రాశి ఫలాలు


Sun,September 15, 2019 01:33 AM

15-9-2019 నుంచి 21-9-2019 వరకు

మేషం

నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు.వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అందరితో సమన్వయం ఉంటుంది. పై అధికారుల సహాయసహకారాలు ఉంటాయి. ముఖ్య గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వృధా ఖర్చులుంటాయి. పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడొచ్చు. స్నేహితులు, బంధువులతో మనస్పర్థలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో విజయ సూచనలున్నాయి. ప్రయాణాలు అనుకూలించక పోవచ్చు.

వృషభం

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. భక్తి భావాలు పెంపొందుతాయి. మంచివారితో సాహచర్యం ఉంటుంది. ఉన్నతవిద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొంటారు. సాహిత్య, సంగీత, కళలు, సినిమా రంగాలలో ఉన్న వారికి బాగా కలిసొస్తుంది. రావాల్సిన డబ్బు మాత్రం సకాలంలో అందకపోవచ్చు. పనివారితో ఇబ్బందులుంటాయి. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి.

మిథునం

వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు వా యిదా వేసుకోవడం మంచిది. న్యాయవాద, వైద్య, ఇంజినీరింగ్‌ వృత్తుల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. నిత్యావసర వస్తు వ్యాపారం అనుకూలిస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవు తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుం ది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోకూడదు.

కర్కాటకం

ఉద్యోగస్తులకు ఆఫీసులో అన్ని విధాలుగా కలిసొస్తుంది. ప్రమోషన్‌లూ ఉం డొచ్చు. మంచి వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. స్నేహితులతో, బంధువులతో పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తీర్థయాత్రలు, నదీస్నానాలను ఆచరిస్తారు. దేవతా గురుభక్తి, అనుభవజ్ఞులు, పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారంలో తోటి వారితో ఇబ్బందులు ఏర్పడొచ్చు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుది.

సింహం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా యి. అయినా కొన్ని తాత్కాలిక లాభా లు ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. గత పెట్టుబడుల వల్ల లాభాలొస్తాయి. ప్రయాణాలు బాగా కలిసొస్తాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. అతిగా ఆలోచించడం మాని, ఆలోచనలను కార్యరూపంలో ఉంచుతారు. ఉద్యోగస్తులకు తోటివారితో, పైఅధికారులతో మనస్పర్ధలు ఏర్పడొచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా లాభం ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. పనివారితో సమస్యలు తలెత్తుతాయి.

కన్య

ముఖ్య గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవచ్చు. వ్యాపారంలో పనివారితో ఇబ్బందులు ఏర్పడతాయి. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు తోటి వారితో మనస్పర్ధలు ఏర్పడొచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం, భూ వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వాహనాల వల్ల ఇబ్బందులు, ఖర్చులు ఉంటాయి.

తుల

ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. లాభాలను పొం దుతారు. శుభకార్యాలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. పెద్దల సహాయ సహకారాలను పొందుతారు. విహార యాత్రలు, తీర్థయాత్రలు చేస్తా రు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పాత వాటి మూలంగా లాభాలను పొందుతారు. వ్యవసాయ దారులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల మన్నననలు పొందుతారు. మంచి పేరు సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వృత్తి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం బాగుం టుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు ఏర్పడొచ్చు. శుభకార్యాలకు ఆటంకాలుంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలలో ప్రయోజనాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. రాజకీయంలో ఉన్న వారికి కార్యకర్తలు, పైవారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి రాబడి అనుకూలిస్తుంది. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సమన్వయంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ముఖ్య గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మకరం

సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వారికి మంచి ప్రయోజనాలుంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. అనారోగ్య సమస్యలు తీరుతాయి. సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురు భక్తి పెంపొందుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు.

కుంభం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడుల వల్ల లాభాలుం టాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి బాగా కలిసొస్తుంది. పెద్దల సహాయ సహకారాల వల్ల అన్ని విషయాలలోనూ సత్ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. చేతిలో డబ్బు ఉండడం వల్ల ఉత్సాహంతో పనులు చేస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా వుంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.

మీనం

ఆత్మీయులతో చాలా పనులు నెరవేరుతాయి. వాహనాల వల్ల పనులు కలిసొస్తాయి. కొత్త వస్తువులు, వాహనాలు కొంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి వారితో సంబంధాలు పెంపొందుతాయి. మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్యాలు చేస్తారు. చాలా విషయాలలో అదృష్టం కలిసొస్తుంది. రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయ, ఇంజినీరింగు, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. దీంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

5504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles