నిండు జీవితాన్ని అనుభవించిన ద్రవిడ సూరీడు


Sun,October 6, 2019 01:25 AM

కళైంజర్‌ కరుణానిధి
Karunanidhi

జూన్‌ 18 ఉదయం పదకొండు గంటలు. తమిళనాడు రాజధాని చెన్నైలోని గోపాలపురం. డీఎంకే అధినేత కళైనార్‌గా పిలుచే కరుణానిధి నివాసం.ఆ ఇంటిముందు వేలాదిమంది కన్నీటితో నిలబడి ఉన్నారు.తమ ప్రియతమ నేతకు ఏమైందోననే ఆందోళనకళైంజర్‌ జిందాబాద్‌, కళైనార్‌ జిందాబాద్‌కళైంజర్‌ నల్లా ఇరుకీంగళా? (కళైనార్‌ ఎలా ఉన్నారు?)కళైంజర్‌ నీంగల్‌ సౌక్యమా?(కళైనార్‌ మీరు క్షేమమా?)కరుణా నీంగల్‌ ఎంగ? (కళైనార్‌ మీరు ఎక్కడ?) తమ ప్రియతమ నేతను తలుచుకుని తమిళప్రజలు బోరున విలపిస్తున్న తీరది. మరో పది నిమిషాల తర్వాత ఆయన కుమారుడు డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్‌ బయటకు వచ్చారు. ఆయనను చూడగానే ఒక్కసారిగా అందరూ ముందుకు తోచుకు వచ్చారు. ఆయన అక్కడున్న వారిని ఉద్దేశించి‘కరుణానిధి ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఆయన క్షేమంగానే ఉన్నారని, అయితే, ఆయనకు విశ్రాంతి అవసరమని, ఆయణ్ని చూసేందుకు సందర్శకులను అనుమతించరాదని వైద్యులు సూచించారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని చేతులెత్తి విన్నవించారు. దీంతో అక్కడున్న వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

- మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409

నిజానికి కరుణానిధి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటికీ కరుణానిధి వయసు 96 ఏళ్లు. 2016 డిసెంబర్‌లో జయలలిత మృతి చెందిన కొద్ది రోజులకే కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా ఆయణ్ని చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కరుణానిధిని పరీక్షించిన వైద్యులు భుజంలో ‘ట్రకియోస్టమీ’ పరికరాన్ని అమర్చారు. నాటి నుంచి ఆయన వీల్‌ చైర్‌కే పరిమితమయ్యారు.చికిత్స అనంతరం కోలుకున్న కరుణానిధి గోపాలపురంలోని తన నివాసానికే పరిమితమయ్యారు. కావేరీ ఆస్పత్రి వైద్యులు ఆయన నివాసానికే వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి ‘ట్రకియోస్టమీ’ పరికరాన్ని మార్చుకోవాల్సి ఉండగా.. 2017 జూన్‌ 18న ఆస్పత్రికి వెళ్లిన కరుణానిధి చికిత్స అనంతరం ఇంటికి తిరిగివెళ్లారు. అప్పటి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించారు. ఆయనకు ఎలాంటి దురలవాట్లూ లేవు. ఉదయాన్నేనిద్రలేవడం, యోగా చేయడం, నడక, మిత ఆహారం తీసుకోవడం వల్ల ఆయన దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా జీవించారు. 2009లో తీవ్రమైన నడుంనొప్పి, కాలునొప్పి కారణంగా ఆయనకు స్పీనల్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. 2016 ముందు వరకు ఆయన అరుదుగా హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్‌లో కరుణానిధికి ట్రాకియోస్టోమీ చేశారు. దీనివల్ల ఆయనకు శ్వాస సమస్యలు, గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తగ్గాయి. దాంతోపాటు గ్యాస్టోస్ట్రొమీ చేసి కడుపులో ఫ్లెక్సిబుల్‌ ట్యూబును ఉంచారు. ఈ ట్యూబ్‌ల ద్వారా గడచిన 20 నెలలుగా న్యూట్రిషన్లు, ఫ్లూయిడ్స్‌, మందులను నేరుగా అందించారు.

2017లో కరుణానిధి ఇంటి నుంచి బయటకు వచ్చిన సందర్భాలు తక్కువ. పెద్దగా ఎవరినీ కలువలేదు. జూలై 19న ట్రాకియోస్టమీ ట్యూబ్‌ మార్చడం కోసం కరుణానిధిని చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో చేర్పించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన డిశ్చార్జ్‌ అయ్యారు. తిరిగి గోపాలపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే రోజు కావేరీ ఆసుపత్రి వైద్యులు వారి ఇంటికి వెళ్లి అవసరమైన పరీక్షలు చేయడం, ఎప్పటికప్పుడు ఆరాతీయడం చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజు వందల సంఖ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు గుమి కూడ డం, ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించడం, వైద్యులు విడుదల చేసే బులెటిన్‌ను విని సంతృప్తి చెంది ఎవరిండ్లకు వారు వెళ్లిపోవడం రొటిన్‌గా సాగుతునే ఉంది.
జూలై 26న కరుణానిధి ఆరోగ్యం తిరిగి క్షీణించింది. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్త బయటకురావడంతో డీఎంకే కార్యకర్తలంతా కన్నీరుమున్నీరవుతూ పరుగులుతీశారు. గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో కరుణ ఆరోగ్యంపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వయోభారం కారణంగా కరుణానిధి ఆరోగ్యం ‘స్వల్పం’గా క్షీణించిందని కావేరీ హాస్పిటల్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత వైద్యుల చికిత్సతో కోలుకుంటున్నారని తెలిపారు. కార్యకర్తలెవ్వరూ వదంతులు నమ్మవద్దని ఆయనకు చికిత్స కొనసాగుతున్నదని ప్రకటించారు. అయినా సంతృప్తి చెందని కార్యకర్తలు అక్కడే ఉన్నారు. దీంతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు కొంత సంతృప్తి చెందారు. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన మూత్రనాళాల ఇన్పెక్షన్‌ కారణంగా బాధ పడుతున్నారని, ఈ కారణంగా జ్వరం వచ్చిందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు.

బీపీ తగ్గడం, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌, ఇతర సమస్యల కారణంగా ఆయన్ను జూలై 28న హుటాహుటిన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులతోపాటు భారీ సంఖ్యలో డీఎంకే నేతలు కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వెల్లడించారు. ఆయనను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు. ఆసుపత్రిలో చేరిన రెండు గంటల్లోగా ఆయన బీపీ అదుపులోకి వచ్చింది. కానీ ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించారు. మరునాడు ఆరోగ్యం క్షీణించినా.. తర్వాత కరుణానిధి కోలుకున్నారని కావేరి హాస్పిటల్‌ యాజమాన్యం తెలిపింది. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్ద నుంచి వెళ్లిపోయారు. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ ద్వారా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులు కూడా అదే పరిస్థితి ఉంది. జూలై 31న కరుణానిధి చికిత్సకు బాగా స్పందిస్తున్నారని వైద్యులు ప్రకటించారు. మరోవైపు కావేరీ ఆస్పత్రి వద్దకు డీఎంకే కార్యకర్తల రాక పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా దళాలను పెద్దఎత్తున మోహరించారు.
Karunanidhi1
వారం రోజుల పాటు సాధారణంగా ఉన్న ఆయన పరిస్థితి ఆగస్టు 6 నాటికి మళ్లీ క్షీణించింది. వయోభారం కారణంగా ఆయన అవయవాలు సరిగా పని చేయడం లేదని, వాటి పనితీరు సక్రమంగా ఉంచేలా చేయడం సవాల్‌గా మారిందని హాస్పిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ తెలిపారు. ఆయనను నిరంతరం పరీక్షిస్తున్నామని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. వచ్చే 24 గంటలు ఎంతో కీలకమని తెలిపారు. తమ ప్రియతమ నేత ఆస్పత్రి పాలయ్యారని తెలిసిన నాటి నుంచి డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కావేరి ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కావేరి ఆస్పత్రి ఎదుట 108 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థించారు. కరుణానిధి ఆరోగ్యంపై బెంగతో ఆయన అస్వస్థతకు గురైన నాటి నుంచి మరణించేనాటికి 25 మందికి పైగా అభిమానులు ప్రాణాలు విడిచినట్లు ఆయన కుమారుడు స్టాలిన్‌ తెలిపారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కరుణానిధి నివాసం వద్ద పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు డీజీపీ తెలిపారు. సెలవులో ఉన్న పోలీసులంతా డ్యూటీలో చేరాలని డీజీపీ కార్యాలయం నుంచి పోలీసు కమిషనర్లు, డీఐజీలు, జిల్లా ఎస్పీలకు ఫ్యాక్స్‌ ద్వారా ఆదేశం వెళ్లింది. కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రి వద్ద భద్రతను మరింత పెంచారు. ఆస్పత్రి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడికి భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రిస్తున్నారు. మరో వైపు చెన్నైలోని రాజారత్నం స్టేడియం వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్న విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. గోపాలపురంలోని కరుణానిధి నివాసం వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కావేరి ఆసుపత్రికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రిం చారు. ప్రముఖల వాహనాలను మాత్రమే కావేరి ఆసుపత్రి ప్రాంగణంలోకి పోలీసులు అనుమతించారు.

సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి.. పెద్ద ఎత్తున అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో వారిని కంట్రోల్‌ చేయడం కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుకార్లను నమ్మొద్దంటూ కార్యకర్తలకు రాజా సూచించారు. ఎంత చెప్పినా కలైంజర్‌ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన క్షణక్షణానికీ పెరుగుతున్నది. వారిని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా నాయకులు, పోలీసులు కోరినా వినడం లేదు. దీంతో ఓ దశలో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.
ఆగస్టు 7, 2018 కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి తుదిశ్వాస విడిచినట్లు కావేరి హాస్పిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అంత్యక్రియలు ఆగస్టు 8 రాత్రి పూర్తయ్యాయి. అభిమానుల అశ్రు నయనాల మధ్య మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో అధికార లాంఛనాలతో కళైంజర్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఏడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగి జాతికి సేవలందించిన కురువృద్ధుడికి గౌరవ సూచకంగా సైనికులు సగర్వంగా వందనం సమర్పించి, గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు. కవి, కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ధీశాలి, తమిళ ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు తరలిపోయారు. తుదకంటా క్రియాశీల రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూనే 94 ఏళ్ల నిండు వయసులో కరుణానిధి కన్నుమూశారు. బతికినంతకాలం ద్రవిడ వాదమే నినాదంగా, హేతువాదం పునాదిగా దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడు.. లక్షలాది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. కరుణానిధి అస్తమయంతో ఒక శకం ముగిసినట్లయింది.
Karunanidhi2
ఆగస్టు 7, 2018 కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి తుదిశ్వాస విడిచినట్లు కావేరి హాస్పిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కళైంజర్‌ మరణ వార్త తెలియగానే ఆయన అభిమానులు బోరున విలపించారు. ఆయన మృతితో చెన్నైలో హై అలర్ట్‌ ప్రకటించారు.

1130
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles