నూత‌న కిండిల్‌ డివైస్‌ను విడుద‌ల చేసిన అమెజాన్


Thu,March 21, 2019 10:11 AM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న నూత‌న కిండిల్ డివైస్ (10వ జ‌న‌రేష‌న్‌)ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6 ఇంచుల డిస్‌ప్లే, 600 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, వైఫై, 4జీబీ స్టోరేజ్‌, 4 వారాల బ్యాట‌రీ లైఫ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ల‌భిస్తున్న కిండిల్ యాప్‌లో యూజ‌ర్లు స్టోర్ చేసుకున్న బుక్స్‌, చ‌దివిన బుక్స్ ఇందులో ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. కాగా ఈ కొత్త కిండిల్ డివైస్‌ను రూ.7,999 ధ‌ర‌కు అమెజాన్‌లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. అందుకు గాను ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్ల‌ను కూడా ప్రారంభించారు. ఏప్రిల్ 9వ తేదీ క‌న్నా ముందు గానే ఈ కిండిల్‌ను కొనుగోలు చేస్తే యూజ‌ర్లు కొనే మొద‌టి పుస్త‌కంపై 100 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వ‌నున్నారు. ఇక అద‌నంగా రూ.1199 చెల్లిస్తే మ‌రో 2 సంవ‌త్స‌రాల ఎక్స్‌టెండెడ్ వారంటీ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంది. అలాగే రూ.1499 కు ఓ నూత‌న ప్రొటెక్టివ్ క‌వ‌ర్‌ను కూడా ఈ కిండిల్‌కు అందిస్తున్నారు.

1155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles