తనను తానే మనువాడింది!


Sun,August 4, 2019 01:49 AM

uganda-woman
పెండ్లి తంతులో అబ్బాయి.. అమ్మాయి.. తుళ్లిపడుతూ సంబురంగా వేడుక చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆడ-ఆడ, మగ-మగ పెండ్లిళ్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. కానీ ఈ అమ్మాయి మాత్రంసరికొత్త పెండ్లి చేసుకొని అందరూ నోళ్లు ్ల వెళ్లబెట్టేలా చేసింది. అదెలాగంటే..

పెండ్లి చేసుకునే సమయానికి బాజాలు, భజంత్రీలు లేకున్నా ఫర్వాలేదు. పెండ్లి మండపంలో తప్పకుండా వధూవరులు ఉంటే చాలు. ఏదొవిధంగా వివాహ తంతు ముగుస్తుంది. ఇంక ఏ పెండ్లిలో అయినా ఇద్దరు మాత్రం తప్పనిసరి. ఇక్కడి పెండ్లిలో ఇద్దరితో పనిలేకుండానే పెండ్లి జరిగిపోయింది. వధూవరుడూ ఒక్కరే కావడం ఇక్కడ విశేషం. ఉగాండా దేశంలో 32 ఏండ్ల లూలు జెమిమా విచిత్రమైన వివాహానికి తెరలేపింది. పెండ్లి చేసుకోమని ఎప్పుడూ అడిగే ఆమె తల్లిదండ్రులకు వైవిధ్యమైన రీతిలో సందేశం ఇవ్వాలనుకున్నది. పెండ్లి చేసుకుంటే నచ్చిన వారినే చేసుకుంటానని తెగేసి చెప్పింది. అందుకువారు కూడా ఒప్పుకొన్నారు. పెండ్లి కుమార్తెగా ముస్తాబై వివాహ వేదిక మీదకు వచ్చిన ఆమె వింత సమాధానం చెప్పి అందరినీ షాక్ గురిచేసింది. తనకు తానే ఇష్టమని.. అందుకే తనను తానే వివాహం చేసుకుంటానని తెలిపింది. దీంతో అక్కడికి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులను నొప్పించకుండా ఉండడం కోసమే ఇలా చేశానని జెమిమా అంటున్నది. అందుకోసమే ఈ వింత పెండ్లి చేసుకున్నానని చెబుతున్నది. బాగా చదువుకొని భవిష్యత్‌లో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని ఆమె తెలిపింది. లూలు జెమిమా ఇలాంటిదేదో చేస్తుందని ముందే ఊహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలా చేయడం తప్పేనని తెలిసినా నా సమస్యను వారికి తెలియజేయడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదని జెమిమా చెప్పింది. ఈ పెండ్లికి పెద్దగా ఖర్చు పెట్టింది కూడా లేదు. కేవలం కల్యాణ వేదిక దగ్గరకు వెళ్లడానికి మాత్రమే రవాణా చార్జీలు అయ్యాయి. పెండ్లి గౌను జెమిమా స్నేహితురాలు బహుమతిగా ఇచ్చింది.
uganda-woman1
వెడ్డింగ్ కేక్ ఆమె సోదరుడు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ వేడుకకు వచ్చే అతిథులకు భోజనానికి సంబంధించిన ఖర్చులు ఎవరివి వారే భరించాలని ముందే వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో వెల్లడించింది లూలు. దీంతో వచ్చిన వారెవరూ కూడా భోజన వసతి గురించి ఇబ్బంది పడలేదు. తల్లిదండ్రులేవరూ చదువుకునే ఆడ పిల్లల ముందు ఇలా పెండ్లి ఆలోచన తీసుకురాకుండా ఉండేందుకే జెమిమా ఇలా పెండ్లి చేసుకొని ఓ కొత్త సందేశం ఇచ్చింది. చేసిన పనిలో తప్పేలేదని పెండ్లికి వచ్చిన గురువు వెల్లడించాడు. చదువుపై ఆసక్తి కలిగిన పిల్లలకు పెండ్లి గురించి ఆలోచన ఉండదు. కాబట్టి వారి ముందు ఇటువంటి విషయాలను తీసుకురాకుండా ఉంటేనే ఉత్తమమని ఆయన తెలిపాడు. లూలు జోమిమా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నది. మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను చూసుకోవాలని ఆమె ఆశపడింది. కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో ఈ వింత పెండ్లి చేసుకున్నది. ఆమె చేసిన పనిని కొందరు తప్పుబట్టారు. కానీ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని కోరుకోవడం పట్ల నెటిజనులు ప్రశంసిస్తున్నారు. తనను తాను పెండ్లి చేసుకోవడాన్ని సోలోగమి అని అంటారు. ఇటువంటి వివాహాలకు సంబంధించి పాశ్చాత్యదేశాల్లో ప్రత్యేకంగా చట్టం కూడా ఉన్నది. వధూవరులకు ఏ మాదిరిగా వివాహం జరుగుతుందో అదే విధంగా సోలోగమి పెండ్లి తంతు కూడా ఉంటుంది. పెండ్లికి హాజరయిన అతిథులతో కలిసి కేక్ కట్ చేయడం, ఆ తర్వాత రిసెప్షన్ వంటివి ఉంటాయి. వైవాహిక జీవితంపై అసంతృప్తి చెందిన మహిళలు, పురుషులు సోలోగమి విధానంలో పెండ్లి చేసుకొని నిరసన వ్యక్తం చేయడం ఎప్పటి నుంచో ఉన్నదట. ఇటువంటి పెండ్లిళ్లు చేసుకున్నవారిలో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ గ్రేస్ గెల్డర్, ఇటాలియన్ ఫిట్‌నెస్ ట్రైనర్ లారా మెసి వంటి వారున్నారు.
uganda-woman2
పెండ్లి చేసుకోమని ఎప్పుడూ అడిగే ఆమె తల్లిదండ్రులకు వైవిధ్యమైన రీతిలో సందేశం ఇవ్వాలనుకున్నది. పెండ్లి చేసుకుంటే నచ్చిన వారినే చేసుకుంటానని తెగేసి చెప్పింది. అందుకువారు కూడా ఒప్పుకొన్నారు. పెండ్లి కుమార్తెగా ముస్తాబై వివాహ వేదిక మీదకు వచ్చిన ఆమె వింత సమాధానం చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది. తనకు తానే ఇష్టమని.. అందుకే తనను తానే వివాహం చేసుకుంటానని తెలిపింది.

244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles