రాశి ఫలాలు


Sun,November 17, 2019 12:38 AM

17-11-2019 నుంచి 23-11-2019 వరకు

మేషం

ఈవారం సభలు, సమావేశాలకు వెళ్తారు. సంగీత, సాహిత్య, ఐటీ రంగాల్లోని వారికి అవకాశాలొస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనుల్లో శ్రద్ధ కనబరుస్తారు. సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పరిచయాలేర్పడతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందక పోవడంతో కొన్ని పనులలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. ఆర్థిక, న్యాయ పరమైన సమస్యలు ఎదురు కావచ్చు. కొంత జాగ్రత్త అవసరం. పెద్దలు, అనుభవజ్ఞుల సహాయ సహకారాలు ఈ వారం ప్రధానంగా అవసరం.

వృషభం

అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు వృద్ధి అవుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం, ఆటోమొబైల్ రంగాల్లోని వారికి పనులు కలిసివస్తాయి. నిత్య వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి పనులు నెరవేరుతాయి. పెద్ద మొత్తం పెట్టుబడుల విషయంలో ఆలోచన, జాగ్రత్త అవసరం. సూచనలు, సలహాలకు ప్రాధాన్యమివ్వాలి. రావాల్సిన డబ్బు అందక పోవడంతో కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి. దేవతా, గురుభక్తి, నదీ స్నానాల వల్ల ప్రశాంతత చేకూరుతాయి.

మిథునం

విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం లభిస్తుంది.ప్రమోషన్‌లుంటాయి. ఆఫీసులో పేరు పొందుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచి వారితో సత్సంబంధాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అవకాశాలు వస్తాయి.

కర్కాటకం

ఈ వారంలో ఈ రాశివారికి అనుభవజ్ఞుల, తల్లిదండ్రుల సహాయ సహ కారాలు ఉంటాయి. దీంతో మంచి అవగాహనతో పనులు చేపడతారు. తీర్థయాత్రలు, నదీస్నానాలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. పనులలో ఆలస్యం తగ్గుతుంది. పనివారితో ఆనుకూలత ఉంటుంది. సినిమా, సంగీత, సాహిత్య రంగాలలోని వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొత్త పనులు చేస్తారు. నిత్య వ్యాపారం లాభిస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి రావాల్సిన డబ్బు వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వివాహాది ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

సింహం

ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత విద్యకు అనుకూలం.ఇంటిలో సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు. వస్త్ర, వస్తువులను కొంటారు. సాహిత్య, సంగీత, సినిమా రంగాల్లోని పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. సమయానికి పనులు పూర్తవుతాయి.

కన్య

ఉద్యోగస్తులు పేరు సంపాదిస్తారు. తోటి ఉద్యోగులలో, పైఅధికారులలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా, వడ్డీ, షేర్, వ్యాపారాల్లోని వారు తాత్కాలిక ప్రయోజనాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. మంచి స్నేహం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. పెద్దల సూచనలకు ప్రాధాన్యమివ్వాలి.

తుల

ఈ వారంలో తీర్థయాత్రలు చేస్తారు. మంచివారి సూచనలకు ప్రాధాన్యాన్నిస్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. తద్వారా కొత్త పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. పనివారితో, కిందిస్థాయి వారితో ఉన్న సమస్యలు దూరమవుతాయి. ఆలస్యం దూరమవుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారి పనులు పూర్తవుతాయి. పేరు సంపాదిస్తారు. మంచి సంబంధాలు పెంపొందుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అవకాశాలు వస్తాయి. పనులు నెరవేరుతాయి. పేరు సంపాదిస్తారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనాలోచిత పెట్టుబడుల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. నిర్మాణ, వాహనాల క్రయ విక్రయ రంగాల్లోని వారికి అనుకున్న పనులు అవుతాయి. కొంత జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ఈ వారం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. నిత్య వ్యాపా రంలో అభివృద్ధి ఉంటుంది. లాభాలు ఉంటాయి. న్యాయవాద, ఇంజినీరింగు, వైద్యవృత్తిలోని వారికి కలిసివస్తుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. రెట్టింపు శ్రద్ధతో పనులు చేయడం అవసరం. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. మంచి పరిచయాల వల్ల పనులు నెరవేరుతాయి.

మకరం

ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. తోటివారితో, పైఅధికారులతో సత్సంబంధాల వల్ల పనులు నెరవేరుతాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. పేరు సంపాదిస్తారు. నిత్య వ్యాపారాల్లో లాభాలుంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయవాద, రాజకీయ, వైద్య వృత్తిలోని వారికి ప్రధానంగా కలిసొస్తుంది. సూచనలు, సలహాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్లడం ఈ వారం చాలా అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం

విద్యార్థులకు అనుకూలమైన వారం. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీ పరీక్షల్లో మంచి స్థాయిలో నిలుస్తారు. ఉన్నత విద్యకై ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనివారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. సూచనలను, సలహాలను పాటిస్తారు. తద్వారా అన్ని విషయాలలోనూ మంచి ఫలితాలు పొందుతారు.

మీనం

గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. నిత్య వ్యాపారం లాభిస్తుంది. న్యాయవాద, వైద్యవృత్తిలోని వారు సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగం, పత్రికా రంగం, హోటలు, క్యాటరింగు వ్యాపారాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక పోవచ్చు. తద్వారా పనులు వాయిదా పడతాయి. తల్లిదండ్రులు, పెద్దల మాటలు వినకపోవడంతో అనవసరమైన వైషమ్యాలకు గురవుతారు. అయా పనుల కోసం రెట్టింపు ప్రయత్నాలు అవసరం.
Rasi_Phalalu

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

1513
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles