ఒక టీషర్టు కథ!


Sun,September 29, 2019 01:00 AM

టీ-షర్ట్ తయారీలో, దానిని కుట్టడంతో సహా వేర్వేరు దశల్లో చాలామంది శ్రమ ఇమిడి ఉంటుంది. అసలు బ్రాండ్లకు ప్రామాణిక ఉత్పత్తులు ఎక్కడ పుట్టాయో, ఆయా స్టోర్‌లకు చేరేంత వరకూ అవి చేసే ప్రయాణమేమిటో ఎవరికీ తెలియదు. పీయోట్రా రివోలి అనే మహిళా ప్రొఫెసర్‌కు దాని మూలాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. టీ-షర్టు ప్రయాణాన్ని గురించి తెలుసుకోవడానికి దేశ, విదేశాలు చుట్టి వచ్చింది. టీ-షర్ట్ వెనుక ఉన్న ట్యాగ్‌తో మొదలుపెట్టి ఒక్కో అడుగు వెనుకకు వెళ్తూ, ఆయా సరఫరాదారులను గురించి తెలుసుకుంటూ చివరకు ఆ టీ-షర్టుతో ముడిపడిన అంశాలపై పుస్తకమే రాసింది.
Dress

వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పని చేస్తున్న ఎకనామిక్స్ ప్రొఫెసర్ పీయోట్రారివోలి టీ-షర్టు పుట్టుక గురించి అన్వేషణ మొదలు పెట్టింది. ఆమె ప్రయాణం టెక్సాస్‌లో పత్తి పండించే ప్రాంతమైన లుబ్బాక్ నుంచి మిషప్,టాంజానియా, చైనా వరకూ సాగింది. పెద్ద బ్రాండ్ల కంపెనీలు సరకులను ఎక్కడ కొనుగోలు చేయాలి? దుస్తులను ఎక్కడ తయారు చేయాలి ? అనే నిర్ణయాలను రాజకీయపరంగానే తీసుకుంటాయనే విషయాలు రివోలి పరిశోధనలో తేలింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక టీ-షర్టు ప్రయాణం అనే పేరుతో ఆమె పుస్తకం రాసింది. మేడ్ ఇన్ మొరాకోఅని గులాబీ రంగు జారా షర్ట్ మీద ఉన్న లేబుల్ చెబుతున్నది. ఈ డ్రెస్‌ను చివరిగా కుట్టింది అక్కడే . అది అక్కడకు చేరక ముందే ఎన్నో దేశాలు దాటొచ్చింది. ఈ డ్రెస్‌ను తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ లయోసెల్ నుంచి వస్తుంది. లయోసెల్ పత్తికి ప్రత్యామ్నాయం. ఇది పీచును పోలి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు యూరప్‌లో ఉంటాయి. ఆస్ట్రియాకు చెందిన లెంజింగ్ అనే సంస్థ నుంచి జారా యజమాని ఇండిటెక్స్ లయోసెల్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ పీచును తొలుత ఈజిప్టుకు పంపిస్తారు. అక్కడ దానిని నూలుగా ఒడుకుతారు. ఆ నూలును చైనాకు పంపించి అక్కడ వస్త్రంగా నేస్తారు. ఆ బట్టను స్పెయిన్ పంపించి రంగులు వేస్తారు. స్పెయిన్ నుంచి ఆ రంగు వస్ర్తాలను మొరాకోకి పంపిస్తారు. అక్కడ దానిని కత్తిరించి వివిధ రకాల దుస్తులుగా కుడతారు. అనంతరం ఈ దుస్తులను తిరిగి స్పెయిన్‌కు పంపిస్తారు. అక్కడ వాటిని ప్యాక్ చేసి బ్రిటన్, అమెరికా సహా ఇండిటెక్స్ షాపులు ఉన్న 93 దేశాలకు పంపిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే డ్రెస్‌లు, టీ-షర్టులు, ట్రౌజర్లు వంటి పలురకాల దుస్తులు ఇలా సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకొని చివరకు వినియోగదారుల వద్దకు చేరుతాయి.
Dress1

మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి?

ఇండిటెక్స్ బ్రాండ్ సరికొత్త ట్రెండ్‌లకు ప్రసిద్ధి. ఈ సంస్థ దుస్తులు చాలావరకూ స్పెయిన్ పోర్చుగల్, మొరాకో, టర్కీ వంటి సమీప దేశాల్లో తయారవుతాయి. అందువల్లనే మార్కెట్‌లోకి వాటి దుస్తులను వేగంగా తీసుకురాగలుగుతున్నది. దీని ప్రత్యర్థి సంస్థల సరఫరాదారులు దీనికన్నా కొంత దూర దేశాల్లో ఉంటాయి. ఈ ఫ్యాషన్ బ్రాండ్లు ఉపయోగించే చాలా ఫ్యాక్టరీలు వాటి సొంత యాజమాన్యంలోని సంస్థలు కావు. వాటిని తమ అధికారిక సరఫరాదారులుగా ఎంపిక చేసుకుంటాయి. ఈ సరఫరాదారులు కూడా గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి వివిధ పనులను ఇతర ఫ్యాక్టరీలకు సబ్-కాంట్రాక్టు ఇస్తుంటాయి. హెచ్ అండ్ ఎం, మార్క్స్ అండ్ స్పెన్సర్, గ్యాప్, ఆర్కేడియా వంటి పలు ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్ల సంస్థలను సంప్రదించింది రివోలీ. కానీ ఇండిటెక్స్ మాత్రమే ఇచ్చిన గడువులోగా స్పందించి సమాచారం ఇవ్వగలిగింది.

వినూత్న ప్రచారం

రాణా ప్లాజా ఫ్యాక్టరీ విషాదం అనంతరం ఏర్పాటైన ఫ్యాషన్ రివల్యూషన్ అనే స్వచ్ఛంద సంస్థ.. దుస్తుల సంస్థలు తమ సరఫరాదారులు ఎవరనే విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు ఉద్యమాన్ని చేపట్టింది. ఏటా ఆ విషాద సంఘటనను గుర్తు చేస్తూ #WhoMadeMyClothes నా దుస్తులను ఎవరు తయారు చేశారు అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ఈ విషయంలో సంస్థలపై ఒత్తిడి తెచ్చేలా వినియోగదారులను ప్రోత్సహించడం ఈ వినూత్న ప్రచార లక్ష్యం.

241
Tags

More News

VIRAL NEWS