అతిపెద్ద ద్వీపం


Sun,September 29, 2019 01:17 AM

ICEMountain
ప్రపంచంలోనే అతిపెద్ద ఐల్యాండ్‌గా పేరు తెచ్చుకుందే ఈ గ్రీన్‌ల్యాండ్. 2,130,800 చ. కిలోమీటర్ల మేర ఈ ఐల్యాండ్ విస్తరించి ఉంది. అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలకి మధ్యలో ఈ ఐల్యాండ్ కొలువై ఉంది. డెన్మార్క్‌లోని స్వతంత్ర భూభాగంగా దీన్ని పరిగణిస్తారు. 80 శాతం మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది. ఇక్కడ జనాభా 57,600. అంటార్కిటికాలో ఇలా మంచు దుప్పటి ఎక్కువగా కప్పుకొన్న భూభాగంగా దీనికి రెండవ స్థానం దక్కుతుంది. ఈశాన్య గ్రీన్‌ల్యాండ్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్క్. అంతేకాదు.. దీన్ని ఈశాన్య జాతీయ ఉద్యానవనంగా పిలుస్తారు. దీనిని కలిపేందుకు ఇక్కడ రోడ్డు సౌకర్యాలు లేవు. ఇక్కడి ప్రజలకు సీలింగ్, తిమింగలాలు, చేపలు పట్టడమే ప్రధాన ఆదాయ వనరు. ఎండాకాలంలో, చలికాలంలో సాహసోపేతమైన ఆటలకు నెలవుగా ఉంటుంది. ఎంతోమంది అడ్వెంచర్ చేయడానికి ఇక్కడికి చేరుకుంటారు.

601
Tags

More News

VIRAL NEWS