మహారాష్ట్రలో అమెజాన్ మరో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్..!


Wed,September 18, 2019 11:42 AM

ముంబై: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మహారాష్ట్రలోని బీవండి దగ్గర మరో నూతన ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. అందులో 1.5 మిలియన్ క్యూబిక్ ఫీట్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుందని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో ఆ సెంటర్‌కు సమీపంలో ఉన్న పలు ప్రాంతాల్లో వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలుంటుందని వారు తెలిపారు. కాగా ఈ సెంటర్‌తో కలిపి మహారాష్ట్రలో ఉన్న మొత్తం అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల సంఖ్య 14కు చేరుకోగా వాటిల్లో 16 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇక 2019 చివరి వరకు దేశంలోని 13 రాష్ర్టాల్లో 50 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అమెజాన్ ప్రణాళికలు రచిస్తోంది. వాటిల్లో 25 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల స్టోరేజ్ స్పేస్‌ను అమెజాన్ ఏర్పాటు చేసుకోనుంది. ఈ క్రమంలోనే నూతన ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా అమెజాన్ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, ఫ్యాషన్ తదితర ఉత్పత్తులను పెద్ద ఎత్తున డెలివరీ చేయనుంది.

1047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles