వచ్చేస్తోంది.. బజాజ్‌ ఎలక్ట్రిక్‌ చేతక్‌.. రేపే మార్కెట్‌లోకి..!


Mon,January 13, 2020 06:02 PM

బజాజ్‌ ఆటోమొబైల్‌ కంపెనీకి చెందిన చేతక్‌ స్కూటర్‌ ఒకప్పుడు ఎంతగా పాపులర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ద్విచక్రవాహనదారులను అలరించేందుకు చేతక్‌ సరికొత్తగా ముస్తాబై వస్తున్నది. ఆధునిక హంగులతో నూతనంగా రూపుదిద్దుకున్న చేతక్‌ స్కూటర్‌ రేపు ముంబైలో విడుదల కానుంది. బజాజ్‌ కంపెనీ.. ఎలక్ట్రిక్‌ చేతక్‌ (ఇ-చేతక్‌) పేరిట ఆ వాహనాన్ని రేపు లాంచ్‌ చేయనుంది.

ఎలక్ట్రిక్‌ చేతక్‌ను బజాజ్‌ కంపెనీ గత అక్టోబర్‌ 16వ తేదీనే ప్రకటించింది. ఈ క్రమంలోనే చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు పాత చేతక్‌ స్థానంలో సరికొత్త ఎలక్ట్రిక్‌ చేతక్‌ను బజాజ్‌ వాహనదారుల ముందుకు తెస్తున్నది. బజాజ్‌ ఎలక్ట్రిక్‌ చేతక్‌ను సరికొత్త ఫీచర్లు, లుక్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే డిజైన్‌, కలర్స్‌, అధునాతన ఫీచర్లు కొత్త చేతక్‌లో అందివ్వనున్నారు. డేటా కమ్యూనికేషన్‌, సెక్యూరిటీ, యూజర్‌ అథెంటికేషన్‌ తదితర స్మార్ట్‌ ఫీచర్లను ఎలక్ట్రిక్‌ చేతక్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మార్కెట్‌లో ఏథర్‌, ఒకినావా, హీరో తదితర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ చేతక్‌ వాటికి గట్టి పోటీనివ్వనుంది.


బజాజ్‌ ఎలక్ట్రిక్‌ చేతక్‌ను 2 ఏళ్ల పాటు సుమారుగా 1వేయి మంది కలిసి రూపొందించారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ ఫుల్‌ చార్జింగ్‌ అయ్యేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ ఆప్షన్‌ లేదు. బ్యాటరీలను మార్చుకునే అవకాశం కూడా లేదు. ఈ స్కూటర్లను పూణె సమీపంలోని బజాజ్‌ ప్లాంట్‌లో తయారు చేస్తుండగా వీటిని మరో వారం, 10 రోజుల్లో మార్కెట్‌లో విక్రయించనున్నారు. మొదటగా పూణె, బెంగళూరులలో ఈ స్కూటర్లు లభ్యం కానున్నాయి. ఇక ఈ స్కూటర్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.1 లక్ష వరకు ఉంటుందని సమాచారం.

7706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles