ప‌బ్‌జి మొబైల్ లాగే.. మ‌రో గేమ్ రాబోతున్న‌ది..!


Tue,March 19, 2019 03:34 PM

గేమింగ్ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న కాల్ ఆఫ్ డ్యూటీ ఇకపై మొబైల్ ప్లాట్‌ఫాంపై కూడా ల‌భ్యం కానుంది. ఈ మేర‌కు ఆ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేసే సంస్థ యాక్టివిజ‌న్ ప‌బ్‌జి మొబైల్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ టెన్సెంట్ గేమ్స్‌తో భాగ‌స్వామ్యం అయింది. ఈ క్ర‌మంలో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ త్వ‌ర‌లో మొబైల్ ప్లాట్‌ఫాంపై కూడా ల‌భ్యం కానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ఈ గేమ్ రానున్న వేస‌విలో ల‌భిస్తుంది. అయితే గేమ్‌ను ముందుగా పొందేందుకు ఇప్ప‌టికే గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను కూడా ప్రారంభించారు. ఈ క్ర‌మంలో యూజ‌ర్లు ప్రీ రిజిస్ట‌ర్ చేసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌ను అంద‌రి క‌న్నా ముందుగానే పొంద‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ ఆల్ఫా ద‌శలోనే ఉంది. త్వ‌ర‌లో బీటా వెర్ష‌న్‌ను లాంచ్ చేసి యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తారు. ఆ త‌రువాత పూర్తి స్థాయి వెర్ష‌న్‌లో ఈ గేమ్‌ను లాంచ్ చేస్తారు. ఇక ఈ గేమ్ అచ్చం ప‌బ్‌జి మొబైల్‌ను పోలి ఉంటుంది. అందులోలాగే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లోనూ యూజ‌ర్లు ఆన్‌లైన్‌లో ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌వ‌చ్చు. ప‌లు ర‌కాల వెప‌న్స్‌తో ముందుకు సాగాలి. గేమ్ విన్ అయ్యే దాన్ని బ‌ట్టి ర్యాంకింగ్‌లు, రివార్డులు ల‌భిస్తాయి. అలాగే గేమ్‌లో ముందుకు వెళ్లే కొద్దీ ప‌లు లెవ‌ల్స్‌ను దాటాల్సి ఉంటుంది. ఇక గేమ్‌లో ప‌లు మ్యాప్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే భిన్న‌మైన క్యారెక్ట‌ర్లు ఉంటాయి. వాటిలో ప్లేయ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన క్యారెక్ట‌ర్‌ను ఎంచుకుని గేమ్ ఆడ‌వ‌చ్చు..!

1691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles