ప‌బ్‌జి (PUBG) ఆడుతున్నారా..? ఈ టిప్స్ ట్రై చేయండి..!


Tue,December 18, 2018 03:01 PM

ప‌బ్‌జి (PUBG) లేదా ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (PlayerUnkown's Battlegrounds).. పేరేదైనా ఇప్పుడీ గేమ్ యువ‌త‌కు కిక్కెక్కిస్తోంది. ఎక్క‌డ చూసినా పెద్ద ఎత్తున యువ‌త ప‌బ్‌జి గేమ్‌లో మునిగి తేలుతున్నారు. సోలోగా, టీమ్‌గా ఏర్ప‌డి ఈ గేమ్‌ను ఆస్వాదిస్తున్నారు. యువ‌తే కాదు, అన్ని వ‌య‌స్సుల వారికి ఈ గేమ్ ఎంత‌గానో న‌చ్చింది. అందుకే ఇప్పుడీ గేమ్ బాగా పాపుల‌ర్ అయింది. అయితే ఈ గేమ్‌లో 100 మంది ఇత‌ర ప్లేయ‌ర్స్‌తో పోటీ ప‌డి చివ‌రి వ‌ర‌కు నిలిచి నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ తెచ్చుకోవ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. అది అన్నిసార్లు సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. కానీ కింద సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే.. కొత్త‌గా ప‌బ్‌జి ఆడేవారికే కాదు, ఇప్ప‌టికే ఆ గేమ్‌ను ఆడేవారికి కూడా ఆ గేమ్‌లో చివ‌రి వ‌ర‌కు నిల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మ‌నిపించ‌దు. మ‌రి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిగెత్తేట‌ప్పుడు కింద షూస్ లేకుండా, ఖాళీ చేతుల్తో ప‌రిగెత్తాలి. దీంతో సాధార‌ణ స‌మ‌యాల్లో క‌న్నా 6 శాతం ఎక్కువ స్పీడ్‌తో ప‌రిగెత్త‌వ‌చ్చు. చేతుల్లో గ‌న్ ఉన్నా, కాళ్ల‌కు షూ ఉన్నా ప‌రిగెత్త‌డం కొంత స్లో అవుతుంది. క‌నుక అవి తీసేస్తే మ‌రింత వేగంగా ప‌రిగెత్త‌వ‌చ్చు. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు ఎలాగూ వాటిని ధ‌రిస్తారు క‌నుక స‌మ‌స్య ఉండ‌దు.

2. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ్యాప్ మ‌ధ్య‌లో ఉండేలా చూసుకోవాలి. ప‌బ్‌జి ఎల‌క్ట్రిక్ ప‌ల్స్ ఎటు నుంచి వ‌స్తుందో మ్యాప్ లో ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించాలి.

3. ఆరంభంలో ప్లేన్ నుంచి దిగేట‌ప్పుడు టౌన్ ఏరియా కాకుండా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో దిగాలి. అలాంటి ప్ర‌దేశాల్లో చిన్న చిన్న నివాసాల్లో ఉండే లూట్‌ను తీసుకోవాలి. టౌన్ ఏరియాల్లో అయితే లూట్ బాగా ల‌భిస్తుంది. కానీ ప్లేయ‌ర్లు ఆ ఏరియాల్లో ఎక్కువ‌గా ఉంటారు క‌నుక‌.. చాలా సేపు వారికి ఎదురొడ్డి నిల‌వ‌డం క‌ష్టంగా ఉంటుంది. అదే నిర్మానుష్య ప్రాంతం అయితే లూట్ ల‌భించే వ‌ర‌కు రిస్క్ లేకుండా ఉండ‌వ‌చ్చు. ఒక‌సారి వెప‌న్స్‌, హెల్త్ ప్యాక్‌లు, ప్రొటెక్ష‌న్ ల‌భించాక టౌన్ వైపు వెళ్లాలి. గేమ్ ఆరంభంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వీటిని పొందాలి.

4. మ‌రొక ప్లేయ‌ర్ వ‌చ్చి మీపై షూట్ చేసేట‌ప్పుడు ఎదురుగా నిల‌బ‌డ‌కుండా ర‌న్నింగ్ చేస్తూ.. లేదంటే నేల‌పై పాకుతూ ఫైరింగ్ చేయాలి. మూవ్‌మెంట్ క‌చ్చితంగా ఉండాలి. దీంతో అవ‌త‌లి ప్లేయ‌ర్ మిమ్మ‌ల్ని అంత సుల‌భంగా షూట్ చేయ‌లేడు. అలాగే చెట్లు, రాళ్లు, నివాసాల స‌మీపంలో ఉంటే వాటి చాటున ఉండి ఫైరింగ్ చేయ‌వ‌చ్చు.

5. గేమ్‌లో హెల్త్‌పై ఓ క‌న్నేసి ఉంచాలి. హెల్త్ త‌గ్గుతుంటే.. హెల్త్ ప్యాక్‌లు సేక‌రిస్తూ వాటిని ఉప‌యోగించి హెల్త్ రీచార్జి చేసుకోవాలి. ఇక ఒకేసారి ఒకరి క‌న్నా ఎక్కువ ప్లేయ‌ర్లు మిమ్మ‌ల్ని చుట్టు ముడితే కంగారు ప‌డ‌వ‌ద్దు. అంద‌రినీ ఒకేసారి ఫైర్ చేయాల‌నుకోవ‌ద్దు. అది చాలా రిస్క్‌. కేవ‌లం మీకు ద‌గ్గ‌ర‌గా ఉండే ఒక్కో ప్లేయ‌ర్‌ను ఎంచుకుని ఫైర్ చేయాలి.

6. వాహ‌నాల‌లో ప్ర‌యాణిస్తూ ఫైర్ చేస్తే చాలా సుల‌భంగా గేమ్ ఫినిష్ చేయ‌వ‌చ్చు. కానీ.. టీమ్‌గా ఉంటేనే అది చాలా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. ఇక బ్రిడ్జిలను దాటేట‌ప్పుడు రోడ్డు మార్గం క‌న్నా బోటు ద్వారా ప్ర‌యాణించ‌డం ఉత్త‌మం.

7. ఇత‌ర ప్లేయ‌ర్స్ ను షూట్ చేసి చంపాక వారి లూట్‌ను తీసుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. చాలా వ‌ర‌కు అలాంటి సంద‌ర్భాల్లో ఇంకో ప్లేయ‌ర్ మిమ్మ‌ల్ని షూట్ చేయ‌వ‌చ్చు. అలాగే గేమ్‌లో ఎప్పుడైనా అన్ని వైపుల నుంచి జాగ్ర‌త్త‌గా చూస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడు, ఎటు వైపు నుంచి మ‌రో ప్లేయ‌ర్ వ‌చ్చి షూట్ చేసేది తెలియ‌దు.

8. లాంగ్ రేంజ్ వెపన్స్ దొరికితే ఏదైనా షెల్ట‌ర్‌కు వెళ్లి అక్క‌డే ఉండాలి. షెల్ట‌ర్ పై భాగానికి చేరుకుని చుట్టూ క‌నిపెట్టుకుని ఉండాలి. దీంతో మీ ద‌గ్గ‌రికి వ‌చ్చే ఇత‌ర ప్లేయ‌ర్ల‌ను షూట్ చేయ‌డం తేలిక‌వుతుంది.

9. చివ‌రిగా బ్లూ ఎల‌క్ట్రిక్ స‌ర్కిల్ విష‌యానికి వ‌స్తే స‌మ‌యం గ‌డుస్తున్న‌కొద్దీ ఆ స‌ర్కిల్ కుచించుకుపోతుంది. అందులో చిక్కుకుంటే హెల్త్ వేగంగా త‌గ్గిపోయి ప్లేయ‌ర్స్ చ‌నిపోతారు. అయితే కొంత జాగ్ర‌త్త వ‌హిస్తే దీన్నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎలా అంటే.. బ్లూ స‌ర్కిల్ ప్రారంభానికి ముందే మ్యాప్‌లో వైట్ స‌ర్కిల్ క‌నిపిస్తుంది. అది సేఫ్టీ జోన్ అన్న‌మాట‌. అందులో ఉంటే బ్లూ స‌ర్కిల్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. కాక‌పోతే ఈ వైట్ స‌ర్కిల్‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సి ఉంటుంది.

2524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles