తారల బ్రాండ్ బాజా


Sun,August 11, 2019 01:54 AM

heroes-brand
అభిమానికి తన హీరో అంటే ఒక బ్రాండ్. అభిమాని దృష్టిలో అతనే ఒక లెజెండ్. హీరో మాటే శిరోధార్యం. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు చెప్పినా వినని అభిమానులు కూడా.. సినిమాలో తన అభిమాన హీరో చెప్తే వింటారు. కొంతమందైతే సినిమాలో తమ హీరో వేసుకున్న దుస్తులే ధరిస్తుంటారు. హీరోలాగ హావభావాలు పలికిస్తారు. అతని ైస్టెలే ఫాలో అవుతారు. నడక, నడత మార్చేసి.. తనలోనే తన హీరోని చూసుకుంటారు. అందుకే అలాంటి వీరాభిమానులకు మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నారు హీరోలు. తమ అభిమానులకు ఇష్టమైన దుస్తులు, వస్తువులు, ఆహార పదార్థాలతో వ్యాపారంలోకి దిగుతున్నారు. అలా సినిమాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్న మన టాలీవుడ్ హీరోల సైడ్ బిజినెస్‌పై ఈ వారం ముఖచిత్ర కథనం.

- డప్పు రవి, సెల్: 9951243487

heroes-brand2
పల్లెటూళ్లలో నేటికీ సైకిళ్లు, టీవీఎస్‌లపై వీధి వీధి తిరుగుతూ నయనతార చీరెలు.. సమంత గాజులు.. కాజల్ జాకెట్లు.. ప్రభాస్ చొక్కాలు.. రజనీకాంత్ లుంగీలో... అంటూ హీరోలపై ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చిరు వ్యాపారులు. రంగురంగుల చీరెకు ఎక్కడో ఓ మూలన సమంత బొమ్మ పెట్టి.. మనం సినిమాలో సమంత కట్టిన చీరె ఇదేనమ్మా అంటూ మహిళలను మెప్పిస్తుంటారు. అవి కూడా అచ్చం అలాగే ఉండడంతో ధర కొంచెం ఎక్కువైనా కొనడానికి వెనుకాడరు. ఇలా గాజుల నుంచి బొట్టు బిళ్లల వరకూ అన్నీ.. హీరోయిన్ల పేరు చెప్పుకొనే అమ్ముతారు. ఇలాగే.. ఎవరైనా హీరో సినిమా హిట్ అయితే.. ఆ సినిమాలో హీరో ధరించిన చొక్కాలు, ప్యాంట్లు, నెక్‌లు.. వాటిపై హీరోల బొమ్మలు వేస్తూ అమ్మకాలు ప్రారంభిస్తారు వ్యాపారులు. వాటిని ధరించి వీధుల్లో తిరగడం అభిమానులకు ఓ క్రేజ్. ఒక రకంగా ఆ హడావుడే వేరు.
heroes-brand1
ఇక నగరాల్లో కూడా అభిమాన హీరో కాళ్లకు వేసుకునే చెప్పులు/షూ నుంచి హెయిర్ కటింగ్ వరకూ అన్నీ ఫాలో అవుతుంటారు అభిమానులు. హీరోలు తలకు వాడే ఆయిల్.. తినే తిండి.. వేసుకునే బట్టలు.. వాళ్లు నడుపుతున్న కార్లు, బైక్‌లు.. వేసుకునే చైన్లు.. చేతికి పెట్టుకునే వాచ్‌లు, ఉంగరాలు.. కళ్లకు పెట్టుకునే కళ్లజోడు.. చెవులకు కుట్టించే దిద్దులు, రింగ్‌లు.. సిగరెట్ నుంచి తాగే మందు వరకూ ఎవ్రిథింగ్.. అన్నీ ఫాలో అవుతున్నారు అభిమానులు. సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఫొటోలు పెట్టి హల్‌చల్ చేస్తున్నారు. అదీ అభిమానమంటే. అందుకే మన అభిమాన హీరోలు వ్యాపార రంగంలోకి దిగారు. తమ అభిమానుల సంతోషాన్ని, ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడానికి వ్యాపారం మెదలుపెడుతున్నారు. అభిమానులకు నచ్చిన దుస్తులు, వస్తువులు అందించి.. వారికి మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. ఇలా నటనతోపాటు బిజినెస్‌లోనూ రప్ఫాడిస్తున్న టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇంతకీ సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ చేస్తున్న ఆ నటీనటులెవరు? ఏం వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా? ఆ వివరాలన్నీ మీకోసం.
heroes-brand3

రౌడీవేర్‌తో విజయ్

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటుడుగా ఇప్పుడు తిరుగులేని స్థానంలో ఉన్నారు. విజయ్ నటించింది కొన్ని సినిమాలే అయినా.. క్రేజ్ మాత్రం వంద సినిమాల హీరో అంత సంపాదించారు. ఈ నేపథ్యంలో రౌడీ వేర్‌తో బట్టల వ్యాపారం మొదలు పెట్టారు. ఈ బ్రాండ్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. విజయ్ తన రౌడీ యాప్‌లో రౌడీ బ్రాండ్ బట్టలు సేల్‌కు పెట్టిన ప్రతిసారి హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. దీంతో కొందరు కాపీగాళ్లు.. రౌడీవేర్ పేరుతో అమెజాన్‌లో దుస్తులు అమ్మేంతగా జనంలోకి వెళ్లింది రౌడీవేర్. ఈ బ్రాండ్‌తో విజయ్ దేవరకొండకు కేవలం తెలుగు రాష్ర్టాల్లోనే కాదు అటు చెన్నయ్, బెంగళూరు సహా మరిన్ని మెట్రో నగరాల్లోనూ బాలీవుడ్‌లోనూ వీరాభిమానులు ఏర్పడ్డారు.
heroes-brand4

వ్యాపారంలో కింగ్

కింగ్ నాగార్జునది వ్యాపారంలో అంది వేసిన చేయి. హైదరాబాద్ నగరంలో లగ్జరీ సదుపాయాలతో ఎన్ గ్రిల్ అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు నాగార్జున. ఇక్కడ పలు రకాల అరుదైన వంటకాలు అందుబాటులో ఉంటాయి. కుటుంబం మొత్తం సంతోషంగా వెళ్లి.. హాయిగా అక్కడ భోజనం చేసి రావొచ్చు. ఈ విజయ పరంపరలో ఎన్-ఆసియన్ పేరుతో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారట. దీని ద్వారా తన కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటితో పాటుగా ఎన్-కన్వెన్షన్ సెంటర్ పేరుతో నగరంలో పలుచోట్ల ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో కార్పొరేట్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవి కాకుండా అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. అంతేకాకుండా దుబాయ్‌లోని కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
heroes-brand5

బీ ఈస్మార్ట్‌తో పూరీ-చార్మి

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి చార్మికౌర్ సంయుక్తంగా వస్త్రవ్యాపారంలోకి దిగారు. ఇద్దరూ కలిసి పూరీ కనెక్ట్స్ అంటూ కొత్త నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. ఆ పేరుతో వరుస సినిమాలు నిర్మిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ నిర్మాణ సమయంలోనే మాస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా దుస్తులు కుట్టించి.. వాటిని సినిమాలో రామ్‌తో ప్రమోట్ చేయించారు. ప్రస్తుతం బీ ఇస్మార్ట్‌తో వస్త్రవ్యాపారంలోకి దిగారు పూరీ-చార్మి. www.beismart.in అనే వెబ్‌సైట్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ వాడిన కలర్‌ఫుల్ షర్టులు, ప్యాంట్‌లు, నెక్‌లు, జీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి క్లాస్, మాస్‌తో సంబంధం లేకుండా చాలా ైస్టెలిష్‌గా ఉన్నాయి. ఇకనుంచి పూరీ తీయబోయే సినిమాల్లో హీరో వాడే దుస్తులు ముందుగా ప్రత్యక్షమవుతాయేమో.
heroes-brand6

STAAR అంటున్న అల్లు అర్జున్

వస్త్ర వ్యాపారంలోకి ైస్టెలిష్‌స్టార్ అల్లు అర్జున్ కూడా వస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. మహేష్‌బాబు హంబుల్ ఇలా ప్రకటించిన కాస్సేపటికే.. స్టార్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ పోస్టర్‌ను చలామణీలోకి తెచ్చారు. ఆగస్టులో తమ హీరో క్లాతింగ్ బ్రాండ్ రెడీ అవుతున్నదంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాస్తవానికి అల్లు అర్జున్ స్టయిల్ క్లాతింగ్ మార్కెట్‌లోకి వస్తుందని ఎప్పటి నుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. ఆ స్టార్ బ్రాండ్ అన్నది నిజమా, అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఆగస్టు నుంచి బన్నీ బ్రాండ్ దుస్తులు వస్తాయని టాక్ మాత్రం బలంగా వినిపిస్తున్నది. అల్లు అర్జున్ ఇప్పటికే బిజినెస్ వైపు అడుగులు వేసారు. 800 జూబ్లీ పేరుతో ఓ జపనీస్ రెస్టారెంట్‌నూ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అమెరికన్, మెక్సికన్, కాంటినెంటల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, జపాన్ వంటకాలు చాలా ఫేమస్. ఇందులో హైలైఫ్ పేరుతో ఓ పబ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. వీకెండ్స్‌లో హైలైఫ్ దాదాపుగా హౌజ్‌ఫుల్ అవుతుంది. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ పబ్ అని చెబుతుంటారు. అంతేకాకుండా బీ-డబ్స్ అనే రెస్టారెంట్ ప్రాంచైజీ కూడా తీసుకున్నారు బన్నీ. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బీ-డబ్స్ రెస్టారెంట్లు ఉన్నాయి.
heroes-brand7

హంబుల్‌గా మహేశ్ బాబు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చూపిస్తున్నారు. దానికితోడు తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు మల్టీప్లెక్స్ బిజినెస్ కోసం ఉపయోగించుకున్నారు. ఏఎంబీ (ఆసియన్ మహేశ్ బాబు) సినిమాస్ పేరుతో హాలీవుడ్ రేంజ్‌లో ఓ మల్టీఫెక్స్‌ను గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్స్ సమీపంలో మనకు పరిచయం చేశారు మహేశ్. అయితే ఈ సూపర్‌స్టార్ ఇప్పుడు థియేటర్ బిజినెస్ కాకుండా వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇటీవల తన పుట్టినరోజును పురస్కరించుకొని వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు మహేశ్. ది హంబుల్ కో డాట్ పేరుతో బ్రాండెడ్ దుస్తులు అమ్ముతున్నాడు. ఇందులో అన్ని రకాల వయసుల వారికి దుస్తులు అందుబాటులో ఉన్నాయి. మహేశ్‌తోపాటు ఈ బాధ్యతలన్నీ ఆయన భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
heroes-brand8

మెగా ఫ్యామిలీ నుంచి..

మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య సచిన్‌తో కలిసి ఫుట్‌బాల్ టీం కొన్నాడు. కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రై.లిమిటెడ్‌కు చిరంజీవి కూడా కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో సచిన్ టెండూల్కర్, హీరో నాగార్జున, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ కో-స్పాన్సర్స్. టాలీవుడ్‌లో అన్నయ్యతోపాటు మరింత క్రేజ్ సంపాదించుకున్న హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. గతంలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ప్రొడక్షన్‌ను ప్రారంభించారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌కూడా వ్యాపారంలో కొత్త పంథాను ఎంచుకున్నారు. ట్రూజెట్ పేరుతో ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్నారు. వీటితోపాటుగా తనకు ఇష్టమైన గుర్రపు పందేల్లో కూడా అడుగుపెట్టారు రామ్‌చరణ్. హైదరాబాద్ పోలో పేరుతో హార్స్ రైడింగ్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే కొణిదల ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నారు చెర్రీ. ఇలా నిర్మాతగా, నటుడిగా సత్తా చూపిస్తున్నారు. తన స్నేహితుడు హీరో ప్రభాస్‌తో కలిసి మల్టీఫ్లెక్స్ వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు చెర్రీ. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.
heroes-brand9

క్వాన్...రానా

హీరో రానా కూడా క్వాన్(KWAN) పేరుతో టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. క్వాన్ భారతదేశంలోనే అతిపెద్ద టాలెంట్ ఏజెన్సీ. ఇది సినిమాలు, టీవీ, సంగీతం, క్రీడలు, వ్యాపారాలకు సంబంధించి ఎంతోమందికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. చాలా తక్కువ సమయంలో ఎంతోమంది ఖాతాదారులను సొంతం చేసుకున్నది ఈ సంస్థ. అటు సంస్థలకు, ఖాతాదారులకు మధ్యలో ఉండే ఉపాధి సంస్థగా పేరు సంపాదించింది. ఈ సంస్థ గతంలో సురేశ్ ప్రొడక్షన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు హైదరాబాద్‌కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలన్నీ రానా చూసుకుంటారు. ఇవే కాకుండా.. సురేశ్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కొన్ని టెక్నికల్ వర్క్స్‌లో రానా హస్తం ఉంటుంది.
heroes-brand10

ఫుడ్ బిజినెస్‌లో సందీప్ కిషన్

ఈ యువ హీరో సినిమాలతో పాటు హోటల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఈయనకు సిటీలోని జూబ్లీ హిల్స్ రోడ్ నం.10లో వివాహ భోజనంబు అనే హోటల్ ఉంది. ఈ రెస్టారెంట్‌లో అచ్చమైన తెలుగింటి వంటకాలు, భారీ రేంజ్‌లో ఉంటాయి. ఇంత రేంజ్‌లో తెలుగు వంటకాలను పరిచయం చేయడం హైదరాబాద్ హోటళ్లలో ఇదే ప్రథమం. ఈ వ్యాపారంతో బాగానే సంపాదిస్తున్నారు సందీప్. నేను ఈ రెస్టారెంట్‌ని మొదలు పెట్టింది నాకు ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే ఉదేశ్యంతో. నా పేరెంట్స్‌ని, సోదరిని మంచిగా చూసుకోవాలనే ప్లాన్‌తోనే దానిని మొదలు పెట్టాను. నేను ఎప్పటికప్పుడు నా కుటుంబాన్ని ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సందీప్.
heroes-brand11

మంచు ఫ్యామిలీ నుంచి..

విద్య, ఉపాధి అవకాశాలు, హోటల్ రంగాలలో మంచు ఫ్యామిలీ మొత్తం దూసుకెళ్తున్నది. మోహన్‌బాబు వేసిన బాటలో ఆయన కుమారులు, కూతురు పయనిస్తున్నారు. మంచు విష్ణు న్యూయార్క్ అకాడెమీ పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రత్యేకంగా అమెరికన్ స్టాండర్డ్స్‌తో కూడిన విద్యను బోధిస్తున్నారు. ఈ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను విష్ణు భార్య వెరోనికా చూసుకుంటున్నారు. ఈ స్కూళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మంచు విష్ణు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ర్టాల్లో శ్రీ విద్యానికేతన్ పేరుతో తండ్రితో కలిసి స్కూళ్ల నిర్వహణ చూసుకుంటున్నారు విష్ణు, మనోజ్. ఈ విద్యాసంస్థల ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు. మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి కూడా రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకెళ్తున్నారు. తమిళనాడులో ఫేమస్ అయిన జూనియర్ కుప్పన్న రెస్టారెంట్ ప్రాంఛైజీ తీసుకొని ఆ రుచులను మన హైదరాబాద్‌కు పరిచయం చేశారు మంచు లక్ష్మి. నగరంలో జూనియర్ కుప్పన్న పేరుతో పలుచోట్ల ఉన్న రెస్టారెంట్ల బాధ్యతలను మంచు లక్ష్మి చూసుకుంటున్నారట.
heroes-brand12

సినీ అవకాశాలిస్తున్న జగ్గుభాయ్

జగపతి బాబు కూడా ఓ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ప్రారంభించారు. దాని పేరు క్లిక్ సినీ క్రాఫ్ట్. దీనిద్వారా ప్రతిభ ఉన్న ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్‌లో అన్ని విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఈ సంస్థ ద్వారా ఉపాధి చూపిస్తున్నారు జగపతిబాబు. టాలీవుడ్‌తో బాలీవుడ్, షార్ట్‌ఫిల్మ్స్ అవకాశాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అవకాశం కావాలనుకునే వారు ముందుగా ఈ క్లిక్ సినీ క్రాఫ్ట్‌లో రిజిస్టర్ అవ్వాలి. ప్రతిభ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేసినట్లు జగపతిబాబు చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం.. మీకూ ప్రతిభ ఉంటే.. క్లిక్ సినీ క్రాఫ్ట్‌ని క్లిక్ చేయండి.
heroes-brand13
heroes-brand14

శర్వానంద్.. కేఫ్‌తో కూల్‌గా!

టాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. ఇతను సినిమాలతోపాటు కేఫ్-రెస్టో బిజినెస్ విజయవంతంగా నడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీన్జ్ కేఫ్‌ను నడిపిస్తున్నారు శర్వా. బీన్జ్‌లోకి అడుగుపెట్టగానే అచ్చ తెలుగు పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన ఈ కేఫ్ చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ అరటికాయ బజ్జీలు, పునుగులు, మసాల మిర్చి బజ్జీలు చాలా ఫేమస్. ఇక్కడ జపాన్, అరేబియా వంటకాలు కూడా చాలా ఫేమస్. పలు రకాల సీ ఫుడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అతనికి జూబ్లీహిల్స్‌లో లైవ్ స్పోర్ట్స్ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉన్నదని సమాచారం.
heroes-brand15
దివంగత నటుడు ఎన్టీఆర్ కుటుంబం నుంచి జూ.ఎన్టీఆర్ యాడ్స్, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అతని అన్న నందమూరి కల్యాణరామ్.. వారి తాతయ్య పేరుమీద ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నారు.
heroes-brand16
నితిన్ అతని బిజినెస్ పార్టనర్ కోన నీరజ ఇటీవల టీ-గ్రిల్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారట. ఇదే కాకుండా తన కుటుంబసభ్యులతో కలిసి నిర్మాతగానూ మారారు నితిన్. నితిన్‌కు సంబంధించిన వ్యాపార బాధ్యతలన్నీ వాళ్ల అక్కయ్య నిఖితా రెడ్డి చూసుకుంటారు.
heroes-brand17
ఒకవైపు తండ్రి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనులు చూస్తూనే రెస్టారెంట్ వ్యాపారంలో బిజీగా ఉన్నారు ఎస్‌ఎస్ కార్తికేయ. హైటెక్ సిటీలోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న సర్క్యూట్ డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్ ఎస్‌ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయదే అంటారు.
heroes-brand18
హీరో నవదీప్ కూడా బీపీఎం(బీట్స్ పర్ మినిట్) పేరుతో ఓ పబ్‌ను నిర్వహిస్తున్నారు. ఇది గచ్చిబౌలిలో ఉన్నది. ఇక్కడ పలు రకాల విదేశీ పానీయాలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటుగా రా ప్రొడక్షన్ హౌస్ పేరుతో నిర్మాతగా మారారు నవదీప్.
heroes-brand19
సై సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శశాంక్. ఇతను కూడా రెస్టారెంట్ బిజినెస్‌లో రాణిస్తున్నారు. మొఘలాయి వంటకాలతో మాయా బజార్ అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు శశాంక్. సకుటుంబ సపరివారంగా వచ్చే ఆహారప్రియులను ఇక్కడ చూడొచ్చు.
heroes-brand20
సైరా నర్సింహారెడ్డిని డైరెక్ట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కూడా రెస్టారెంట్ బిజినెస్ చూసుకుంటున్నారు. ఉలవచారు రెస్టారెంట్ ప్రాంఛైజీని తీసుకొని హైదరాబాద్‌లో కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు.
heroes-brand21
ఖాళీ సమయం దొరికితే చాలు జిమ్‌లో వాలిపోయే అతికొద్దిమంది కథానాయికల్లో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. రకుల్ ఎఫ్-45 బ్రాండ్‌తో జిమ్ చెయిన్‌ను ప్రారంభించి బిజినెస్ ఉమన్‌గానూ దూసుకుపోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో ఎఫ్-45 ప్రాంఛైజీలు తీసుకుని తన తమ్ముడి సహాయంతో విజయవంతంగా నడిపిస్తున్నది రకుల్.
heroes-brand22
అత్తారింటికి దారేది ఫేం ప్రణీత శుభాష్ రెస్టో-పబ్ బిజినెస్‌లో రాణిస్తున్నది. సినిమాలతో పాటుగా మోడలింగ్ కూడా చేస్తున్నది. బెంగళూరులోని లావెల్లె రోడ్‌లో బూత్లాగర్స్ పేరుతో రెస్టారెంట్ కమ్ పబ్‌ను స్నేహితులతో కలిసి నిర్వహిస్తున్నది. అక్కడ బూత్లాగర్స్ చాలా ఫేమస్.
heroes-brand23
మిల్కీబ్యూటీ తమన్నా గతంలో వైట్ అండ్ గోల్డ్ పేరుతో ఆన్‌లైన్‌లో బంగారు ఆభరణాలు అమ్మింది. ఇప్పుడు తన పేరుతో ఖరీదైన వజ్రాల వ్యాపారం చేస్తున్నది. మొదటిసారి తమన్నా తన పేరుపై బ్రాండ్‌ను విడుదల చేసింది.

1308
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles