రాశి ఫలాలు


Sun,August 11, 2019 01:43 AM

11-8-2019 నుంచి 17-8-2019 వరకు

మేషం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా ఈ వారం శుభప్రదంగానే ఉంటుంది. నలుగురికి ఉపయోగకరమైన పనులు చేపడతారు. రావాల్సిన డబ్బు వస్తుంది. వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల సహాయసహకారాలు అందుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో ఇబ్బందులు ఉంటాయి. పనివారితో అనవసరమైన కలహాలు ఏర్పడతాయి. న్యాయపరమైన సమస్యలలో అనుకూలత ఉంటుంది.

వృషభం

ఆరోగ్య సమస్యలు తీరుతాయి. బంధు,మిత్రుల కలయికతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో విజయం చేకూరుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. చదువు, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరు పొందుతారు. వస్తువులు, వస్ర్తాలు, ఆభరణాలు కొనే అవకాశాలున్నాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. గిట్టని వారితో జాగ్రత్త అవసరం.

మిథునం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా రావాల్సిన డబ్బు వస్తుంది. మంచి వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యా, వినోదం కోసం సమయాన్ని వెచ్చిస్తారు. సభలలో పాల్గొంటారు. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. వస్త్ర, వస్తువులను కొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో విజయ సూచనలున్నాయి. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి.

కర్కాటకం

అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. వస్త్ర, వస్తువులు, ఆభరణాలు కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. పూర్వం నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. పెద్ద వారి సహాయ సహకారాలు అందుతాయి. దీంతో చాలా విషయాల్లో మంచి జరుగుతుంది. తీర్థయాత్రలు, నదీ స్నానాలను ఆచరిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్త.

సింహం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో పనుల్లో ఆలస్యం జరుగుతుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు కొంత అనుకూలంగా ఉంటాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. హోటలు, క్యాటరింగ్ బిజినెస్‌లు తాత్కాలికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. దగ్గరివారు, బంధువులు, స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. పనివారితో ఇబ్బందులు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవ్వొచ్చు.

కన్య

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా ఈ వారం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగంలో తోటి వారితో సమన్వయం కుదురుతుంది. ఆఫీసులో మంచి పేరు పొందుతారు. బంధువులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. నలుగురిలో కీర్తి ప్రతిష్ఠలు దక్కుతాయి. భూముల వల్ల మనస్పర్థలు వస్తాయి.

తుల

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దీంతో బాగా కలిసొస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వాతావరణం అనుకూలిస్తుంది. శుభకార్యప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. చాలా సమస్యలు తీరుతాయి. పనులు అనుకన్న దానికంటే ముందే పూర్తవుతాయి.

వృశ్చికం

గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ఆలోచనతో, ఓపికతో ముందుకు వెళ్లడం అవసరం. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు గోచరిస్తున్నాయి. అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మీయులతో కలహాలు ఏర్పడవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు ముందుకు సాగక పోవచ్చు. రెట్టింపు ప్రయత్నాలు అవసరం. పనివారితో కలహాలు ఏర్పడవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందకపోవచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా రావాల్సిన డబ్బు వస్తుంది. బంధువులను కలుస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. కొత్త వస్తువులను కొంటారు. వ్యాపారం అనుకూలిస్తుంది. వృత్తిపరమైన సమస్యలను అధిగమిస్తారు. హోటలు, క్యాటరింగు, నిత్యావసర వస్తు వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నంలో రెట్టింపు శ్రద్ధ అవసరం. విదేశీ ప్రయాణాలు ఆర్థిక సమస్య వల్ల వాయిదా పడతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. పనివారితో సమస్యలు ఏర్పడతాయి.

మకరం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువు ముందుకు సాగుతుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్నవారికి అనుకున్నన్ని లాభాలు రాకపోవచ్చు. డబ్బు చేతికి అందకపోవచ్చు. ఉద్యోగంలో తోటివారితో సమస్యల వల్ల పనులు ముందుకు సాగకపోవచ్చు. వైద్య, ఇంజినీరింగ్ వృత్తుల వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

కుంభం

ఈ వారం మిశ్రమాధిక ఫలితాలుంటాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. తల్లిదండ్రులు, పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు.

మీనం

వాహనాల వల్ల లాభాలుంటాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు కొత్త పనులు చేపడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుకు అనుకూలమైన వారం. సమాజంలో మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. అనుకున్న దాని కంటే ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

2396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles