మీకు మాత్రమే చెబుతుంది


Sun,October 13, 2019 02:54 AM

Vani-Bhojan
విజయ్ దేవరకొండను.. తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు.. ఇప్పుడు అదే విజయ్.. తరుణ్‌ని ఇండస్ట్రీకి హీరోగా తీసుకొస్తున్నాడు.. మరి తరుణ్‌కి జోడీగా తమిళ భామ వాణి భోజన్ నటిస్తున్నది. సీరియల్స్ నుంచి సినిమాకి వచ్చిన ఈ అమ్మడు.. అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ హీరోయిన్‌గా తన అదృష్టం పరీక్షించుకోనున్నది.. మరి ఈ అమ్మడు మీకు మాత్రమే చెప్పే సంగతులే ఇవి..

కింగ్‌ఫిషర్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా వాణి కెరీర్ మొదలుపెట్టింది.

చాలా టీవీ కమర్షియల్స్‌లో కూడా కనిపించింది. సుమారు 50 యాడ్స్‌ల్లో నటించింది.

2012లో మాయ అనే తమిళ సీరియల్‌లో నటించడంతో మంచి బ్రేక్ వచ్చింది. దేవీ మంగల్ అనే సీరియల్‌లో ఉత్తమనటి నటించినందుకు అవార్డు అందుకున్నది.

వాణి భోజన్.. యోగా టీచర్ కూడా. మలేషియన్ టీవీ చానెల్‌లో యోగా ప్రోగ్రామ్ అనే దానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

వాణి ధనుష్‌కి పెద్ద ఫ్యాన్. తనతో నటించేందుకు ఎదురుచూస్తున్నానంటున్నది ఈ అమ్మడు.

ఊటీలోని బోర్డింగ్ స్కూల్‌లో వాణి స్కూలింగ్ పూర్తయింది. కాలేజ్ ఊటీలోని గవర్నమెంట్ కాలేజ్‌లో చేసింది.

వాణిని అందరూ దేవ మంగళ సత్య అని ముద్దుగా పిలుస్తారట. సీరియల్‌లోని క్యారెక్టర్‌తో ఆమెను పిలువడం ఎంతో సంతోషంగా ఉంటుందంటుంది.

ఈనెల 28న వాణి 31వ పుట్టినరోజు జరుపుకోనున్నదీ.

వాణీ భోజన్ తండ్రి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. ఆయన మోడలింగ్ షూట్స్ కూడా చేసేవారు.

Vani-Bhojan1
తండ్రి ఫొటో షూట్ చేస్తున్నప్పుడు చూడడం మొదలుపెట్టింది. కానీ, ఏనాడూ తను నటి కావాలనుకోలేదు. తన ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

తను చేసిన దేవీ మంగల్ సీరియల్ చాలా పాపులర్. ఎంతంటే.. ఒక్కో ఎపిసోడ్‌కి యూట్యూబ్‌లో కనీసం మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

షుగర్ ఫ్రీ క్యాండీస్ అంటే ప్రాణం అంటున్నది. లిప్‌స్టిక్స్, పర్‌ఫ్యూమ్స్‌ని బాగా ఇష్టపడుతుంది.

సే స్వాగ్ అనే యూట్యూబ్ చానెల్‌లో కొన్ని మేకప్ టిప్స్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది. వీటికి కూడా మిలియన్ మించి వ్యూస్ ఉన్నాయి.

1073
Tags

More News

VIRAL NEWS