ప్యాంటు వెనుక జేబులో ప‌ర్సు, ఫోన్ పెట్టుకోకూడ‌దా..?


Thu,October 5, 2017 04:44 PM

ప్యాంట్లు ధ‌రించే స్త్రీ, పురుషులు ఎవ‌రైనా ప్యాంటు వెనుక జేబుల్లో ప‌ర్సులు, సెల్‌ఫోన్లు వంటివి పెట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. నేటి త‌రుణంలో చాలా మంది ఇలా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలా పెట్టుకున్న వ‌స్తువు ఏదైనా దాన్ని వెంట‌నే తేలిగ్గా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చ‌ని చాలా మంది భావిస్తారు. అయితే వాటిని వేగంగా బ‌య‌ట‌కు తీయ‌డం సౌక‌ర్యంగానే ఉంటుంది, కానీ నిజానికి ఇలా పెట్టుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా న‌డుముపై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది.

purse
purse

ప్యాంటు వెనుక జేబులో ప‌ర్సు లేదా సెల్ ఫోన్ పెట్టుకోవ‌డం వ‌ల్ల కూర్చున్న‌ప్పుడు పిరుదులు రెండూ స‌మానంగా ఆన‌వు. ఒక‌టి పైకి, మ‌రొక‌టి కింద‌కి ఉంటుంది. దీంతో వెన్నెముక వంగిన‌ట్టు అవుతుంది. ఈ క్ర‌మంలో న‌డుము నొప్పి వ‌స్తుంది. తొడ కండ‌రాలు ప‌ట్టేస్తాయి. నరాలు ప‌ట్టి లాగిన‌ట్టు అవుతుంది. దీర్ఘకాలికంగా ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఇంకా తీవ్ర‌త‌ర‌మ‌వుతాయి. క‌నుక ప్యాంటు వెనుక జేబులో ప‌ర్సు, ఫోన్ లాంటివి పెట్ట‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

6858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles