మరోసారి ఫేస్‌బుక్ యూజర్ల పాస్‌వర్డ్స్ లీక్.. మీ అకౌంట్‌ను ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి


Fri,March 22, 2019 04:41 PM

ఫేస్‌బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. మరో టెక్నికల్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఫేస్‌బుక్ తాజాగా ప్రకటించింది. ఫేస్‌బుక్‌కు చెందిన మిలియన్ యూజర్ల డేటా చిక్కుల్లో పడింది. యూజర్ల పాస్‌వర్డ్స్ అన్నీ టెక్స్ ఫార్మాట్‌లో తమ ఇంటర్నల్ సర్వర్స్‌లో స్టోర్ అయ్యాయని.. అవి తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని ఫేస్‌బుక్ వెల్లడించింది.

ఫేస్‌బుక్ పాస్‌వర్డ్స్ అన్నీ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. జనవరిలో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఈ సమస్య ఎదురైనట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే.. పాస్‌వర్డ్స్ కంపెనీలోనే లీక్ అవడం వల్ల యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కంపెనీ వాటిని మిస్‌యూజ్ చేయదని తెలిపింది.

మిలియన్ యూజర్ల డేటా లీక్ అవడంతో యూజర్లంతా మరోసారి పాస్‌వర్డ్ మార్చుకుంటే బెటర్ అని ఫేస్‌బుక్ సూచించింది. ఎక్కువగా ఫేస్‌బుక్ లైట్ యూజర్స్ ఆతర్వాత ఫేస్‌బుక్ యూజర్స్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ డేటా లీక్ అయినట్లు తెలిపింది. అందులోనూ ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయ్యే ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ డేటా మాత్రమే లీక్ అయిందట.

అందుకే ఫేస్‌బుక్ యూజర్స్ అంతా సెక్యూరిటీని పెంచుకోవడం కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్(2ఎఫ్‌ఏ)ను ఉపయోగించాలని తెలిపింది. టూఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే యూజర్ రిజిస్టర్డ్ మొబైల్‌కు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా మాత్రమే ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా.. రిజిస్టర్డ్ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఆ మేసేజ్‌కు ఎస్ అంటేనే ఫేస్‌బుక్ ఓపెన్ అవుతుంది.

ఫోన్ నెంబర్ షేర్ చేయడం ఇష్టం లేనివాళ్లు.. థర్డ్ పార్టీ అథెంటికేషన్ యాప్స్ అయినటువంటి గూగుల్ అథెంటికేటర్‌ను ఉపయోగించి సెక్యూరిటీ కోడ్‌ను జనరేట్ చేసి ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవచ్చు. దీనివల్ల మీ అకౌంట్‌కు ఎటువంటి సమస్యా రాదు. ఒకవేళ పాస్‌వర్డ్ లీక్ అయినా మీ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరు.

1678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles