చివరి వరకూ భర్త వెన్నంటే నిలిచిన కస్తూర్బా గాంధీ


Sun,July 14, 2019 12:21 AM

Kasturba-Gandhi
కస్తూరిబాయి..చాలామందికి మోహన్‌దాస్ కరంచంద్‌గాంధీ భార్యగానే తెలుసు. కానీ ఆయనతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన ధీశాలి ఆమె. బాల్యంలోనే గాంధీతో వివాహం అయ్యాక ఆయన గెలుపోటములలో వెన్నంటే నడిచింది.మహాత్మునితో పెండ్లి తర్వాత ఆయనే తన సర్వస్వం అనుకుని తన జీవితాన్ని ఆయనకే అంకితం చేసింది. మరణించే వరకు గాంధీకి అడుగులో అడుగై తన జీవన గమనాన్ని కొనసాగించింది. గాంధీజీ సాగించిన ప్రతి పోరాటంలో ఆయనతో పాటు జైలు జీవితాన్ని అనుభవించింది. దేశ స్వాతంత్య్రం కోసం పలు సందర్భాల్లో ఆయన స్థానంలో సభల్లో ప్రసంగించి భారతీయులను పోరాటంలో కార్యోన్ముకులను చేయడంలోనూ ముందుంది. 75 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కస్తూర్బాగాంధీ చివరిపేజీ.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

అది గుజరాత్‌లోని పోరుబందర్. గోపాల్‌దాస్ కపాడియా ఆ ప్రాంతంలో పేరు మోసిన వ్యాపారి. గుజరాతి వర్తక కుటుంబమైన మోడ్ బనియా సామాజిక వర్గానికి చెందిన ఆయన భారతీయ సంప్రదాయ పద్ధతిలో 1883 మేలో కూతురు కస్తూరిబాయి మఖం జీ కపాడియా వివాహం చేశారు. అప్పటికీ ఆమె వయస్సు కేవలం 14 సంవత్సరాలు. పెండ్లి కొడుకు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. ఆయన వయస్సు అప్పటికీ 13 సంవత్సరాలే. వారిది బాల్యవివాహం.

1942 ఆగస్టు10
మహాత్మాగాంధీ బొంబాయి శివాజీ పార్కులో చాలా పెద్ద బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. దానికి ఒకరోజు ముందు 1942 ఆగస్టు 9న ఆయన్ను ముంబైలోని బిర్లా హౌస్ వద్ద అరెస్ట్ చేశారు.గాంధీ అరెస్ట్ తర్వాత ఆ సభలో ప్రధాన వక్తగా ఎవరు ప్రసంగిస్తారు అనే పెద్ద ప్రశ్న ఎదురైంది. అప్పట్లో మొత్తం ముంబైలో గాంధీ స్థాయి ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. అప్పుడే కస్తూర్బా హఠాత్తుగా మీరేం కంగారు పడకండి, మీటింగ్‌లో నేను మాట్లాడతా అన్నారు. కస్తూర్బా మాట విని అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే బా అప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. అంతే కాదు అంతకు ముందెప్పుడూ ఆమె సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. సభకు గంట ముందు కస్తూర్బా సుశీలా నాయర్‌కు తన స్పీచ్ డిక్టేట్ చేయించారు. శివాజీ పార్క్ వెళ్లడానికి కారులో కూచున్నారు. ఆరోజు కస్తూర్బా గాంధీ లక్షన్నర మంది హాజరైన సభలో ప్రసంగించారు. ఆమె మాటలు విని జనం భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది కళ్లు చెమర్చాయి. కస్తూర్బా గాంధీ ప్రసంగం పూర్తి కాగానే, ఆమెను సుశీలా నాయర్‌తోపాటు అరెస్ట్ చేశారు. 30 గంటల వరకూ ఆమెను మామూలు నేరస్థులతో కలిపి ఒక చీకటి గదిలో ఉంచారు. ఆ తర్వాత ఆమెను పుణెలోని ఆగాఖాన్ ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. మహాత్మాగాంధీ అంతకు ముందే అదుపులో ఉన్నారు.

నిజానికి కస్తూర్బాకు స్పీచ్, ఉద్యమాలు కొత్తేమీకాదు. కస్తూరిబాయి గాంధీ తన భర్తతో కలిసి అనేక రాజకీయ నిరసన కార్యక్రమాలలో పాల్గొంది. తన భర్తతో కలిసి ఉండటానికి 1897లో ఆమె దక్షిణాఫ్రికా వెళ్ళింది. అక్కడ 1904 నుండి 1914 వరకు ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ పోరాటంలో చురుకుగా పాల్గొంది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913లో జరిగిన నిరసన సమయంలో, కస్తూరిబాయి అరెస్టు అవ్వడంతోపాటు మూడు నెలలు కఠిన కారాగార శిక్షను అనుభవించింది. తరువాత, భారతదేశంలో తన భర్త జైలులో ఉన్న సమయంలో ఆమె కొన్నిసార్లు ఆయన స్థానంలో పనిచేసింది. 1915లో, నీలిరంగును ఉత్పత్తి చేసే మొక్కలను పెంచే వారికి అండగా నిలవటానికి గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, కస్తూరిబాయి ఆయనతో పాటు వచ్చింది. స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు, పిల్లలకు ఆమె పరిశుభ్రత, క్రమశిక్షణ, చదవటం, రాయటం నేర్పించేది.

కస్తూరిబాయి చిన్నతనం నుండే దీర్ఘమైన శ్వాస నాళాల వాపుతో బాధపడింది. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ సమయంలో గాంధీజీ అరెస్ట్‌తోపాటు బ్రిటిష్ వారి నుండి వచ్చే ఒత్తిళ్లు ఆమెను అనేక ఇబ్బందులకు గురిచేసేది. ఆమెకున్న శ్వాసనాళాల వాపు తరువాత న్యూమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి)కు దారితీసింది. జనవరి 1944లో, కస్తూరిబాయికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆమె చాలాకాలం మంచంలోనే గడిపింది. అయినా ఆమెకు బాధ నుండి ఏమాత్రం ఉపశమనం దొరకలేదు. ఊపిరి అందకపోవటంతో కొన్నిసార్లు రాత్రిళ్ళు ఆమెకు నిద్ర కరువైంది. ఆమెకు సంప్రదాయ ఆయుర్వేద వైద్యం అందించడంలో నాటి బ్రిటిష్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేసింది. 1944 జనవరి నాటికి కస్తూర్బా ఇక కొన్నిరోజులే ఉంటారనే విషయం గాంధీకి అర్థమైంది. ఆమె మరణించడానికి నెల ముందు జనవరి 27న ఆయన కస్తూర్బాకు చికిత్స చేయడానికి ప్రముఖ వైద్యుడు, డాక్టర్ దినషాను పిలిపించాలని హోంశాఖకు లేఖ రాశారు.గాంధీజీ పలుమార్లు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సాంప్రదాయక భారతీయ వైద్యంలో ఆమెకు చికిత్స చేయటానికి మందులను సూచించటానికి నిపుణుడికి అనుమతి ఇచ్చింది. మొదట్లో ఆమెలో కొద్దిగా గుణం కనిపించింది- ఫిబ్రవరి రెండవ వారంలో కొద్దిగా కోలుకుని వరండాలో చక్రాల కుర్చీలో కొద్దిసేపు కూర్చుని, మాట్లాడేది... అప్పుడే ఆ జబ్బు మళ్ళీ తిరగబెట్టింది. ఆ వైద్యుడు ఆయుర్వేద మందు ఆమెకు ఇంక పనిచేయదని చెప్పారు. దిగజారిపోతున్న ఆమె ధైర్యానికి నీకు త్వరలోనే బాగవుతుంది అని చెపుతూ అండగా నిలువటానికి ప్రయత్నించిన వారికి, కస్తూరిబాయి లేదు, నా కాలం తీరిపోయింది అని చెప్పేవారు. గుండెపోటు వల్ల కసూ ్తర్బా చాలా బలహీనం అయిపోయారు.

ఎప్పుడూ పడుకునే ఉండేవారు. గాంధీ ఎక్కువగా ఆమె పక్కనే కూచునేవారు. కస్తూర్బా సులభంగా తినడానికి వీలుగా ఒక చెక్కస్టూల్ చేయించిన ఆయన, దానిని ఆమె మంచం పక్కనే ఉంచేవారు. తర్వాత ఆ స్టూల్ బాపూజీకి కస్తూర్బా జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆమె చనిపోయాక ఆయన ఎక్కడికి వెళ్లినా, ఆ చిన్న స్టూలును తనతోపాటే తీసుకెళ్లేవారు.మనవరాలు కనూ గాంధీని కస్తూరిబాయితో పాటూ ఉండడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు. కనూ అంతకు ముందు కూడా కస్తూర్బాను చూసుకునేవారు. ఆమెకు తరచూ భజనలు, గీతాలు పాడి వినిపించేవారు. ఫిబ్రవరి 3న కనూ గాంధీకి కస్తూర్బాతోపాటూ ఉండడానికి అనుమతి లభించింది. కానీ డాక్టర్ను పిలిపించాలన్న గాంధీ వినతిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. బా చివరిరోజుల్లో అవసరమైనప్పుడు వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు, డాక్టర్ వైద్యరాజ్ జైలు బయటే తన కారు నిలిపి అందులోనే పడుకునేవారు. కస్తూర్బాను కాపాడే ఆఖరి ప్రయత్నంగా ఆమె కొడుకు దేవదాస్ గాంధీ, కోల్‌కతా నుంచి పెన్సిలిన్ మందు తెప్పించారు. పెన్సిలిన్ ఆ సమయం లో కొత్తగా వచ్చింది. దానిని వండర్ డ్రగ్ అనేవారు. కానీ కస్తూర్బాకు పెన్సిలిన్ ఇంజక్ట్ చేయబోతున్నారని తెలియగానే.. గాంధీ దానికి ఒప్పుకోలేదు. గాంధీ తర్వాత కొన్ని రోజులు బా పక్కనే ఆమె చేయి పట్టుకుని కూచునే గడిపారు. తర్వాత వారి కొడుకు హరిలాల్ ఆమెను చూడడానికి వచ్చారు. కానీ ఆయన అప్పుడు మద్యం మత్తులో మునిగి ఉన్నారు. దాంతో, ఆ పరిస్థితిలో కూడా కస్తూర్బా గుండెలపై కొట్టుకుంటూ ఆయన్ను తిట్టారు. ఫిబ్రవరి 22న కస్తూర్బా జీవితంలో ఇక కొన్ని గంటలే మిగిలి ఉండగా దేవదాస్ 3 గంటల సమయంలో ఆమె పెదాలపై కొన్ని గంగాజలం చుక్కలు వేశారు.

Kasturba-Gandhi1
దేశం మొత్తం కస్తూర్బా అంత్యక్రియల్లో పాల్గొనడానికి అనుమతించాలని, లేదంటే తను ఒంటరిగానే ఆమెకు అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. తర్వాత బా చితికి ఎలాంటి కలపను ఏర్పాటు చేయాలనే ప్రశ్న తలెత్తింది. గాంధీ సన్నిహితులు చాలామంది దహనం కోసం గంధపు చెక్కలు పంపిస్తామని చెప్పారు. కానీ గాంధీ దానికి ఒప్పుకోలేదు.పేద వ్యక్తి భార్య అయిన కస్తూర్బాను ఖరీదైన గంధపు చెక్కలతో దహనం చేయడానికి ఒప్పుకోనని గాంధీ స్పష్టంగా చెప్పారు. 1943 ఫిబ్రవరిలో గాంధీ 21 రోజులు నిరశన దీక్ష చేయడంతో ఆయన చనిపోతారని భావించిన వారు వాటిని తెప్పించి పెట్టారు. అదే విషయం వారు గాంధీకి కూడా చెప్పారు.

కొద్దిసేపటి తరువాత సాయంత్రం 7.30కు కస్తూర్బా తుది శ్వాస విడిచారు. వారిద్దరూ పుణే జైలులో ఉండగానే గాంధీ చేతులలో ఆమె మరణించిందిసుశీలా నాయర్, మీరా బేన్‌తో కలిసి గాంధీ ఆమెకు అంతిమ స్నానం చేయించారు. కొన్ని రోజుల ముందు గాంధీ పుట్టినరోజు నాడు ఆమె కట్టుకున్న ఎర్ర అంచు చీరను కట్టారు. గాంధీ తన చేతులతో కస్తూర్బా పాపిట కుంకుమ పెట్టారు. అప్పుడు ఆమె కుడి చేతికి ఐదు గ్లాస్ గాజులు ఉన్నాయి. వాటిని ఆమె తన వైవాహిక జీవితం అంతటా ఎప్పుడూ ఉంచుకుంటూ వచ్చారు. కస్తూర్బా గాంధీ అంత్యక్రియలు బహిరంగంగా జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. కానీ గాంధీ మొండిపట్టు పట్టారు. దేశం మొత్తం కస్తూర్బా అంత్యక్రియల్లో పాల్గొనడానికి అనుమతించాలని, లేదంటే తను ఒంటరిగానే ఆమెకు అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. తర్వాత బా చితికి ఎలాంటి కలపను ఏర్పాటు చేయాలనే ప్రశ్న తలెత్తింది. గాంధీ సన్నిహితులు చాలామంది దహనం కోసం గంధపు చెక్కలు పంపిస్తామని చెప్పారు. కానీ గాంధీ దానికి ఒప్పుకోలేదు. పేద వ్యక్తి భార్య అయిన కస్తూర్బాను ఖరీదైన గంధపు చెక్కలతో దహనం చేయడానికి ఒప్పుకోనని గాంధీ స్పష్టంగా చెప్పారు. జైలు అధికారులు ఆయనతో తమ దగ్గర ముందే తెచ్చిపెట్టిన కొన్ని గంధపు చెక్కలు ఉన్నాయని చెప్పారు. 1943 ఫిబ్రవరిలో గాంధీ 21 రోజులు నిరసన దీక్ష చేయడంతో ఆయన చనిపోతారని భావించిన వారు వాటిని తెప్పించి పెట్టారు.

అదే విషయం వారు గాంధీకి కూడా చెప్పారు. చివరికి గాంధీ ఆ గంధపు కొయ్యలను కస్తూర్బా చితికి ఉపయోగించడానికి అంగీకరించారు. వాటిని నా చితి కోసం తెప్పించింది నిజమే. అయితే, వాటిని నా భార్య చితికి ఉపయోగించవచ్చు అని ఆయన వారితో అన్నారు. తర్వాత రోజు పది గంటలకు అంతకు కొన్నిరోజుల ముందే గాంధీ సహచరుడు మహాదేవ్ దేశాయ్ చితి ప్రాంతంలోనే చితిని ఏర్పాటు చేశారు. కస్తూర్బా పార్థివ దేహాన్ని ఆమె ఇద్దరు కొడుకులు ప్యారే లాల్‌తో పాటు స్వయంగా గాంధీనే మోశారు. దేవదాస్ చితికి నిప్పు పెట్టా రు. చితి మంటలు పూర్తిగా ఆరిపోయేవరకూ గాంధీజీ చితి ముందు ఉన్న ఒక చెట్టుకిందే కూచుండిపోయారు. మీరు మీ గదిలోకి వెళ్లండని అందరూ గాంధీ కి చెప్పారు. కానీ గాంధీ 62 ఏళ్లు జీవించిన తర్వాత ఈ భూమిపై చివరి క్షణాల్లో ఆమెను ఎలా వదలగలను? అలా చేస్తే తను నన్ను ఎప్పటికీ క్షమించదు అన్నారు. అంత్యక్రియ ల తర్వాత నాలుగో రోజు రామ్‌దాస్, దేవదాస్ కస్తూర్బా అస్థికలు సేకరించడానికి అక్కడికి వచ్చినపుడు, తల్లి చేతికి ఉన్నఐదు గ్లాస్ గాజులు పూర్తిగా అలాగే ఉండడం చూశా రు. చితి మంటల్లో కూడా అవి చెక్కు చెదరలేదు. గాంధీకి ఆ విషయం చెప్పినపుడు, ఆయన కస్తూర్బా మన మధ్య నుంచి ఎక్కడికీ వెళ్లలేదనడానికి, ఎప్పటికీ మనతోనే ఉంటుందని చెప్పడానికి అవి సంకేతం అన్నారు.

Kasturba-Gandhi2
1942 ఆగస్టు 9న గాంధీని బొంబాయిలోని బిర్లాహౌస్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌తో ఆ సభలో ఎవరు ప్రసంగిస్తారు అనే పెద్ద ప్రశ్న ఎదురైంది.అప్పట్లో మొత్తం బొంబాయిలో గాంధీ స్థాయి వ్యక్తి ఎవరూ లేరు. అప్పుడే కస్తూర్బా హఠాత్తుగా మీరేం కంగారు పడకండి, మీటింగ్‌లో నేను మాట్లాడతా అన్నారు. ఆమె మాట విని అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే బా అప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. ఆరోజు కస్తూర్బా లక్షన్నర మంది హాజరైన సభ లో ప్రసంగించారు. ఆమె మాట లు విని జనం భావోద్వేగానికి గురయ్యా రు. చాలా మంది కళ్లు చెమర్చాయి.

766
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles