సూపర్ హాట్.. రెయిన్ కోట్!


Sun,July 14, 2019 12:15 AM

Rain-Coats
నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా.. అంటూ వర్షానికి ఆహ్వానం పలికేశాం.. కానీ ఈ చినుకు తాకే తడిలో.. బయట తిరుగాలంటే సరైన జాగ్రత్తలు అవసరం.. ఈ వర్షంలో గొడుగులు అన్ని వేళల్లో పనికి రాకపోవచ్చు.. బెస్ట్ మరో ఆప్షన్ అంటే.. రెయిన్ కోట్‌లే!మిగతా బట్టల్లాగా వీటినిట్రై చేసి కొనలేం.. అలా అని ఏవి పడితే వాటిని తీసుకోనూలేం.. మరి వీటిని ఎంచుకోవడం ఎలా? అనే కదా మీ సందేహం.. మీ సందేహ నివృత్తి కోసమే ఈ జంట కమ్మ నిండిపోయింది..

- సౌమ్య పలుస
Rain-Coats1
వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పడదో అన్నట్లుగా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు పట్టుకెళ్తాం. అయినా వర్షం పెద్దగా పడితే తడిసి ముద్దయిపోతాం. అలాంటప్పుడు మంచి ఆప్షన్.. రెయిన్ కోట్, రెయిన్ జాకెట్‌లే! ఆడవాళ్ల కోసం ఈ కలెక్షన్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. డిఫరెంట్ షేప్‌ల్లో, సైజుల్లో, పొడవుల్లో ఇలా రకరకాల రెయిన్ కోట్‌లు వచ్చాయి. అందులో వర్షం నుంచి మనల్ని రక్షించడమే కాదు.. మనల్ని మరింత అందంగా చూపించేందుకూ ఈ రెయిన్ కోట్‌లు పనికొచ్చేలా మారిపోయాయి. స్టయిల్‌లో కాంప్రమైజ్ కాకుండా వీటిని ఎంపిక చేసుకుంటే ఈ వర్షకాలం మరింత ఆనందంగా పూర్తవుతుంది.
Rain-Coats2

డిఫరెంట్ రెయిన్‌కోట్స్..

కొత్త కొత్త టెక్నాలజీలతో కూడా రెయిన్ కోట్‌లను తయారు చేస్తున్నారు. వానను కూడా ఎంజాయ్ చేస్తూ.. మనల్ని మనం రక్షించుకునేందుకు ఈ రెయిన్‌కోట్‌లు పనికొస్తాయి. అయితే వీటిని కొనేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా.. వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టంట్ అనే రకాలుంటాయి. వాటర్ రెసిస్టెంట్ ఉన్న రెయిన్ కోట్‌లు.. మామూలు వర్షాలకు, తుంపరల సమయంలో, వాటర్ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం వీటిని వాడవచ్చు. కాస్త ఎక్కువ వర్షం పడినప్పుడు ఈ రెయిన్‌కోట్‌లు నీళ్లను లోపలికి వెళ్లకుండా కాపాడుతాయని అనుకోలేం. కాబట్టి వాటర్ ప్రూఫ్ మంచి ఆప్షన్. డ్యురెబుల్-రిపిలెంట్ కోటింగ్ (డీడబ్ల్యూఆర్)తో ఉన్న వీటిని వాడడం వల్ల బయటనే కాదు.. నీళ్లు లోపల వరకు రాకుండా ఉంటాయి.
Rain-Coats3

ది బెస్ట్..

కొత్తగా రెయిన్ కోట్ కొంటున్నారా? దాని గురించి కొద్దిగా ఆలోచించండి. మిగతా బట్టల్లాగా ట్రై చేసి వీటిని కొనడానికి వీలుండదు. నీళ్లు వాటి మీద వంపేసి లోపలికి వస్తుందా? లేదా అని ఎవరూ చూసి కొనరు. కేవలం రెయిన్ కోట్‌ని చూసి కొనేస్తారు. అయితే కొనేటప్పుడు.. మరీ బిగుతుగా ఉన్నవి కాకుండా.. వదులుగా ఉండేవి కొనడం మంచిది. ఎందుకంటే.. కొన్నిసార్లు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కొచ్చు. దానివల్ల ఉక్కపోత మొదలవుతుంది. గోర్-టెక్స్ అనే మెటీరియల్‌తో చేసిన రెయిన్ కోట్‌లు కాస్త మీ శరీరానికి సరైన సాంత్వన కలిగిస్తాయి. మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా.. చెమటను కూడా లాగేస్తుంది. ఎక్కువ సమయం వర్షంలో ఉండాలనుకుంటే వాటర్‌ప్రూఫ్‌ని ఎంచుకోవాలి.
Rain-Coats4

రక్షణ ముఖ్యం..

రెయిన్ కోట్లంటే కేవలం.. పాలిథీన్ కవర్లతో, పాలిస్టర్‌తో చేస్తారనుకుంటారు. కానీ దీనికో పెద్ద కథే ఉంది. అవుటర్ షెల్‌లో హార్డ్, రెయిన్ షెల్ అని రెండు విభాగాలుంటాయి. హార్డ్ షెల్‌తో ఉన్న రెయిన్ కోట్ గాలి, వర్షాన్ని తట్టుకోగలదు. కాబట్టి వీటి ధర ఎక్కువ. పైగా ఎక్కువ స్టయిల్స్‌తో వచ్చేవి ఇవే. స్టయిల్స్, మ్యానుఫ్యాక్టర్స్, ఇతర ఫీచర్లను బట్టి వీటి ధరలు నిర్ణయించబడుతాయి. ఇక రెయిన్ షెల్‌లో మూడు విభాగాలుంటాయి. అవి.. రెండు లేయర్ల షెల్, 2.5 షెల్, సాఫ్ట్ షెల్‌తో ఉన్న రెయిన్ కోట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. రెండు లేయర్లు ఉన్న దాంట్లో.. లోపల మెష్ లైనింగ్ ఉంటుంది. దీనివల్ల బయట ఫ్యాబ్రిక్ ఒంటికి అతుక్కుపోదు. కానీ లోపలది మాత్రం ఒంటిని అంటుకుంటుంది. ఈ కారణంగా ఈ రెయిన్ కోట్ వేసుకొని ఎక్కువ పని చేయలేం. కేవలం బయట అలా తిరిగి వద్దామనుకుంటే మాత్రం వీటిని ఎంచుకోవచ్చు. 2.5లేయర్ విషయానికొస్తే మెష్‌తో పాటు, సన్నని లైనింగ్ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సమస్యా ఉండదు. పైగా ఇవి చాలా తేలికగా ఉండడం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. సాఫ్ట్ షెల్ అయితే.. ఎక్కువ పని చేసేవాళ్లకు మంచివి. కాకపోతే మిగతా రెయిన్ కోట్స్ కంటే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
Rain-Coats5

అదనం అవసరం..

వర్షంలో కాస్త తడిసినా జ్వరాలు రావడం ఖాయం. అలాంటప్పుడు.. కేవలం శరీరం మాత్రమే తడవకుండా ఉండాలనుకోవడం పొరపాటు. అందుకే దీనికి హుడీ ఉన్నవి ఎంచుకోవాలి. తలను కూడా కవర్ చేస్తూ ఉంటే మనం పూర్తి ప్రొటెక్షన్‌లో ఉన్నట్టే భావించొచ్చు. అలాగే వీటికి టాగిల్స్ కూడా ఉండాలి. బైక్ నడిపేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు తలను పట్టేలా ఈ టాగిల్స్ పని చేస్తాయి. ఇంకా.. చేతి మణికట్టు వద్ద కూడా అడ్జస్టబుల్ ఉంటే మరింత హాయిగా అనిపిస్తుంది. అమ్మాయిలకు మరీ ముఖ్యంగా స్ట్రెచబుల్ ఉంటే మరింత బాగుంటారు. మనం తడవకుండా ఉండడమే కాకుండా.. మన వస్తువులు కూడా తడవవద్దు అనుకుంటే పాకెట్స్ ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవాలి. లోపలి వైపు కూడా కొన్ని రెయిన్ కోట్‌లకి పాకెట్స్ వస్తాయి. అలాంటివి ఎంచుకున్నప్పుడు వస్తువులు పోతాయనే సందేహం కూడా ఉండదు. స్లిమ్ -ఫిట్ లాంటివి ఎంచుకుంటే వీటిని మడతపెట్టి బ్యాగేజ్‌లో వేయడం కూడా హాయి. తక్కువ స్థలంలో వీటిని సర్దేయొచ్చు.
Rain-Coats6

అన్నీ ముఖ్యమే..

పొడవు.. పొట్టి ఇలా ఎన్నో బట్టల విషయంలో ఆలోచిస్తాం. కానీ రెయిన్ కోట్స్ విషయంలో కూడా అలాగే ఆలోచించాలంటున్నారు ఫ్యాషనిస్టులు. స్టయిలిష్‌గా కనిపించేందుకు కొన్ని పక్కగా చూసుకోవాలంటున్నారు. మోకాళ్ల వరకు ఉన్నవి ఏ కాలంలోనైనా, ఎలాంటి డ్రెస్‌ల మీదకైనా వేసుకోవచ్చు. ఇక నడుము వరకు ఉన్నవి స్పోర్ట్స్ లుక్‌ని ఇస్తాయి. కేవలం లుక్ కోసం అనుకునేవాళ్లు ఉదయం వేళల్లో వీటిని ధరించొచ్చు. క్యాజువల్ డ్రెస్‌ల మీదకి ఇవి బాగుంటాయి. అనోరక్ స్టయిల్ రెయిన్‌కోట్‌లకు జేబులు బొజ్జ మీద వస్తాయి. దీనివల్ల చలి పుట్టినప్పుడు చేతుల్ని గట్టిగా లోపలికి పెట్టుకొని వెచ్చబరుచుకోవచ్చు. ఖాకీ, బీజ్, బ్లాక్ రంగులు ఎలా వాడినా కూడా పాడుకోవు. అలాకాకుండా.. లైట్ కలర్స్ ఎంచుకుంటే ఈ వర్షంలో వాటి రూపు రేఖలే మారిపోతాయి.
Rain-Coats7

809
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles