నెట్టిల్లు


Sun,August 25, 2019 01:02 AM

ప్రేమ ఎలాంటిది? గుడ్డిదా? చెవిటిదా? ఇద్దరి మనుషుల మధ్య ఎలాంటి ప్రేమ శాశ్వతంగా ఉంటుంది? ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ రిలేషన్‌షిప్‌లోనైనా ఇది చాలా అవసరం. ఇలాంటి బంధాల స్టోరీలైన్‌తోనే యూట్యూబ్‌లో షార్ట్‌ఫిలిమ్స్‌ వచ్చాయి.చందు

దర్శకత్వం: మణికంఠ రెడ్డి
నటీనటులు : గణేశ్‌ భీమారెడ్డి, రాజశ్రీ, సుజాత

ఎప్పుడూ చదువే కాదు.. ఆటలూ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. కేవలం చదువులో మార్కులను దృష్టిలో ఉంచుకొని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించరు. ‘చందు’ లఘు చిత్రంలో కూడా దాన్నే చూపించారు. సుబ్బారాయుడు కొడుకు చందుకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. కానీ తండ్రి మాత్రం చదువు చదువు అంటూ చందును చివాట్లు పెడుతుంటాడు. ఎప్పుడూ కబడ్డీ ఆడనివ్వడు. చందు మాత్రం ఊర్లో ఒక కబడ్డీ టీమ్‌ను తయారు చేసి జిల్లా స్థాయి పోటీల వరకూ వెళ్తాడు. మరో వైపు చందుకు వచ్చిన మార్కులను బట్టీ ఏ కాలేజీలో సీటు ఇవ్వలేదని తండ్రి కోపగించుకుంటాడు. ఈ క్రమంలోనే చందు తన టీమ్‌తో జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధిస్తాడు. ఈ విజయాన్ని కూడా తండ్రి సహించడు. సీటు రానందుకు చేయిచేసుకుంటాడు. కానీ అప్పుడే ఓ కార్పొరేట్‌ కాలేజీ వాళ్లు స్పందించి స్పోర్ట్స్‌ కోటాలో చందుకు ఉచిత సీటు ఇస్తారు. ఇన్నాళ్లూ చందూ ప్రతిభను అర్థం చేసుకోకుండా ఉన్నందుకు అతనికి చదువులో తక్కువ మార్కులు వచ్చాయి. మీరు అతన్ని ఆటల్లో ప్రోత్సహించి ఉంటే బాగుండేదని వాళ్లు చెపుతారు. అప్పుడు తండ్రి ఆటల విలువను, చందు ప్రతిభను అర్థం చేసుకుంటాడు.

Total views 33,447+ (ఆగస్టు 17 నాటికి)
Published on Aug 12, 2019లవ్‌ ఆజ్‌ కల్‌

దర్శకత్వం: రాజేశ్‌ పుల్లుర్‌
నటీనటులు : మహి రాజ్‌పుత్‌ , రోహిత్‌

శృతి, రిషి ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. మళ్లీ కలుస్తుంటారు. ఒక రకంగా టార్చర్‌ అనుకుంటారు. ఎందుకు ఈ రిలేషన్‌షిప్‌ అని ఫీలవుతారు. కానీ ఇద్దరూ చెప్పుకోరు. సడన్‌గా ఓ రోజు రిషీకి యాక్సిడెంట్‌ అయిందని శృతికి కాల్‌ వస్తుంది. వెంటనే రిషీ దగ్గరకు వెళ్తుంది. స్పీడ్‌గా బైక్‌ రైడ్‌ చేయడం, హెల్మెట్‌ లేకపోవడంతో ఎక్కువ దెబ్బలు తగులుతాయి. తలకు బలంగా దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్‌లో బ్లడ్‌ క్లాట్‌ అయి రెండు సంవత్సరాల్లో జరిగిన ఘటనలు అన్నీ మర్చిపోతాడు. వీటిలో వీళ్ల ప్రేమ కూడా ఉంటుంది. ఇది తెలుసుకున్న శృతి బాధపడుతూ వెళ్లిపోతుంది. కానీ ఇక్కడే సీన్‌ మారుతుంది. ఈ యాక్సిడెంట్‌ అంతా నటన అనడం, కావాలనే ప్లాన్‌ చేసినట్టు రిషి తన ఫ్రెండ్‌తో అంటాడు. శృతి కూడా రిషి గతం మర్చిపోయినందుకు ఇంటికి వెళ్లి సంతోషపడుతుంది. ఇద్దరూ ఇద్దర్ని మర్చిపోవడానికి ఇదొక చాన్స్‌ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ ఇలా ఉండదు కదా!

Total views 8,105+ (ఆగస్టు 17 నాటికి)
Published on Aug 16, 2019అంతం

దర్శకత్వం: కోటి క్రిష్ణ

వరుణ్‌ ఒక జులాయి. అమ్మాయిలను ట్రాప్‌ చేసి ప్రేమ పేరుతో వంచిస్తాడు. ఇతనికి ఒక ఫ్రెండ్‌ ఉంటాడు. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఉద్యోగం చేస్తూ, లైఫ్‌ ప్లానింగ్‌ గురించి ఆలోచిస్తుంటాడు. కానీ వరణ్‌ మాత్రం అమ్మాయిలంటూ తిరుగుతాడు. వరుణ్‌ చేతిలో మోసపోయినట్టు తెలుసుకున్న ఓ అమ్మాయి నేరుగా వరుణ్‌ కలవాలని అడుగుతుంది. దీనికి వరుణ్‌ తన ఫ్రెండ్‌ రూమ్‌లో కలవొచ్చు అంటాడు. అక్కడే వరుణ్‌ అడ్డంగా బుక్‌ అవుతాడు. వరుణ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇంకో అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. దీన్ని పట్టుకొని వరుణ్‌ను నిలదీస్తుంది. వరుణ్‌ కోపంతో ఈ అమ్మాయిపై చేయిచేసుకుంటాడు.వెంటనే అమ్మాయి వరుణ్‌ను తోసేస్తుంది. బలమైన దెబ్బ తగిలి చనిపోయినట్టు నటిస్తాడు. వెంటనే వరుణ్‌ వాళ్ల ఫ్రెండ్‌కు కాల్‌ చేసి రప్పిస్తుంది. ఇదంతా ఆ గది ఓనర్‌కు తెలుస్తుంది. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఈ అమ్మాయికి, వరుణ్‌ వాళ్ల ఫ్రెండ్‌కు పెండ్లి చేయిస్తాడు. తిరిగి వచ్చేసరికి వరుణ్‌ తన కన్నింగ్‌ ఐడియా అంతా చెపుతాడు. తర్వాత ఏం జరుగుతుందో యూట్యూబ్‌లో చూడండి.

Total views 30,428+ (ఆగస్టు 17 నాటికి)
Published on Aug 12, 2019చెలియ చెలియ

దర్శకత్వం: వైఎన్‌ లోహిత్‌
నటీనటులు : రాజీవ్‌ వర్మ, స్వప్న ప్రకాశ్‌

జీవితంలో విలువైన వాటిని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. ఇదే స్టోరీలైన్‌తో తీసిన లఘుచిత్రం ‘చెలియ చెలియ’. శరణ్య, వరుణ్‌.. ఇద్దరు ప్రేమించుకొని దూరమౌతారు. వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడతారు. అప్పటికే ప్రేమ మిగిల్చిన బాధను తట్టుకొని తేరుకుంటాడు వరుణ్‌. ఫోన్‌ నంబర్‌, సోషల్‌ మీడియా అన్నీ మార్చేస్తాడు. మరోవైపు శరణ్యకు పెండ్లి సంబంధాలు చూస్తారు. కానీ శరణ్య మళ్లీ వరుణ్‌ జీవితంలోకి రావాలనుకుంటుంది. మళ్లీ మెసేజ్‌లతో మొదలు పెట్టి కలిసేంతవరకూ వెళ్తుంది. ఒకసారి దూరమైన అమ్మాయిని మళ్లీ కలవడం అంటే కష్టమనుకుంటాడు వరుణ్‌. అయినా కలుస్తాడు. అప్పుడు శరణ్య తన అభిప్రాయం చెపుతుంది. కలిసి ఉందాం అంటుంది. వరుణ్‌ దాన్ని ఒప్పుకోడు. కానీ వరుణ్‌ చివరిసారిగా శరణ్యను ఓ ప్రదేశానికి తీసుకెళ్లి ఆశ్చర్యానికి గురిచేస్తాడు. అదేంటో యూట్యూబ్‌లో చూడండి.

Total views 2,099+ (ఆగస్టు 17 నాటికి)
Published on Aug 16, 2019

- వినోద్‌ మామిడాల, సెల్‌: 7660066469

196
Tags

More News

VIRAL NEWS