కొత్త ఐఫోన్ల తయారీకి రీసైకిల్డ్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను వాడనున్న ఆపిల్..!


Thu,September 19, 2019 02:36 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తాను తయారు చేయబోయే నూతన ఐఫోన్లకు ఇకపై అరుదైన రీసైకిల్డ్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను వాడనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్లలో ఉండే టాప్టిక్ ఇంజిన్ కోసం ఆ ఎలిమెంట్స్‌ను ఉపయోగించనున్నారు. అయితే ప్రస్తుతం ఆ రీసైకిల్డ్ ఎలిమెంట్స్‌ను సేకరించడం చాలా కష్టంతో కూడుకున్న పని కాగా, అందుకు వ్యయం కూడా భారీగానే అవుతుంది. కనుకనే ఆ పదార్థాలను రీసైకిల్ చేసే కంపెనీలపై ఆపిల్ ఆధారపడింది. మరోవైపు ఫోన్లలో వాడే 17 రకాల ఎర్త్ మినరల్స్‌ను ప్రాసెసింగ్ చేసే రంగంలో చైనా ముందుండగా ఆ దేశం అమెరికాకు ఆ మినరల్స్‌ను ఎగుమతి చేయడంపై నియంత్రణ విధించింది. ఈ నేపథ్యంలోనే ఆ పదార్థాలను రీసైకిల్ చేసే కంపెనీల నుంచి సేకరించేందుకు ఆపిల్ నడుం బిగించింది.

ఆపిల్ ఎన్విరాన్‌మెంట్, పాలసీ అండ్ సోషల్ ఇనిషియేటివ్స్ వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు తాము ఇకపై ఐఫోన్లలో రీసైకిల్డ్ వస్తువులను ఉపయోగించనున్నామని తెలిపారు. ప్రస్తుతం సదరు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తున్నారని, తాము కూడా వాటిని తమ ఐఫోన్లలో వాడుతామని తెలిపారు. కాగా ఆపిల్ ఇప్పటికే రీసైకిల్ చేయబడిన అల్యూమినియంతో తన మాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుండగా, పాత ఐఫోన్లలో ఉండే బ్యాటరీల్లోని కోబాల్ట్‌ను రికవరీ చేసి వాటితో కొత్త ఐఫోన్ బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే తాము తయారు చేసే కొత్త ప్రొడక్ట్స్‌లో ఇకపై వీలైనంత వరకు రీసైకిల్డ్ వస్తువులను ఉపయోగించాలని ఆపిల్ నిర్ణయం తీసుకుంది.

902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles