కొత్త పెయింటింగ్ లోకం


Sun,August 4, 2019 12:29 AM

pantting
ప్రస్తుత ప్రపంచం నుంచి.. మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడం ఓ చిత్రకారుడికే సాధ్యమేమో! ఎందుకంటే తన కుంచెతో ఓ కొత్తలోకాన్ని సృష్టించగలడు. ఊహలకు రూపమిచ్చి మరో ప్రపంచాన్ని పరిచయం చేయగలడు. అలాంటి అరుదైన కళాకారుడు చైనాకు చెందిన మింగ్ ఫాన్.
pantting1
ఈఅద్భుత దృశ్యాలన్నీ మింగ్ ఫాగ్ చేతి కుంచె నుంచి జాలు వారినవే. ఒక్కో దృశ్యం.. ఒక్కో ప్రపంచం. ఇతను గీసిన ప్రతీ బొమ్మ ఓ అద్భుతమే. మింగ్ ఫాంగ్ గీసే ప్రకృతి బొమ్మలను చూస్తే.. ఆ ప్రకృతే పరవశించి పోతుంది. చైనాకి చెందిన మింగ్ ఫాన్ కాన్సెప్ట్ డిజైనింగ్‌లో అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. డిజైనర్ ఆర్టిస్ట్ అయిన ఫాన్.. వీడియో గేమ్స్, యానిమేషన్స్ కోసం మన కళ్లతో నమ్మలేని అద్భుతమైన లాండ్‌స్కేప్స్, కాన్సెప్ట్ డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. షాంఘైలో నివసిస్తున్న మింగ్ ఫాన్.. ఇప్పటికే చాలా సృజనాత్మక పోటీల్లో పాల్గొన్నాడు. తన చుట్టూ ఉండే లాండ్‌స్కేప్‌లనే ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని.. వీడియో గేమ్స్, మూవీస్ కోసం కాన్సెప్ట్ డిజైన్స్‌ను రూపొందిస్తున్నాడు. మింగ్ సృజనాత్మకతకు ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి.
pantting2

సోమరితనం నుంచి..

షాంఘైలోని జియాంగ్జీ, జిషన్ జియుఫెంగ్ ప్రాంతానికి చెందిన మింగ్‌ఫాన్ చిన్నప్పటి నుంచీ చాలా బద్ధకస్తుడు, సోమరి. తెలియనివాళ్లని చూసి ఎక్కువగా భయపడేవాడు. దీంతో బంధువులు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందిపడేవారు. మొదట్లో ఫాన్‌కి పెయింటింగ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. క్రమంగా పెయింటింగ్‌లో ఏదో విషయం ఉందని గ్రహించాడు. మనిషిని మేల్కొలిపే ఓ నిశ్శబ్ద శక్తి పెయింటింగ్‌కు ఉందని తెలుసుకున్నాడు. క్రమంగా తన ఒంటరితనాన్ని పెయింటింగ్స్ వేయడానికి ఉపయోగించాడు. అలా పెయింటింగ్‌పై శ్రద్ధ పెట్టి.. కొత్తగా ప్రయత్నించేవాడు. తనలోని గొప్ప చిత్రకారుడ్ని మేల్కొలిపాడు ఫాన్. కొన్ని సంవత్సరాలు గ్వాంగ్‌జౌలో ఆయిల్ పెయింటింగ్స్‌ని వేశాడు. జియామెన్‌లో సిటీలో పెయింట్స్ డిజైనింగ్ చేశాడు. అలా నాన్‌చాంగ్‌లోని ఓ ఆర్ట్ కాలేజీ ప్రవేశ పరీక్షా ఉపాధ్యాయునిగానూ పనిచేశాడు మింగ్ ఫాన్.
pantting3

యానిమేషన్ పెయింటింగ్ వైపు..

క్రమంగా పెయింటింగ్‌ను తన వృత్తిగా మార్చుకున్నాడు మింగ్ ఫాన్. యానిమేషన్‌కు సంబంధించిన పెయింటింగ్స్‌వైపు ఆసక్తి పెంచుకున్నాడు. పెయింటింగ్స్‌తోపాటు కంప్యూటర్ గేమ్స్ ఎక్కువగా ఆడడం, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడడం, పాటలు వినడం, నవలలు చదవడం వంటివి అలవాటు చేసుకున్నాడు. అలా ఓ సన్నివేశాన్ని ఊహించుకొని ఇలా అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు మింగ్‌ఫాన్. ఇలా కొన్ని ఆర్ట్ సంస్థల్లో సభ్యుడిగా ఉంటూ పలు పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో చైనా పెయిటింగ్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే బంగారు పెన్ను అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాడు మింగ్‌ఫాన్. కుంచె పట్టుకుంటే ఏదో ఒక కొత్త చిత్రాన్ని గీయంది నిద్రపోడు ఫాన్. తనకెంతో ఇష్టమైన పెయింటింగ్‌ను జీవితాంతం కొనసాగిస్తానని సంతోషంగా చెబుతున్నాడు.
pantting4
pantting5
pantting6
pantting7
pantting8

193
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles