అప్‌డేటెడ్ ప్రాసెస‌ర్లు, గ్రాఫిక్స్‌తో వ‌చ్చిన యాపిల్ కొత్త ఐమ్యాక్ పీసీలు


Wed,March 20, 2019 07:08 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ 2 ఏళ్ల త‌రువాత ఎట్ట‌కేల‌కు త‌న ఐమ్యాక్ కంప్యూట‌ర్ల‌ను అప్‌డేటెడ్ ఫీచ‌ర్ల‌తో అందిస్తున్న‌ది. 21.5 ఇంచుల ఐమ్యాక్ పీసీలో 8వ జ‌న‌రేషన్ క్వాడ్‌కోర్, సిక్స్ కోర్‌ ప్రాసెస‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల పాత ఐమ్యాక్ క‌న్నా 60 శాతం ఎక్కువ పెర్‌ఫార్మెన్స్‌ను కొత్త ఐమ్యాక్ ఇస్తుంది. అలాగే 27 ఇంచుల ఐమ్యాక్‌లో 9వ జ‌న‌రేష‌న్ 6 కోర్‌, 8 కోర్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆ మోడ‌ల్‌కు చెందిన పాత ఐమ్యాక్ క‌న్నా ఈ కొత్త ఐమ్యాక్ దాదాపుగా రెండున్న‌ర రెట్లు వేగంగా ప‌నిచేస్తుంది.

ఇక 21.5 ఇంచ్ ఐమ్యాక్‌లో రేడియాన్ ప్రొ వెగా 48 గ్రాఫిక్స్‌ను తొలిసారిగా అందిస్తున్నారు. దీంతో 21.5 ఇంచుల పాత ఐమ్యాక్ క‌న్నా కొత్త ఐమ్యాక్‌లో గ్రాఫిక్స్ ప్ర‌ద‌ర్శ‌న 80 శాతం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే 27 ఇంచుల ఐమ్యాక్‌లో రేడియాన్ ప్రొ వెగా గ్రాఫిక్స్‌ను అందిస్తున్నారు. దీంతో ఆ మోడ‌ల్ పాత ఐమ్యాక్ క‌న్నా కొత్త ఐమ్యాక్ గ్రాఫిక్స్ 50 శాతం మెరుగ్గా ఉంటాయి. కాగా 27 ఇంచ్ ఐమ్యాక్ డిస్‌ప్లే 5కె కు స‌పోర్ట్ చేస్తుంది. 21.5 ఇంచ్ ఐమ్యాక్ 4కెకు స‌పోర్ట్ చేస్తుంది. ఇక 21.5 ఇంచ్ ఐమ్యాక్ ప్రారంభ ధ‌ర రూ.1,19,900 ఉండ‌గా, 27 ఇంచుల ఐమ్యాక్ ప్రారంభ ధ‌ర రూ.1,69,900 గా ఉంది. వ‌చ్చే వారం నుంచి దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆథ‌రైజ్డ్ యాపిల్ రీసెల్ల‌ర్స్ ద‌గ్గ‌ర ఈ నూత‌న ఐమ్యాక్‌లు ల‌భ్యం కానున్నాయి.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles