పచ్చ బొట్టేసినా..!


Sun,July 14, 2019 02:04 AM

పచ్చబొట్టు అనేది చెరిగిపోదనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు టెంపరరీ టాటూలు కూడా దర్శనమిస్తున్నాయి.. అలా వచ్చినా కూడా మన తారలు మాత్రం.. పర్మినెంట్ టాటూల మీదే మోజు చూపిస్తున్నారు.. అలా టాటూలు వేయించుకున్న కొందరు తారామణులే వీరు.. ఈ నెల 17న నేషనల్ టాటూ డే.. ఈ సందర్భంగా కొందరు తారల పచ్చబొట్ల విశేషాలు..
rashmika

రష్మికా మందన

ఇప్పుడున్న హీరోయిన్లలో ఎక్కువ సినిమాలు చేస్తున్న నటి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ఈ అమ్మాయి కుడిచేతి మణికట్టు మీద ఇర్రెప్లేసబుల్ అని పచ్చబొట్టు ఉంటుంది. దీనికర్థం చేయలేనిది. అయితే ఈ టాటూని తను పెండ్లాడాలనుకున్న రక్షిత్‌ని విమర్శిస్తూ వేయించుకుందని అందరూ భ్రమపడ్డారు. కానీ రష్మిక ఈ టాటూని తన కాలేజ్ డేస్‌లోనే వేయించుకుందట.
Shalini-Pandey

షాలిని పాండే

షాలిని.. అర్జున్ రెడ్డి సినిమాతో క్యూట్ క్యూట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు కూడా తన కాలు మీద టాటూ వేయించుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఒకవైపు నవ్వు, మరో వైపు దుఃఖం కలిగి ఉన్న ముఖాలతో పాటు ముక్కలైన హృదయాన్ని పచ్చబొట్టుగా వేసుకుంది. అయితే ఈ హీరోయిన్ మరి ఇంకే టాటూ వేయించుకోనని ప్రమాణం చేసుకుంది. ఈ నొప్పిని భరించడం ఇదే మొదటి, చివరిసారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేసింది.
Niharika

నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ అంటే.. నిహారికనే! డిఫరెంట్ పంథాలో వెళ్లడం ఈ నటి స్పెషాలిటీ. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అమ్మడు చాలా చురుకు. చేతికి గోరింటాకు పెట్టుకొని వెనుకకు తిరిగిన ఒక ఫొటోను పోస్ట్ చేసింది నిహారిక. అయితే ఆ గోరింటాకు కాకుండా.. ఆమె వీపుమీద ఉన్న టాటూ మీదనే అందరి దృష్టి పడింది. స్వేచ్ఛా విహంగాన్ని తన వీపు మీద టాటూ వేయించుకుంది. తన ఆలోచనల్లాగే ఈ టాటూ ఉందని కూడా తెలియచేసింది.
Anu-Emmanuel

అను ఇమాన్యుయేల్

కొద్ది కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించిన నటి అను ఇమాన్యుయేల్. తెలుగు, తమిళ.. ఇతర భాషల్లో కూడా తన సత్తా చాటుకుంటున్నది ఈ నటి. ఈ అమ్మడు కూడా తన మెడ వెనుక భాగంలో ఒక టాటూ వేయించుకుంది. అయితే దీని అర్థం తెలియలేదు. ఈ హీరోయిన్ తన మణికట్టు మీద కూడా మరో టాటూ వేయించుకుంది. అదేంటంటే.. ఇమాన్యుయేల్ అని. తన చెల్లితో ఈ టాటూ వేయించుకొని ఇన్‌స్టాలో షేర్ చేసింది. దేవుడు మీతోనే ఉంటాడనేది ఈ టాటూ అర్థం.
aditi

అదితి మైఖేల్

అమీ-తుమీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది అదితి. ఎంతో ఇన్నోసెంట్‌గా కనిపించిన ఈ అమ్మాయి తను వేసుకున్న టాటూతో అందరినీ ఆశ్చర్యపరిచింది. నడుముకి పైన, హృదయానికి కాస్త పక్కగా 9.6.2017 అనే పర్మినెంట్ టాటూని వేయించుకుంది. ఆ రోజునే అమీ తుమీ విడుదలైంది. దీనికి గుర్తుగా తన ఒంటి మీద ఆ టాటూ వేయించుకున్నదట అదితి.
aditi1

775
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles