్కృతిక కేంద్రంగా..

వినోదానికి అవకాశం లేని పాత రోజుల్లో కెనడా పౌరులు అన్ని రకాల వాతావరణాల్లో వినోదం కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇది గమనించిన మార్తా హాస్కెల్ ఈ లైబ్రరీని గ్రానైట్, ఇటుకలతో నియో -క్లాసికల్ స్టైల్లో నిర్మించింది. రెండో అంతస్థులో ఒపేరా హౌస్‌ను నిర్మించింది. దీన్ని షాండ్లెయిర్స్, స్టెయిన్డ్ గ్లాస్ లాంటి చక్కటి అలంకరణలతో నిర్మించారు. దాని మీద వచ్చే ఆదాయంతో మొదటి అంతస్థులోని లైబ్రరీని నిర్వహించాలని అనుకుంది. వేసవిలో ఒపేరాలో జరిగే సంగీత కచేరీలు, నాటకాల ప్రదర్శనకు ఆదరణ ఉంటుంది. ఒపేరా ఎక్కువ భాగం కెనడా వైపు ఉంటుంది. అయినా అమెరికాకు చెందిన కళాకారులే అధికంగా పాల్గొంటూంటారు.
Library1

అయినా దాటొచ్చు..

డెర్బీ లైన్ లైబ్రరీలో ఎలాంటి సరిహద్దు రేఖ లేకుండా కొనసాగుతున్న క్రమంలో 1970లో భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నష్టపరిహార చెల్లింపు విషయంలో కెనెడా, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య వివాదం తలెత్తింది. సరిహద్దు రేఖని సర్వేయర్లు నిర్మించాలని, అందువల్ల ఏ కంపెనీ ఎంత నష్టాన్ని భరించాలో తెలుస్తుందని అమెరికన్ కంపెనీలు పట్టుపట్టాయి. ఈ ప్రకారం సర్వే జరిగాక, నేల మీద ఓ టేప్‌ను అతికించి సరిహద్దుని నిర్ణయించారు. ఈ లైబ్రరీలోని నేల మీద ఆ అంతర్జాతీయ సరిహద్దు టేప్ అలాగే ఉంది.

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles