ఆ పాత్ర ఖరీదు అక్షరాలా రూ. 248 కోట్లు


Sun,July 7, 2019 01:15 AM

PAATRA
ప్రపంచంలో వేలం పాటలకు కొదువే లేదు. చాలా ప్రాంతాల్లో లక్షలు, కోట్లు పెట్టి రకరకాల అరుదైన వస్తువులను కొనేవారు చాలామందే ఉన్నారు. చనిపోయిన ప్రముఖులకు సంబంధించినవో, పురాతన కాలం నాటివో అయితే చాలు. వెంటనే కోట్లు వెచ్చించి వేలంలో కొంటుంటారు. అలాంటిదే వెయ్యి సంవత్సరాల పాత్రకు కోట్లు చెల్లించి మరి సొంతం చేసుకున్నాడు హాంంగ్‌కు చెందిన ఔత్సాహికుడు.

అరుదైన వస్తువైతే చాలు వేలం వేస్తే వారికి ఎంత సొమ్మైనా చెల్లించి కొనే అలవాటు చాలామందిలో ఉంటుంది. అదెంత ధర అనేది వారికి అనవసరం. నచ్చిన వస్తువుని కొనుక్కున్నామా లేదా అనేదే వారికి ముఖ్యమైన ప్రశ్న. అలాంటిదే హాంకాంగ్‌లోని ఈ పాత్ర.

వెయ్యి సంవత్సరాల అరుదైన పాత్ర..

దాదాపు వెయ్యి సంవత్సరాల అరుదైన పాత్రను రూ. 250 కోట్లు వెచ్చించి కొన్నాడు ఒక వ్యాపారవేత్త. దీనికి సంబంధించిన వేలంపాట హాంకాంగ్‌లో జరిగింది. అంత ధర పలికింది అంటే అదేదో పెద్ద పాత్ర అనుకుంటే పొరపాటే.. ఆ పాత్ర చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది. అది చైనాలోని సాంగ్ అనే రాజవంశానికి చెందిందిగా వేలంపాట నిర్వహించిన నిర్వాహకులు చెబుతున్నారు.

ఫోన్‌లోనే వేలంపాట

ఈ వేలం పాటకు మరో విశేషం ఉంది. అన్ని కోట్లు విలువ చేసే పాత్ర కోసం వేలంపాటలో పాల్గొన్న వ్యక్తులెవ్వరూ వేలంపాట జరిగే చోటుకి రాలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. మిగిలిన వారందరూ ఫోన్‌లోనే వేలంపాటలో పాల్గొన్నారని వేలం వేసిన సదబీ అనే సంస్థ తెలిపింది. 13 సె.మీ. చుట్టుకొలత కలిగిన పాత్రను నీలం, ఆకుపచ్చ రంగులతో మెరుగులు పెట్టారు. వెయ్యి సంవత్సరాల క్రితం ఆ పాత్రను బ్రష్‌లు కడగడానికి ఉపయోగించేవారట. ఈ పాత్రను అంత పెద్ద మొత్తంలో గెలిచిన వ్యక్తి కూడా వేలంపాట సభలో లేడు. ఫోన్‌లోనే వేలంపాటలో పాల్గొని దాన్ని దక్కించుకున్నాడు. అయితే.. తన వివరాలు చెప్పడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు.
PAATRA1

67 కోట్లతో ప్రారంభమై.. చివరికి

మొదటగా వేలంపాట కేవలం రూ. 67 కోట్లతో ప్రారంభమైంది. ఒక్కో నిమిషం గడిచే కొద్ది కొట్లకు పెరుగుతూ ఆఖరికి రూ.248 కోట్లకు ఆ అజ్ఞాత వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ పాత్ర అత్యంత అరుదైన అద్భుతమని వేలంపాటలో ఉండే చైనాకు చెందిన ఆర్ట్ అధికారి చెప్పారు. ఈ పాత్ర ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు అవుతుందనుకోలేదు. అయితే, చాలా గట్టి పోటీ మాత్రం ఉంటుందని అనుకున్నాం. రు-వేర్ వస్తువులను ఎప్పుడు వేలం వేసినా ఉత్కంఠగానే ఉంటుంది. ఎందుకంటే, చైనా చరిత్రలో రు-వేర్ వస్తువులకు ఉన్న ప్రాధాన్యం వేరే ఏ వస్తువులకూ ఉండదు అన్నారు.
PAATRA2
కాకపోతే ఈ పాత్రలకు డూప్లికేట్ చాలా పాత్రలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి పాత్రలు తమవద్ద ఉన్నాయని చెబుతూ నిత్యం ఎంతో మంది తనకు ఇ-మెయిల్స్ పంపిస్తుంటారని, కానీ.. సాంగ్ రాజవంశానికి చెందిన పాత్రలు నాలుగు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయని వెల్లడించారు. 2014లో మింగ్ రాజవంశానికి చెందిన వైన్ పాత్రను, లియు అనే వ్యక్తికి రూ. 235 కోట్లకు అమ్మారు. ఈ రికార్డును తాజాగా రూ. 248 కోట్లతో ఈ రూ-వేర్ పాత్ర అధిగమించడం విశేషం. వైన్ పాత్రను కొనుగోలు చేసిన లియు చైనాలో ధనికుడు. కళాఖండాలను సేకరించడం అతడి అలవాటు. ఈయన గతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి అంటే మాత్రం ఆశ్చర్యం కలుగక మానదు

1616
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles