వాస్తు


Sun,August 25, 2019 12:47 AM

vasthu

వాస్తులో ఇంటి ఎలివేషన్‌కూ, ఇంటి కట్టకానికీ తేడా ఉంటుందా?

- జీవన్‌రెడ్డి, చింతల్‌
సమాధానం: మనిషి ఆకారానికీ అతడు ధరించే వస్ర్తానికీ అలంకరణకు ఉన్న అనుబంధం, ఇంటికీ దాని ‘ఎలివేషన్‌'కీ ఉంటుంది. అయితే రెంటింటి విషయంలో శాస్త్ర భాగస్వామ్యం తప్పక ఉంటుంది. తేడా అనేది కాదు. వాస్తు సూచనలు ఉంటాయి. ఎలివేషన్స్‌తో కొన్ని మూలాలు మూసివేస్తూ ఉంటారు. తద్వారా ఇంటిలోని వెంటిలేషన్‌ దెబ్బతింటుంది. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసి ఆ మెట్లకు ‘పరదా గోడ’ కట్టి దానికి అద్దాలు బిగిస్తారు. అప్పుడు ఇండ్లలోని కిచెన్‌లో చీకటిగా ఉంటుంది. ప్రధానమైన వంటగది చీకటితో నిండి గృహంలో ‘అనారోగ్యాలు’ చేరుతాయి. ముఖ్యంగా బాల్కనీలు మూసి చేసే ఈ ఎలివేషన్స్‌ విషయంలో వాస్తు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఇంటిని రక్షించే బాధ్యతను శాస్త్రం తీసుకుంటుంది.

కింద మా ఇల్లు ఉంది. పైన రెండు పోర్షన్లు ఉన్నాయి. ఒక దానిలోకి రెండు మెట్లు వేసుకొని వాడొచ్చా?

- వి. అమిత్‌ కుమార్‌, కంది, సంగారెడ్డి
ఫ్లోర్‌లో ఇల్లు కట్టి మెట్లు సెపరేటుగా వేసుకున్నప్పుడు ఇంటి నిర్మాణం ఒకలా ఉంటుంది. ఇంటి లోపలి నుంచి మెట్లు పెట్టి ఒకటి రెండు ఫ్లోర్‌లు వాడుకుంటే వాటి నిర్మాణ విధానం మరోలా ఉంటుంది. మీరు బహుశా అవసరం కోసం ఆలోచిస్తున్నట్లున్నారు. పైన రెండు పోర్షన్లు వేశారు. కింద పోర్షను మొత్తం మీరు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. పైన ఉన్న పోర్షన్‌ మరొకటి మీకు కావాలి అంటే అది ఎటువైపు వస్తుందో వివరంగా మీరు అడగలేదు. కిందపైన వాడాలి అంటే మీరు మేడమీద ఉన్న రెండు పోర్షన్లు తీసుకొని వాడండి. లేదా మీరు ఉంటున్న ఇంటిని కూడా పైన ఉన్నట్లు సింగిల్‌ పోర్షన్‌ చేసి కింద మీద లోపలి నుంచి వాడుకోండి. కానీ కింద మొత్తం పైన సగం వాడకండి. లేదంటే లోపలి నుంచి కాక బయట ఎలా ఏది వాడినా తప్పు ఉండదు.

ఉత్తరం కంటే దక్షిణం పునాది ఎక్కువ లోతు తవ్వాలా?

- అనిరుద్‌, జీడిమెట్ల
ఇంటి పునాదుల లోతులు ఇంటి పటిష్ఠ నిర్మాణానికి ప్రధాన బాధ్యత నిర్వహిస్తూ ఉంటాయి. పునాది (బేస్‌మెంట్‌) అనేది ఒక్కోచోట ఒక్కో లోతుకు వెళ్లాల్సి వస్తుంది. కారణం, ఆయా చోట్ల ఆయా రీతుల మట్టె పొదలు వస్తుంటాయి. ‘గట్టిమొదం’ వచ్చేవరకు తవ్వాలి అనేది సాధారణ సూత్రం. ఏ కట్టడానికైనా ఇందులో శాస్త్రం ప్రత్యేకంగా ఒక దిశలో ఎక్కువ లోతు, ఒక దిశలో తక్కువ లోతు అనే చర్చ చేయలేదు. కానీ గుడి పునాదులు, గృహ పునాదులు, ఆయా మఠాలు, మందిరాలు, వాటి నిర్మాణ లోతులకు బట్టి నిర్ణయించబడతాయి. ఎక్కువ, తక్కువలు ఒకే దిశల్లో కూడా ఉండవచ్చు. నేలను బట్టే మారతాయి. అంతే కానీ దిశను బట్టి కాదు. అయితే, సరైన లోతు పునాది అన్నింటికీ అవసరమే.

గుడికి దగ్గరలో ఇల్లు కట్టొద్దు, ఉండొద్దు అంటారు. మరి పూజారుల ఇండ్లు ఉండొచ్చా?

- ఇటుకల వాసుదేవ రెడ్డి, నర్సాపూర్‌
ఇల్లు - గుడి చాలా విభిన్న జీవన రీతులను తెలుపుతుంది. ఇంట్లో పుట్టుక, మరణం ఉంటాయి. గుడి వాటికి అతీతం. ఇంట్లో అంటు, ముట్టు ఉంటాయి. గుడిలో ఆనందం ఉంటుంది. అందుకే ఇల్లు గుడికి దూరంగా ఉండాలన్నారు. ఇల్లు ఎవరిదైనా ఇల్లే. అది పూజారులదైనా, సాధారణ జనులదైనా.. అన్ని ఇండ్లు గుడికి దూరమే ఉండాలి. అంటే గుడి ‘మాడ వీధులకు’ అవతల గుడి ప్రాకారం లోపల ఏ నివాసం మంచిది కాదు. కేవలం శారీరక అవసరాల కోసమే కాదు, మనిషి సంసార సంబంధ ఆలోచనల ‘సుఖదుఃఖాలకు’ నిలయమైన ఇల్లు ఆలయానికి దూరంగా ఉండాలన్నదే పెద్దల నిర్ణయం. కొన్ని ఆలయాల్లో అలా కడుతున్నారు అనేది శాస్త్ర బద్ధమైన విషయంగా పరిగణించవద్దు. మనిషి ఏ హద్దునైనా దాటగలడు కానీ శాస్త్రం దాటడు కదా.
vasthu1
సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

369
Tags

More News

VIRAL NEWS