రాశి ఫలాలు


Sun,July 14, 2019 12:40 AM

14-7-2019 నుంచి 20-7-2019 వరకు

మేషం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా మిశ్రమ ఫలితాలతో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. న్యాయవాద, వైద్యవృత్తులలో ఉన్నవారు సంతృప్తిగా గడుపుతారు. ఆఫీసులోని పనులు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు కలిసొస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో ఆలోచన అవసరం. అన్నదమ్ములు, బంధువులతో, మనస్పర్థలు ఉంటాయి.

వృషభం

ఈ వారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రారంభించిన పనులు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయినా పిల్లల శుభకార్యాలు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు పొందుతారు. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను, నగలను కొంటారు. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులతో మంచి బాంధవ్యం వల్ల పనులు కలిసొస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్నవారు ఆర్థిక, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. అయినా పనులు పూర్తిచేస్తారు.

మిథునం

ప్రధాన గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, శుభకార్యాల ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద, వైద్య వృత్తుల వారు సంతృప్తిగా ఉంటారు. భార్యా పిల్లలతో హాయిగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. హోటలు, క్యారింగు, వస్త్ర, ఫ్యాన్సీ, పండ్లు, పూలు, కూరగాయలు తదితర వ్యాపారాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. భూములు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం

ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముందుచూపుతో పెట్టుబడులు పెట్టడం, పనులు ప్రారంభించడం వల్ల మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. దేవతా, గురుభక్తి, పెద్దల విషయంలో ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరి సహాయ సహకారాలు అందుతాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులు, నగలను కొంటారు. రోజువారీ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పనివారితో జాగ్రత్త.

సింహం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మంచి పేరు సంపాదిస్తారు. సాహిత్య, పత్రికా రంగాలలోని వారికి కలిసొస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అలసట లేకుండా శ్రద్ధతో పనులు చేస్తే పనులు సాఫీగా సాగుతాయి. న్యాయపరమైన సమస్యలు ఉంటాయి. వాహనాల వల్ల వృథా ఖర్చులుంటాయి.

కన్య

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అయినా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో అనుకూలత ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల నిర్ణయాలు ఉంటాయి. రోజువారీ వ్యాపారం కలిసొస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత ఉంటుంది. వ్యవసాయదారులకు దిగుబడి అనుకూలంగా ఉంటుంది. వాహనాల క్రయవిక్రయాలలో లాభాలుంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెద్దల సూచనలు పాటించాలి. రావాల్సిన డబ్బు అందకపోవచ్చు.

తుల

ప్రధానమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తే సత్ఫలితాలు పొందుతారు. చదువు, శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. కొత్త పనులు వేగంగా సాగుతాయి. క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్యవృత్తులలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. కొత్త వస్తువులు, నగలు కొంటారు. పెద్దల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి.

వృశ్చికం

గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సాహిత్య, పత్రికా రంగాలలో ఉన్నవారికి కొన్ని పనులు నెరవేరుతాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు గోచరిస్తున్నాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలుంటాయి. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందకపోవడంతో పనులు వాయిదా పడతాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనుస్సు

దాదాపుగా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించాలి. ప్రణాళిక బద్ధంగా పనులు చేయడం అవసరం. రోజువారీ వ్యాపారం కొంత లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద, ఇంజినీరింగ్ వృత్తిలో ఉన్నవారు సంతృప్తికరంగా ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించక పోవచ్చు. దేవతా, గురుభక్తి లోపిస్తుంది. ఆటంక పరిచే వారిని నమ్మడం వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. వాహనాల వల్ల ఖర్చులుంటాయి.

మకరం

ఆఫీసులో అందరితోనూ సామరస్యంగా ఉంటారు. అధికారుల ఆదరణ పొందుతారు. అనుకూల ప్రాంతాలకు బదిలీలు, ఉద్యోగంలో ప్రమోషన్‌లు ఉంటాయి. మంచి పేరు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచివారితో స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, పనివారితో ఇబ్బందులు గోచరిస్తున్నాయి, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. స్నేహితులు, అన్నదమ్ములు, ఆత్మీయులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద, వైద్య, ఇంజినీరింగు వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.

మీనం

పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్త్ర, వస్తువులు కొంటారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. హోటలు, క్యాటరింగు, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. రోజువారీ వ్యాపారాలలో ఇబ్బందులుంటాయి. సమయానికి డబ్బు చేతికి అందకపోవచ్చు. వాహనాల వల్ల వృథా ఖర్చులుంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

rasi-phalalu

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

1918
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles