ఎకో ఫ్రెండ్లీ ఈ-బైక్స్‌


Sun,August 25, 2019 01:32 AM

bike
రోడ్డుమీద వెళ్తుంటే వాహనాల మోత. పొగబారే ప్రయాణం, కాలుష్యంతో ఇబ్బంది.అంతిమంగా పర్యావరణానికి, ఆరోగ్యానికి ప్రమాదం. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రయాణానికి చక్కని మార్గంగా తయారవుతున్నాయి ఎలక్ట్రిక్‌ బైక్‌లు. ట్రెండ్‌కు తగ్గట్టు లేటెస్ట్‌ టెక్నాలజీ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి..
bike1

బైక్‌ ఎప్లూటో

కంపెనీ : ప్యూర్‌ ఎనర్జీ
ఎప్లూటో ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారు చేసిన ప్యూర్‌ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల, సైకిళ్ల ఉత్పత్తిలో తనదైన శైలి చూపుతున్నది. ైస్టెలిష్‌ డిజైనింగ్‌తో చెప్పుకోదగ్గ ఫీచర్లతో వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఎప్లూటో, ఎంట్రాన్స్‌ పేరుతో స్కూటర్లను విడుదల చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. పోర్టబుల్‌ బ్యాటరీతో బైక్‌ను తీసుకొచ్చింది. 16 ఏఎంపీ సాకెట్‌లో ఈ బ్యాటరీని చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. బైక్‌ నుంచి బ్యాటరీని తీసి ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఎక్కడైనా చార్జింగ్‌ పెట్టుకోవడానికి వీలుంటుంది. ఒక ఫుల్‌ చార్జ్‌లో వంద కిలోమీటర్లు వస్తుంది. ఏడు సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 60 కిలోమీటర్లు దీని హైస్పీడ్‌. ధర: 75వేలు
www.pureev.in
bike2

బైక్‌ ఏథర్‌ 450

కంపెనీ : ఏథర్‌ ఎనర్జీ
కాలుష్య నివారణ, ఇంధన, నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి ఏథర్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నది. 2013లో తరుణ్‌ మెహథా, స్వాప్నిల్‌ దీన్ని స్థాపించారు. ఈ కంపెనీ ప్రధానంగా ఉత్పత్తి చేసిన వాటిలో రెండు ఎలక్ట్రిక్‌ బైక్లు ప్రధానమైనవి. ఏథర్‌ 340, ఏథర్‌ 450 అవి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2.4 కిలోవాట్ల లిథియమ్‌ బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల చార్జింగ్‌లో 55 నుంచి 75 కిలో మీటర్లు ప్రయాణించొచ్చు. టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. ప్రయాణానికి సంబంధించిన వివరాలు చూపిస్తుంది. దీని ధర రూ.1.23లక్షలు
www.atherenergy.com
bike3

బైక్‌ ఆర్‌వీ మోటర్స్‌

కంపెనీ : రివోల్డ్‌ మోటర్స్‌
మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ రాహుల్‌ శర్మా రివోల్ట్‌ మోటర్స్‌ను స్థాపించారు. ఈ కంపెనీ కిందటి నెలలోనే ఆర్‌వీ 400 అనే ఎలక్ట్రిక్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇండియాలోనే ఇది మొదటి ఆర్టిఫిషియల్‌ ఎలక్ట్రిక్‌ మైటార్‌ బైక్‌. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 156 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయొచ్చు. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్‌ మోడళ్లలో ఇది లభిస్తున్నది. స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసి ఏఐ టెక్నాలజీని వాడుకోవడానికి వీలు కల్పించారు. మొబైల్‌ కనెక్ట్‌విటీ, వేహికిల్‌ ట్రాకింగ్‌, దగ్గరలో ఉన్న చార్జింగ్‌ స్టేషన్ల వివరాలు వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. ధర : రూ. లక్ష
www.revoltmotors.com
bike4

బైక్‌ టీ6ఎక్స్‌

కంపెనీ : టోర్క్‌ మోటర్‌ సైకిల్స్‌
టోర్క్‌ మోటార్‌ సైకిల్స్‌ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్‌ బైక్‌ టీ6ఎక్స్‌. అడ్వాన్స్‌ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. జీపీఎస్‌, క్లౌడ్‌ కనెక్టివిటీ, నేవిగేషన్‌ ఫీచర్లు ఉంటాయి. ఒకసారి చార్జ్‌ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. గంటకు వంద కిలోమీటర్ల వేగమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2014లో దీని టెస్ట్‌ రైడ్‌ విజయవంతం అయింది. 8.7 సెకన్ల కాలంలోనే వంద కిలోమీటర్ల పికప్‌ను అందుకొన్న రికార్డ్‌ దీని సొంతం. దీని ధర : రూ. 1.25 లక్షలు
www.torkmotors.com

197
Tags

More News

VIRAL NEWS