ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ ఓఎంజీ డేస్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అసుస్ ఫోన్లు..!


Mon,April 15, 2019 01:37 PM

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అసుస్‌.. ఓఎంజీ డేస్ పేరిట ఓ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ సేల్ ఇవాళే ప్రారంభం కాగా ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో ప‌లు అసుస్ ఫోన్లను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా జెన్‌ఫోన్ 5జ‌డ్ ఫోన్‌పై రూ.3వేల తగ్గింపును, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, మ్యాక్స్ ఎం2, మ్యాక్స్ ఎం1 ఫోన్ల‌పై రూ.500 త‌గ్గింపును అందిస్తున్నారు. అలాగే జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1పై రూ.1వేయి త‌గ్గింపును అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌ను కూడా చాలా ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌కు అందిస్తున్నారు.

1249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles