తెలుగు తెరమీదకు అమెరికన్ అందాల తార!? ఎమ్మా రాబర్ట్స్


Sun,August 4, 2019 12:43 AM

Emma-Roberts
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుతున్న ఈ సినిమా అప్‌డేట్లు తాజా అనౌన్స్‌మెంట్లతో మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈ చిత్రంలో కుమ్రంభీమ్ పాత్ర లో నటిస్తున్న ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ తారలనే దించాలని జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికన్ అందాల తార ఎమ్మా రాబర్ట్స్‌ను సెలెక్ట్ చేసుకొన్నట్టు వినబడుతున్నది. ఇంతకీ ఎమ్మా రాబర్ట్స్ ఎవరు?

లాస్ ఏంజెల్స్‌లోని ఆర్చర్ స్కూల్‌లో చదువుకుంది. సారా లారెన్స్ కాలేజీలో ఇంగ్లిష్ లిటరేచర్ చేసింది.

అమెరికాలోని న్యూయార్క్‌లో 1991లో పుట్టింది.

నాన్సీ డ్య్రూ, హోటల్ ఫర్ డాగ్స్, స్క్రీమ్4, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫన్నీ స్టోరీ, ద బ్లాక్ కోట్స్ డాటర్, హూ వియ్ ఆర్ నౌతో మరిన్ని సినిమాలు ఆమె సక్సెస్ లిస్ట్‌లో ఉన్నాయి.

పార్టీల్లో గడపడం, డైటింగ్ చేయడం అంటే ఎమ్మాకు అసలే నచ్చదు. ఆమె టైం అంతా ఫ్రెండ్స్‌తో గడిపి సరదాగా ఉండాలనుకుంటుంది.

ఆస్కార్ గ్రహీత హాలీవుడ్ నటుడు ఎరిక్ రాబర్ట్ కూతురు..ఎమ్మా రాబర్ట్స్

ఎమ్మా రాబర్ట్స్.. హాలీవుడ్‌లో పేరున్న నటి, సింగర్. కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ కూడా.

తన కెరీర్ మొదలైనప్పటి నుంచి సినిమాల్లో, టీవీ షోలలో నటిస్తూ పేరు సంపాదిస్తున్నది. ఇప్పటి వరకే 40కి పైగా సినిమాల్లో, 15 టీవీ సీరియల్స్‌లో భిన్న పాత్రల్లో నటించింది.

ఈమె అమెరికా, ఆస్ట్రేలియా ఫిలిమ్ వేదికల మీద ఉత్తమ నటిగా, టెలివిజన్ యాక్టర్‌గా సుమారు 18 అవార్డులు అందుకున్నది.

2001 బ్లో సినిమాలో కూతురు పాత్రలో మొదటి సారి నటించింది. 2004 అన్‌ఫ్యాబులస్ మ్యూజిక్ అల్బమ్‌లో లీడ్ రోల్‌లో నటించి అవార్డులను అందుకుంది. అప్పుడే సింగర్‌గా కూడా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఎమ్మా పుస్తక ప్రియురాలు. వారానికి ఒక పుస్తకాన్ని చదువగలదు. బెలిట్రిస్ట్ పేరుతో బుక్ క్లబ్ కూడా ఎమ్మాకు ఉంది.

మేనత్త జూలియా రాబర్ట్ వాళ్ల ఇంట్లోనే ఎమ్మా ఎక్కువ పెరిగింది. జూలియా ఆస్కార్ పొందిన నటి. ఎమ్మా ఎక్కువగా జూలియాతో షూటింగ్‌లకు వెళ్లేది. ఇలా ఈమెకు నటనపై ఆసక్తి కలిగింది.

ఒకవేళ రాజమౌళి చిత్రంలో ఎమ్మా కనిపిస్తే మాత్రం.. ఇదే ఆమె కెరీర్‌లో తొలి ఇండియన్ సినిమా అవుతుంది.

- వినోద్ మామిడాల

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles