శ్రీ వరసిద్ధి వినాయక పూజా ప్రారంభః


Sat,August 31, 2019 11:27 PM

Gananadhudu2
(కింది విధంగా అంటూ అక్షితలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి)

ధ్యానం - శ్లో॥ భవంసంచిత పాపౌఘవిధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ॥
శ్లో॥ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంతుకుశధరం దేవం ద్యాయేత్సిద్ధి వినాయకం ॥
శ్లో॥ ఉత్తమం గణనాధస్యవ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టంప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥
శ్లో॥ ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(కింది విధంగా అంటూ అక్షితలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి).
ఆవాహనం - శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాధనాధ సర్వజ్ఙ, గౌరీగర్భ సముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(కింది విధంగా అంటూ అక్షింతలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి).
ఆసనం - శ్లో॥ మౌక్తికై: పుష్యరాగైశ్చ నానారత్త్నె ర్విరాజితం - రత్న సింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్ళు చల్లాలి).
అర్ఘ్యం - శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన - గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్ళు చల్లాలి).
పాద్యం - శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక - భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమ: పాదయో పాద్యం సమర్పయామి.
(కింది విధంగా అంటూ పువ్వుతో నీరు చల్లాలి).
ఆచమనీయం - శ్లో॥ అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత - గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ముఖే: శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(కింది విధంగా అంటూ ఆవు పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము ఉంచవలెను).
మధుపర్కం - శ్లో॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: మధుపర్కం సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పముతో స్వామిపై పంచామృతాలు చల్లవలెను).
పంచామృత స్నానం - శ్లో॥ స్నానం పంచామృత్తెర్దేవ గృహాణ గణనాయక - అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత ॥
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: పంచామృత స్నానం సమర్పయామి.
(ఈ కింది విధంగా అంటూ పుష్పంతో నీటిని రెండుసార్లు స్వామిపై చల్లాలి).
శుద్ధోదక స్నానం - శ్లో॥ గంగాది సర్వతీర్ధేభ్యై: అహృతై: అమలైర్జలై: స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం పున: శుద్ధాచమనీయం సమర్పయామి.
(కింది విధంగా అంటూ కొంచెం దూది పల్చగా చేసి స్వామిపై వెయ్యాలి).
వస్త్రం - శ్లో॥ రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం - శుభప్రద గృహాణత్వం, లమ్బోదర హారాత్మజ॥
శ్రీ వరసిద్ది వినాయకాయ నమ: వస్త్రయుగ్మం సమర్పయామి.
(కింది విధంగా అంటూ దూదితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామికి వెయ్యాలి).
యజ్ఞోపవీతం - శ్లో॥ రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం - గృహాణ దేవ సర్వజ్ఞభక్తానామిష్ట దాయక॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: యజ్ఞోపవీతం సమర్పయామి).
(కింది విధంగా అంటూ పువ్వుతో గంధాన్ని స్వామిపై వెయ్యాలి).
గంధం - శ్లో॥ చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్‌ విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం॥
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: దివ్య శ్రీ చందనం సమర్పయామి
(కింది విధంగా అంటూ అక్షింతలు స్వామిపై వెయ్యాలి).
అక్షింతలు - శ్లో॥ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్‌ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పాలు స్వామిపై వెయ్యాలి).
పుష్పములు - శ్లో॥ సుగంధాని సుపుష్పాణీ జాజీకుంద ముఖానిచ - ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: పుష్పం సమర్పయామి

195
Tags

More News

VIRAL NEWS