లక్షద్వీప్‌లో 4జీ సర్వీసులను ప్రారంభించిన తొలి ఆపరేటర్.. ఎయిర్‌టెల్..


Tue,June 18, 2019 05:58 PM

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ లక్షద్వీప్‌లో ఇవాళ 4జీ సర్వీసులను ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 4జీ సర్వీసులను ప్రారంభించిన తొలి ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ పేరుగాంచింది. కాగా లక్షద్వీప్‌లోని అగట్టి, బంగారం, కవరాట్టి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎయిర్‌టెల్ 4జీ సేవలు లభిస్తున్నాయి. అయితే మరో ద్వీపమైన అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే ఎయిర్‌టెల్ 4జీ సేవలను లాంచ్ చేసింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ సిమ్‌లను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. అయితే 2005లో తొలిసారిగా ఈ ద్వీపాల్లో మొబైల్ సర్వీస్‌లను కూడా ఎయిర్‌టెలే ప్రారంభించడం విశేషం.

1230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles