రాశి ఫలాలు


Sun,August 25, 2019 12:40 AM

25-8-2019 నుంచి 31-8-2019 వరకు

మేషం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా పనులు కలిసొస్తాయి. తల్లి వైపు వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పనివారితో ఆనుకూలత ఉంటుం ది. సుఖ సంతోషాలతో ఉంటారు. లాభాలను గడిస్తారు. వ్యాపారస్తులకు తాత్కాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. పిల్లల శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆఫీసులో తోటివారితో మనస్పర్థలు ఏర్పడొచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో అందక పోవచ్చు. దీంతో కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు.

వృషభం

గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంతో పను లు చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాపిల్లలతో సౌ ఖ్యంగా గడుపుతారు. విద్వాంసులు, కళాపోషకులు, సాహిత్యవేత్తలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక, ఇతిహాస గ్రంథాలు పఠిస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు ఉంటాయి. పనివారితో వైషమ్యాలు గోచరిస్తున్నాయి. నిత్యం వ్యాపారస్తులకు పనివారితో ఇబ్బందులు ఏర్పడతాయి.

మిథునం

ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. రావాల్సిన డ బ్బు వస్తుంది. భార్యాపిల్లలతో సౌఖ్యం గా ఉంటారు. కార్యాల్లో విజయ సూచనలున్నాయి. కొత్త వస్త్ర, వస్తువులు కొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆఫీసులో అందరితో సమన్వయం కుదురుతుంది. మంచి పేరు సంపాదిసారు. వ్యాపారస్తులకు క్రయవిక్రయాల్లో లాభాలుంటాయి. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం

పిల్లల చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో మంచి శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. రావాల్సిన డబ్బు వస్తుంది. పనివారితో అనుకూలత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమస్యలు చాలామటుకు పరిష్కారం అవుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులను కొంటారు. నలుగురిలో కీర్తి, ప్రతిష్ఠలు ఉంటాయి. మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. శుభకార్యాలు, వివాహ, నూతన గృహప్రవేశాలు చేస్తారు.

సింహం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా వున్నాయి. అయినా ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవ చ్చు. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉం టారు. కొత్త వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి. అశ్రద్ధ, అలసట లేకుండా పనులు చేస్తారు. తల్లివైపు వారితో మనస్పర్థలు గోచరిస్తున్నాయి. చదువు, శుభకార్యాల విషయంలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగంలో తోటి వారితో గొడవలు ఏర్పడొచ్చు. జాగ్రత్త.

కన్య

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా యి. అయినా తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. బంధువులు, మిత్రులు కలుస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి ఆదాయం పెరుగుతుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. నిత్యావసర వస్తు వ్యాపారం, సుగంధ, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లోని వారు సంతృప్తిగా గడుపుతారు. అన్నదమ్ములతో, పాలివారితో వైషమ్యాలు ఉంటాయి.

తుల

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువు, ఉద్యోగం విషయంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభ సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగ్గుతారు. అన్నదమ్ము లు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణ రంగంలోని వారు సకాలంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటా యి. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు.

వృశ్చికం

ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూలత ఉంటుంది. తోటి ఉద్యోగులు, అధికారుల సహాయం అందుతుంది. వ్యాపారంలో పనివారితో సమస్యలు ఎదురవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవచ్చు. ప్రారంభించిన పనులు ముందుకు సాగకపోవచ్చు. అయినా సాహసంతో పనులు చేస్తారు. వృథా ప్రయాణాలు చేస్తారు. రాబడికి మించిన ఖర్చులుంటాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అన్నదమ్ములు, బంధువులతో అనవసరమైన గొడవలు ఏర్పడే సూచనలున్నాయి.

ధనుస్సు

వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారు సంతృప్తిగా ఉంటారు. కొత్త అవకాశాలు పొందుతారు. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్థలు ఉంటాయి. పై అధికారుల విమర్శలకు గురవుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. పనివారితో ఇబ్బందులుంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు.

మకరం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో, ఆలోచనతో పనులు చేస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. శుభకార్య, విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో, బంధువులతో పనులు నెరవేరుతాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఆధ్యాత్మికత, గురుభక్తి పెంపొందుతుంది. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. భూముల వ్యవహారంలో చిక్కుముడులుంటాయి. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి.

కుంభం

వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిత్యావసర, వడ్డీ, షేర్‌ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. న్యాయవాద వృత్తిలోని వారు సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంజినీరింగు వృత్తిలో ఉన్నవారు పెట్టిన పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. నదీస్నానాలను ఆచరిస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. భూముల విషయంలో తగాదాలొచ్చే అవకాశం ఉంది.

మీనం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యకు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం అన్నివిధాలా కలిసొస్తుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ప్ర భుత్వ, కార్పోరేటు ఉద్యోగంలో ఉన్నవారు ఆఫీసులలో గుర్తింపు పొందుతారు. ఆదా యం కూడా పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం, స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రోజువారీ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులుంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. పెద్దలతో మనస్పర్థలు ఏర్పడతాయి.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

1158
Tags

More News

VIRAL NEWS