కోపంగో


Sun,July 14, 2019 01:11 AM

kopamga
దావరి నదీ తీరంలో ఒక రైతుకు భూముంది. అక్కడ ఒక ఆశ్రమం నిర్మించి ఒక సన్యాసికి అవాసం కల్పించారు. ఆ సన్యాసి ఎంతో సౌమ్యుడు. అతను గొప్ప సాధు జీవితం గడుపుతూ వచ్చిన వాళ్లకు జ్ఞాన బోధ చేస్తూ వుండేవారు. అప్పుడప్పుడూ రైతు వచ్చి సన్యాసిని చూసి ఆయన అవసరాలను గమనించి ఆయన చెప్పే మంచి మాటలు వినేవాడు.

ఆ సన్యాసి కీర్తి పరిసర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయన పట్ల ఎందరికో గౌరవం ఏర్పడింది. ఆయన్ని దర్శించడానికి దూర ప్రాతాల నుంచి కూడా జనం రాసాగారు.

ఆ ప్రాంతంలో ఒక జమిందారు ఉండేవారు. సన్యాసికి క్రమక్రమంగా కీర్తి ప్రతిష్టలు వచ్చి అందరూ ఆ సాధువు గురించి గొప్పలు చెప్పుకోవడం భరించలేకపోయాడు. ఎట్లాగయినా ఆ సన్యాసికి నిలువ నీడా లేకుండా చేసి వెళ్లగొట్టాలని నిర్ణయించాడు. సన్యాసి వుంటున్న భూమి యజమానిని జమిందారు పిలిపించాడు. రైతు వచ్చాడు.

జమిందారు నీ భూమి కొందామనుకుంటున్నాను. ఇప్పటి నేలకు రెండింతలు ఇస్తాను. నీ భూమిని నాకివ్వు అన్నాడు.

రైతు అయ్యా! నేను భూమి అమ్మితే అక్కడ ఆశ్రమంలో ఉన్న సన్యాసి నిలువ నీడ లేకుండా పోతడు. అతని ఆలనా పాలనా చూసేవాళ్లు ఎవరూ ఉండరు. అతనికి మీరు ఎక్కడయిన వసతి కల్పించిన పక్షంలో నేను భూమిని అమ్మడానికి సిద్ధం. కానీ శాంత మూర్తి అయిన ఆ సన్యాసికి దారి చూపండి అన్నాడాయన. జమిందారు కండ్లు ఎర్రబడ్డాయి.

వాడు శాంతమూర్తి ఏంటి? దొంగజపం చేసుకుంటూ జనాల్ని మోసం చేస్తున్నాడు అన్నారు.

అంతమాట అనకండి స్వామీ! అతను చీమకు కూడా అపకారం తలపెట్టడు. తన పట్ల అపకారం తలపెట్టిన వాళ్ల్లకు కూడా ఉపకారం చేసే పుణ్య మూర్తి. అతను కోపమంటే ఎట్లంటిదో ఎరుగడు. అన్నాడు.
ఆ మాటల్తో జమీందారు మరింత ఉగ్రుడయ్యాడు.

సరే మంచిది అతనికి కోపం రాదంటున్నావు. ఒక వేళ అతనికి కోపం వస్తే నీ పొలం నాకు అమ్ముతావా? అన్నాడు.

రైతు తప్పకుండా అమ్ముతాను. మాటకు కట్టుబబతాను అన్నాడు.

జమీందారు మరుసటి ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్లాడు. సన్యాసి తాటాకుపై ఘంటంతో ఏదో రాసుకుంటున్నాడు. జమిందారు సన్యాసి వెనక నిల్చుని తుపుక్కున సన్యాసిపై ఎంగిలి ఉమ్మాడు. సన్యాసి వెనక్కి తిరిగి జమిందారును చూసి చిరునవ్వుతో నదిలోకి దిగి మునిగి వచ్చి మళ్లీ రాసుకోవడం మొదలు పెట్టాడు.

జమిందారు ఈసారి ముందుకు వచ్చి నిలబడి సన్యాసిపై వుమ్మాడు, సన్యాసి బదులివ్వకుండా లేచి నది నీళ్లలోకి దిగి మునక వేసి వచ్చి కూర్చున్నాడు.

సన్యాసి రాసుకోవడానికి ఆరంభంచేంతలో జమీందారు వుమ్మేవాడు. మరో మాట ఎత్తకుండా సన్యాసి నదిలోకి దిగి మునిగి వచ్చాడు.

ఇట్లా నూటా పదిసార్లు జరిగింది.

క్రమంగా జమిందారు ముఖం పేలవంగా మారింది. పశ్చాత్తాపం కలిగింది. తను ఇంత చేసినా చిరునవ్వు చెరగని ముఖంతో ప్రేమగా చూసే సన్యాసి పట్ల ఆరాధనా భావం కలిగింది.

జమిందారు వెంటనే సన్యాసి పాదాలపై పడి స్వామీ! నన్ను మన్నించు. చేయరాని దుర్మార్గం చేసిన నన్ను క్షమించు అన్నాడు.

సన్యాసి జమిందారును పైకి లేపి కూచోబెట్టి నదిలోకి వెళ్లి మరొకసారి మునిగి వచ్చి నేను చిన్నప్పుడెప్పుడో గోదావరి నదిలో నూట ఎనిమిది సార్లు మునక లేస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు అది పూర్తయిందిఅన్నాడు
జమిందారు కండ్లలో నీళ్లు నిండాయి. చేతులు జోడించాడు. రైతు ప్రత్యక్షమయ్యాడు.

సన్యాసి నాయన! మనం నిమితమాత్రులం. మనం కేవలం సాక్షీభూతంగా వుండాలి అన్నాడు.

ఆ మాటల్తో జమీందారు మరింత ఉగ్రుడయ్యాడు. సరే మంచిది అతనికి కోపం రాదంటున్నావు. ఒకవేళ అతనికి కోపం వస్తే నీ పొలం నాకు అమ్ముతావా? అన్నాడు. రైతు తప్పకుండా అమ్ముతాను. మాటకు కట్టుబబతాను అన్నాడు.

- సౌభాగ్య

207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles