ప‌బ్‌జి మొబైల్‌కు పోటీగా మ‌రో గేమ్ వ‌చ్చేసింది..!


Wed,February 13, 2019 04:19 PM


ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఇప్పుడు గేమింగ్ ప్రియుల‌ను ఎంతగా ఆక‌ట్టుకుంటుందో అంద‌రికీ తెలిసిందే. పిల్ల‌లు, పెద్ద‌లు ఈ గేమ్‌ను ఎక్కువ‌గా ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌కు ఇప్పుడు మ‌రో కొత్త గేమ్ పోటీగా వ‌చ్చింది. దాని పేరే.. ఏపెక్స్ లెజెండ్స్‌..! ఈ గేమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ పీసీ, ప్లేస్టేష‌న్ 4, ఎక్స్‌బాక్స్ వ‌న్ గేమింగ్ ప్లాట్‌ఫాంల‌పై విడుద‌లైంది. త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ఈ గేమ్‌ను లాంచ్ చేయ‌నున్నారు.

ఏపెక్స్ లెజెండ్స్ గేమ్‌ను విండోస్ పీసీ ఉన్న‌వారు ఆరిజాన్ (origin) స్టోర్ నుంచి ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇక గేమ్ ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను పోలి ఉంటుంది. ఇందులోనూ ఆన్‌లైన్ లో ఇత‌ర ప్లేయ‌ర్స్‌తో గేమ్ ఆడాల్సి ఉంటుంది. ప‌బ్‌జి లాగానే ఇందులోనూ ప్లేయ‌ర్ల‌కు ర‌క ర‌కాల గ‌న్స్ అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఏపెక్స్ లెజెండ్స్ గేమ్ ఈ నెల 4వ తేదీన విడుద‌ల కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ గేమ్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని ప్లాట్‌ఫాంల‌లో క‌లిపి మొత్తం 25 మిలియ‌న్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీన్ని బ‌ట్టే చెప్ప‌వ‌చ్చు.. ఈ గేమ్‌కు గేమింగ్ ప్రియుల నుంచి ఎంత ఆద‌ర‌ణ ల‌భిస్తుందో..!

3061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles