ఇవో రకం మెడల్స్‌!


Sun,August 25, 2019 01:57 AM

Medals
2020 ఏడాదికి గాను ఒలింపిక్‌, పారా ఒలింపిక్‌ క్రీడలకు ఆతిథ్య దేశంగా జపాన్‌ ఉంటుంది. 2019 జూలై 24న జరిగిన ఒలింపిక్‌ క్రీడలకు ఘనంగా మెడల్స్‌తో సత్కరించారు. రాబోయే 2020 జూలై 24న టోక్యోలో జరుగబోయే ఒలింపిక్‌ క్రీడల విన్నర్స్‌కు ఇచ్చే మెడల్స్‌పై కమిటి మొత్తం ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే.. పనికిరాని ఫోన్లు, గ్యాడ్జెట్లను ఉపయోగించి మెడల్స్‌ తయారు చేయాలనుకుంటున్నారు. వినడానికి వింతగానే ఉన్నా దీనికి ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారట. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

ప్లాస్టిక్‌ను నివారించడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తుంటే.. జపనీస్‌ మాత్రం పాత పరికరాల నుంచి బంగారం, వెండి, ప్లాటినం, నికెల్‌ను తొలిగించే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇప్పటి ఆలోచన కాదు. 2016 నుంచీ ప్రతిపాదనలో ఉంది. గ్యాడ్జెట్‌ లేని ఇల్లు ఉండదు. అలాగే సెల్‌ఫోన్‌ లేని మనిషి ఉండడు. వీటికి ఏదైనా చిన్న రిపేర్‌ వచ్చినా పడేసి కొత్తది కొనడం అలవాటుగా మారింది. ఇలా చేస్తూ పోతే భూమ్మీద మొబైల్స్‌, గ్యాడ్జెట్స్‌ తప్ప మరేమీ కనిపించవు. ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసి నూతనంగా వాడుతున్నారు. ఈ పద్ధతినే కాస్త విభిన్నంగా మారుస్తున్నారు జపనీస్‌. అందుకు యువత సహకారం కావాలంటున్నారు.
Medals2

వీరితోనే సాధ్యమవుతుంది

జపనీస్‌ పౌరుల అంచనా ప్రకారం ఏడాదికి 650,000 టన్నుల గ్యాడ్జెట్లలో లక్ష టన్నుల ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను మాత్రమే రీసైకిల్‌ చేస్తున్నారు. మిగిలినవన్నీ వ్యర్థంగానే మిగిలిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒలింపిక్‌ కమిటీ 2017 ఫిబ్రవరిలో ‘అందరి పతకం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిఎన్‌టిటి క్యాంపెయిన్‌తో ప్రజలను ఉపయోగించని మొబైల్స్‌, గ్యాడ్జెట్లను ఒంటాల్స్‌లో పెట్టమని ప్రోత్సహించింది. ఐదువేల ఒలింపిక్‌, పారా ఒలింపిక్‌ మెడల్స్‌ తయారు చేయడానికి 8 టన్నుల మెటీరియల్స్‌ అవసరమవుతున్నాయి. ఈ పథకం ప్రారంభించింది 2016లో అయినా 2017 మార్చి నాటికి గ్యాడ్జెట్లను సేకరించడం ముగించారు. అప్పటికే జపాన్‌ వాసులు 6.21 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లతో సహా 78,895 టన్నుల గ్యాడ్జెట్లను సేకరించారు. వీటి నుంచి 28.4 కి.గ్రా. బంగారం, 3,500 కి.గ్రా. వెండి, 2,200 కి.గ్రా. కాంస్యాలను సేకరించారు. ఇవి పతకాలు చేయడానికి సరిపోతాయి. 2019 జూలై 24న రిలీజ్‌ చేసిన మెడల్స్‌ 85 మి.మీ వ్యాసం కలిగి ఉన్నది. దీన్ని ఒసాకాకు చెందిన గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ జునిచి కవానిషి రూపొందించాడు. ఈయన పనాథెనాయిక్‌ స్టేడియం ముందు ఐదు ఇంటర్‌లాకింగ్‌ ఒలింపిక్‌ రింగులను రూపొందించాడు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిబంధనల ప్రకారం ప్రతీ గోల్డ్‌మెడల్‌ని ప్యూర్‌ సిల్వర్‌, ఆరు గ్రా. గోల్డ్‌ ప్లేటింగ్‌తో తయారు చేస్తారు. అయినప్పటికీ టోక్యో 2020 పతకాలు 100 శాతం స్వచ్ఛమైన వెండి, కాంస్య పతకంలో 95 శాతం రాగి, 5 శాతం జింక్‌తో కూడిన ఎర్రఇత్తడి మిశ్రమంగా ఉంటుంది.

ఎలా ఉంటాయంటే..

ఈ మెడల్స్‌కు ప్రత్యేకమైన రిబ్బన్లు అమర్చారు. పతకాలను జపనీస్‌ బూడిదచెక్కతో వృత్తాకార కేసులో తయారు చేశారు. దీనికి సంప్రదాయ జపనీస్‌ నమూనాలు, కిమోనో-లేయరింగ్‌ పద్ధతులను ఆదర్శంగా తీసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల పెరుగుదలపై అవగాహన పెంచడమే టోక్యో 2020 పతకాల ముఖ్య ఉద్దేశం. గ్యాడ్జెట్ల వినియోగదారులు కూడా కొత్తవాటిపై మొగ్గు చూపకుండా ఉన్నవాటినే తిరిగి వాడుకునేలా చేసుకోవాలంటూ ఒలింపిక్‌ కమిటీ అంటున్నది. పనికిరాని ఎలక్ట్రానిక్స్‌ నుంచి లోహాలు తయారు చేసి వినియోగిస్తున్నది జపాన్‌ దేశం అయినప్పటికీ ఈ ఆలోచన మాత్రం బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు గౌరవం దక్కుతుంది. 2016లో సమ్మర్‌ ఒలింపిక్స్‌ కోసం రీసైకిల్‌ చేసిన పదార్థాల నుంచి 30 శాతం రజత, కాంస్య పతకాలు రూపొందించారు.
Medals1

మార్పు వస్తుంది

జపాన్‌లో మూడుసార్లు ఒలింపిక్‌ బంగారు పతక విజేత అయిన జిమ్నాస్ట్‌ కోహీ ఉచిమురా ఇలా అంటున్నాడు. టోక్యో 2020 ఒలింపిక్‌, పారాలింపిక్‌ పతకాలు.. ప్రజల ఆలోచనలు మార్చడానికి, వ్యర్థాలను నివారించమని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఇదొక మంచి మార్గంలా కనిపించింది. ఇది భవిష్యత్తు తరాలకు ఇదొక ముఖ్యమైన సందేశంగా భావిస్తున్నాను.
- gymnast Kohei Uchimura succinctly

500
Tags

More News

VIRAL NEWS